Government land registration

government land registration

government land registration

government land registration.png

Posted: 12/07/2012 04:43 PM IST
Government land registration

నాకు ప్రభుత్వం వారు దా దాపు 20 సంవత్సరాల క్రి తం ఐదెకరాల ప్రభుత్వ పట్టా భూమి ఇచ్చినా రు. దానిని కష్టపడి, చాలా పెద్ద మొత్తం ఖర్చుచేసి చదును చేసి సుమారు 12 సంవత్సరాలు వరకు సాగు చేసినాను. ఈ ప్రాం తంలో వర్షాలు లేక, పనులేమీ లేక బ్రతక లేని పరిస్థితులలో, బ్రతుకు తెరువు కొరకు నాలుగేళ్ళు వేరే రాష్ట్రా నికి వెళ్ళి తిరిగి నా సొం త గ్రామానికి వచ్చినాను. ప్రస్తుతం... నాడు ప్రభుత్వం నాకు ఇచ్చిన పట్టా భూమిని వెరొకరు సాగు చేయుచున్నారు. దీనిపై గ్రామ పెద్దలను విచారించ గా ఈ భూమిపై ప్రభుత్వం వారు మీ పట్టా రద్దు చేసి వారికి పట్టా ఇచ్చినారు అని చెప్పా రు. ప్రస్తుతం నా పట్టా భూ మి వెరొకరికి స్వాధీనంలో ఉన్నది. తిరిగి ఆ భూమిని నేనెలా సొంత చేసుకో వాలి. ఈ విషయంలో నాకు సరైన పరిష్కారం చెప్పగలరు.                   

మీకు ప్రభుత్వం వారు ఇచ్చిన పట్టా తేది నుండి మీ స్వాధీనంలో సాగు చేస్తున్నట్లు మీ దగ్గర శిస్తు రసీదులు, ఇతర కాగితాలు ఉన్నా యో లేదో చెప్పలేదు. అలా ఉన్నట్లయితే మీ కు ఇచ్చిన పట్టాను రద్దు చేసే ముందు ప్రభు త్వం మీకు నోటిసు ఇవ్వాలి. ఆ నోటిసులో మీకు ఇచ్చి పట్టా ఎందుకు రద్దు చేస్తున్నారో ధృవీకరించాలి. అదే విధంగా మీకు ఇచ్చిన భూమి ఇచ్చిన తేది నుండి మీ స్వాధీనంలో నుండి తీసుకొని ఇతరులకు అమ్మినప్పుడు గాని, లేదా అప్పడినుండి ఆ భూమిని మీరు వినియోగించనప్పుడుగాని రద్దు చేయవ చ్చు. అలా కానప్పుడు ఆ భూమిని రద్దు చేయు అధికారం ప్రభుత్వానికి లేదు. అదే విధంగా మీకు ఇచ్చిన పట్టా రద్దు చేయకుం డా ఇతరులకు పట్టా ఇవ్వకూడదు. అందువలన మీరు వెంటనే... సాగు చేయని నాలుగు సంవత్సరాలు కూడా సాగు చేసినట్లుగాని (శిస్థు) పన్ను కట్టినట్లు గాని, లేదా ఇతర కారణాలు చూపుతూ, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్ళండి. లెటర్‌ ద్వారా దరఖాస్తు చేసుకొన్నచో, వెంటనే జిల్లా కలెక్టర్‌ విచారణ జరిపించి వెరొకరికి వచ్చిన పట్టా రద్దు చేసి తిరిగి ఆ భూమి మీకు స్వాధీన పరుస్తారు. దానికి తగిన అధికారం జిల్లా కలెక్టర్‌కు కలదు. అప్పడు మీకు తప్పక న్యాయం జరుగును.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minor promissory note
Andhra pradesh forest act  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles