Lease agreement registration

Lease Agreement Registration

Lease Agreement Registration

Lease Agreement Registrationd.png

Posted: 01/19/2013 12:50 PM IST
Lease agreement registration

School_Buildingనేను ఒక వ్యాపార నిమిత్తం యజమానిగా నాకున్న ఇల్లు నెలకు 5,000 అద్దె ప్రకారం వెంకటేశ్వర్‌రావుకి స్కూ ల్‌ గురించి ఇచ్చినాను. దాని కాలపరిమితి 5 సంరాలు ఇపుడు అతను నెలవారీ అద్దె సరిగా ఇవ్వకుండా ఆ ఇల్లు నాకు ఎలాంటి అనుమతి లేకుండా వేరే వ్యక్తికి ఇచ్చినాడు. అతను నా ఇల్లు ఖాళీ చేయకుండా నా పై దౌర్జన్యం చేస్తున్నా డు. నా దగ్గర అద్దెకు తీసుకొన్న వ్యక్తిని ఇదేమిటని అడుగ గా అతనికి నేను అప్పు ఉన్నాను. కావున ఆ అప్పు నిమిత్తం నీ ఇల్లు అతనికి స్వాధీనం చేసితిని, కావున నా బదులు నేను చేసిన అప్పు అతనికి తీర్చినచో ఆ ఇల్లు నీకు స్వాధీ నం చేయబడును, లేనిచో నాకు కొంత సమయం ఇచ్చిన చో నేను సంపాదించి అప్పు తీర్చిన తరువాత నీ ఇల్లు నీకు ఇప్పించగలను. దానికి నేను సమయం చెప్పలేను అని అంటున్నాడు. దీనికి న్యాయ పరిష్కారం చెప్పగలరు.

అగ్రిమెంట్‌ రెండు రకములు. అందులో ఒకటి రెంటల్‌ అగ్రిమెంట్‌. రెండవది లీజు అగ్రిమెంట్‌. రెంటల్‌ అగ్రి మెంట్‌ అనగా సంవత్సరంలోపు కాలపరిమితి ఉండేది. దానికి తిరిగి కాలపరిమితి మళ్లీ రాసుకొనవలెను. అలా రాసుకోని పక్షంలో అద్దెదారుని కాలపరిమితి తరువాత ఏక్ష ణమైనా ఎలాంటి నోటీసు లేకుండా ఖాళీ చేయించే అధికా రం యజమానికి కలదు. దానినే రెంటల్‌ అగ్రిమెంట్‌ అం టారు. రెండవది, నీవు ఇచ్చిన ఇల్లు నీవు చెప్పిన దానిని బట్టి అగ్రిమెంట్‌ ఆఫ్‌ లీజ్‌ అని అంటారు. అలాంటి అగ్రి మెంట్‌ లీజును తప్పనిసరిగా మీ దగ్గరలోని రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయవలెను.అలా చేయని పక్షంలో అది న్యాయపరంగా చెల్లుబాటు కాదు. అందువ లన నీవు ఇచ్చినటు వంటి లీజు అగ్రిమెంట్‌ రిజిస్టర్‌ చేసిన ట్లు ఎక్కడ చెప్పలేదు.

కావున అలాంటి అద్దె ఒప్పందం లేనట్లుగా పరిగణించబడుతుంది. రెంట్‌ కంట్రోల్‌ చట్టం ప్రకారం సెక్షన్‌ 106 లో ఉదహరించిన విధంగా నోటీసు జారీ చేసి అద్దె దారుని ఖాళీ చేయించే అధికారం నీకు ఉన్నది. అద్దెకు సంబంధించి లిఖిత పూర్వక ఒప్పందం ఉన్నప్పుడు, ఆ ఒప్పంద కాలపరిమితి ముగిసిన తరువాత మాత్రం సెక్షన్‌ 106 ప్రకారం నీకు ఇచ్చిన అగ్రిమెంట్‌ చెల్లదు అని నోటీసు ద్వారా ఇచ్చి ఖాళీ చేయించవచ్చు. అదే విధంగా నీ దగ్గర అద్దెకు తీసుకున్న వ్యక్తి వేరే వ్యక్తికి అద్దెకు ఇవ్వడం దానిని సబ్‌లీజ్‌ అంటారు. నీ అనుమతి లేకుండా సబ్‌ లీజుకు ఇచ్చే అధికారం లేదు.కాబట్టి ఆచట్ట ప్రకారం మూడవ వ్యక్తిని ఖాళీ చేయించే అధికారం నీకు కలదు. నీవు మూడవ వ్యక్తికి ఎలాంటి నోటీసు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇది నీవు చట్ట ప్రకారం ఖాళీ చేయించా లంటే రెంట్‌ కంట్రోల్‌ యాక్ట్‌ ప్రకారం ఎలాంటి నోటీసు లేకుండా ఖాళీ చేయించమని న్యాయ స్థానాన్ని అడిగే అధి కారం కలదని ఈ విధమైన తీర్పులు కలవు. సీకేఆర్‌ సుబ్బా రాయ ముదలియార్‌ వీ/ఎస్‌. టీటీ దేవస్థానమ్‌, తిరుపతి 2004, (5) ఏఎల్‌డీ 322 పేజ్‌) ఈ సెక్షన్‌ ప్రకారం రిజిస్టర్‌ కావలసిన లీజ్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ కాలేదు కాబట్టి ఇద్దరి వద్ద ఉన్న అగ్రిమెంట్లు సాక్ష్యంగా న్యాయస్థానాలు స్వీకరించవు.అటువంటి సందర్భాలలో అద్దె ఒప్పందంలో కాలపరిమితి అన్నది ప్రామాణీకము కాదు. అటువంటి అద్దె ఒప్పందాన్ని నెల కాలపరిమితితో కూడిన అద్దె ఒప్పందంగా పరిగణించ బడతాయి. అందు వలన నోటీసు పని లేదు. రెండవది నీ దగ్గర అద్దెకు తీసుకున్న వ్యక్తిని అతనికి సబ్‌ లీజ్‌కు తీసు కున్న వ్యక్తిని అనగా మూడవ వ్యక్తిని ఇద్దరిని పార్టీ చేస్తూ క్రిమినల్‌ కేసు పెట్టగలవు. అది సెక్షన్‌, మోసపూరిత, నమ్మకద్రోహం, మరియు ఛీటింగ్‌ కింద నమోదు చేస్తే చట్టప్రకారం వారికి శిక్ష పడును.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Temporary marriage in islamic law
Minor promissory note  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles