Temporary marriage in islamic law

Temporary Marriage in Islamic Law

Temporary Marriage in Islamic Law

Temporary Marriage in Islamic Law.png

Posted: 01/28/2013 06:38 PM IST
Temporary marriage in islamic law

Islamic_Lawనాకు పదహారు సంవత్సరాల వయస్సులో నాలుగు సంవత్సరాల క్రింద మా పెద్దలు నాకు తాత్కాలిక వివాహము ముస్లిం చట్టం ప్రకారం రెండు సంల కాలపరిమితితో వివాహము చేసుకొని ఇప్పుడు నాకు నలుగురు పిల్లలు కలరు. ఈ వివాహము ఇప్పుడు నా భర్తతో తాత్కాలిక వివాహ చట్టం ప్రకారం గడువు తీరినది కావున నీవు అనగా నన్ను నా భర్త నా పిల్లలను తీసుకొని ఇంట్లో నుంచి తీసుకొని వెళ్లిపొమ్మని అంటున్నాడు. అసలు తాత్కాలిక వివాహము అంటే ఏమిటి నాకు నా భర్త నుంచి ఏమైనా మనోవర్తి (అనగా పోషరక్షణ) వస్తుందో వస్తే నేను ఏమి చేయాలి. ఈవిధంగా నా పిల్లలకు ఎలాంటి హక్కులు ఉన్నవి పూర్తి వివరాలు తెలుపగలరు.

తాత్కాలిక వివాహం గురించి ప్రస్తావన ముస్లిం చట్టంలో తప్ప ఎక్కడా లేదు. ఓ నిర్ణీత కాలానికిగాను ముస్లింలు తమ వివాహాన్ని చేసుకోవచ్చును. వీటినే తాత్కాలిక వివాహములు (మ్యూ టా) అంటారు. షియా శాఖకు చెందిన ముస్లిం యువకుడు ముస్లిం యువతిని గాని, ఇస్లాం మతం గాని నమ్మి వేరే యువతిని (కిటానియా)ని మ్యూటా వివాహానికి ఒప్పందం చేసుకోవచ్చు. అయితే షియా యువతి మ్యూటా వివాహాన్ని ముస్లిం యువకులతో మాత్రమే ఒప్పందం చేసుకోవలసి ఉంటుంది. దాంపత్య జీవితాన్ని గడపడానికి నిర్ణీతమైన కాలపరిమితిని ఏర్పరచుకోవచ్చు. అది ఒక రోజు కావచ్చు ఒక సంవత్సరం కావచ్చు లేక కొన్ని సంవత్సరాలు కావచ్చు. మోహర మొత్తానికి కూడా నిర్ణయించుకోవచ్చు. ఈ మ్యూటా వివాహం వల్ల దంపతులు ఇరువురికి ఎలాంటి వారసత్వ హక్కులు రావు.ఈ మ్యూటా వివాహము వలన కలిగిన నీ యొక్క సంతానానికి మాత్రము వారసత్వ హక్కులు ఉంటాయి.

మీరిద్దరు మధ్యలో ఏర్పరచుకున్న నిర్నీత కాలపరిమితి అయిన తరువాత వివాహము దానంతట అదే రద్దవుతుంది. దాని గురించి మీరు ఎప్పుడు ఎలాంటి న్యాయ స్థానాలకు వెళ్లవలసిన అవసరం లేదు. ఒక వేళ నీ భర్త ఒప్పందం కన్న ముందు విడిపోవాలంటే మీకు ఓ కానుకగా ఆస్తిగానీ, కొంత మొత్తంలో డబ్బుగాని, మరే రూపంలో గాని ప్రతి ఫలం ఇచ్చి ఆ వివాహానిి ఫుల్‌స్టాప్‌ పెట్టవచ్చు. దీనినే హిబ్బా-ఈ-ముద్దల్‌ అంటారు. నీకు నా భార్య దగ్గర కాలపరిమితి అయిన తరువాత మనోవర్తి అనగా పోషణ, రక్షణ నీభర్త నుంచి పొందే అధికారం లేదు. ఇక్కడ నీ పిల్లలకు మాత్రం వారసత్వ చట్టం ప్రకారం నీ భర్త సంపా దించిన ఆస్తిలో హక్కు అడిగే అధికారం కలదు. అదే విధం గా నీవు నీ పిల్లలను దూరం చేసుకొని లేదా నీ పిల్లలను నీ వెంట తీసుకొని వెళ్లినా వేరే అతనిని వివాహము చేసుకొని అతని ద్వారా సంపాదించిన ఆస్తిలో ముందు భర్తకు కలిగిన పిల్లలకు ఇప్పటి భర్త ద్వారా కలిగిన పిల్లలకు అందరికి సమాన హక్కులు కలవు.అదే వారసత్వ చట్టం ప్రకారం మాత్రమే ఆస్తులలో వాటా కలదు. కానీ పిల్లలెవరికి నెల పోషణ గురించి గానీ ఎలాంటి అధికారాలు లేవు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Divorce laws
Lease agreement registration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles