Minor promissory note

minor promissory note

minor promissory note

minor promissory note.png

Posted: 12/18/2012 11:57 AM IST
Minor promissory note

Lawమా అన్న 2009లో చనిపోయాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు ఆడపిల్లలు. అందరూ మైనర్లే. వారిలో ఎవరికీ 15 సంవత్సరాలు పూర్తి కాలేదు. మా అన్న చనిపోయే ముందు కొంత అప్పు చేసినాడు. ఆ అప్పుల బాధ భరించలేక చనిపోయాడు. ఆయన భార్య మా అన్న బ్రతికుండగానే వేరొకరితో వెళ్ళిపోయింది. ఇప్పుడు మా అన్న పిల్లలపై అప్పుదారులు ఒత్తిడి చేస్తూ ప్రామిసరి నోటు వ్రాసి ఇవ్వండి అని చెప్పుచున్నారు. ఇప్పుడు అలాంటి మైనర్‌ పిల్లలతో ప్రామిసరి నోటు వ్రాసి ఇస్తే అది చెల్లుబాటు అవుతుందా? ఈ విషయంలో తగిన న్యాయ సలహా ఇవ్వగలరు.

కాంట్రాక్టు చట్టంలోని 11వ సెక్షన్‌ క్రింద యుక్త వయస్కుడైన ప్రతి వ్యక్తి కాంట్రాక్టు చేసుకోవడానికి అర్హత కలిగివుంటాడు. భారత మైనారిటీ చట్టం 1875 క్రింద 18 సంవత్సరాల వయస్సు పూర్తి అయితేనే యుక్త వయస్సు వచ్చినట్లు పరిగణించడం జరుగుతుంది. ఏ వ్యక్తి విషయంలో గార్డియన్‌ నియమించాడో ఆ వ్యక్తి 21 సంవత్సరాలు వయస్సు పూర్తి అయి ఉండవలెను. గార్డియన్‌, వార్డుల చట్టం క్రింద గార్డియన్‌ నియమించినట్లయితే సహజ గార్డియన్‌ యొక్క హక్కులు రద్దవుతాయి. ప్రామిసరీ నోటు వ్రాసిన వ్యక్తి మైనర్‌ అయితే అది చెల్లుబాటు కాదు.అలా అతడొక ప్రామీసరి నోటు వ్రాసి ఇచ్చినట్లయితే చెల్లింపు పొందే వ్యక్తి దానిని ఆ మైనరుపై కోర్టులో అమలు చేయజాలడు. ఎందుకంటే అలాంటి ప్రామిసరీ నోటు అన్ని విధాల చెల్లనిది అయి వుంటుంది. మైనరు చిన్న వయస్సు వల్ల స్వచ్చమైన నిర్ణయాలు తీసుకోలేడు.

యుక్త వయస్కుడై ఉండడం వలన యుక్తా యుక్తమైన వ్యవహారాలలో ప్రవేశించగలిగేంత తెలివితేటలు కలిగి ఉంటాయి. మైనర్‌కు ప్రపంచ వ్యవహారాలు తెలియని కారణం చేత మోసానికి గురి కావచ్చు. లాభంలేని వ్యవహారంలో ఇరుకు పోయి తనహితానికి హానికంగా ప్రవర్తించవచ్చు. కాబట్టి ఈ కారణాలకు బట్టి, మైనరు వ్రాసి ఇచ్చిన ప్రామిసరీ నోటు చేల్లదు. అన్యాక్రాంత పత్రాల చట్టం యొక్క 26వ సెక్షన్‌ క్రింద, మైనర్‌ ప్రామిసరీ నోటును వ్రాసి ఇవ్వడానికి వీలు లేదని ఉంది. అలా అతడు వ్రాసి ఇచ్చినా... అది అతడిని బాధ్యున్ని చేయదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lease agreement registration
Government land registration  
Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles