4200 kilos of khairatabad laddu not distribute

4200 kilos of khairatabad laddu not distribute, 4,200-Kg Laddu For Khairatabad Ganesh, 4,200 Kg Laddu for Khairatabad Ganesh from Tapeswaram, Khairatabad Ganesh

4200 kilos of khairatabad laddu not distribute, 4,200-Kg Laddu For Khairatabad Ganesh, 4,200 Kg Laddu for Khairatabad Ganesh from Tapeswaram

పాడైపోయిన ఖైరతాబాద్ లడ్డూ -ఏడ్చిన మల్లిబాబు

Posted: 09/20/2013 07:35 PM IST
4200 kilos of khairatabad laddu not distribute

రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ లంబోదరుడి చేతిలో ఏర్పాటు చేసిన 4200 కిలోల లడ్డూ ఏకధాటిగా కురిసిన వర్షానికి తడిసింది. దాదాపు మూడు గంటల పాటు వర్షంలో తడవడంతో అది చక్కెర పానకంలా తయారైంది. లడ్డూను దించిన తర్వాత కవర్‌లతో కప్పి ఉంచడం వల్ల గాలి ఆడక కూడా అది చెడిపోయింది. ఒకవేళ లోపలి భాగం పాడవకుండా ఉంటే భక్తులకు పంపిణీ చేయాలని భావించారు. లడ్డూ మొత్తం పాడైపోవడంతో చేసేది లేక సాగర్ లో నిమజ్జనం చేశారు. భక్తులకు లడ్డూ పంపిణీ చేయకుండా నిమజ్జనం చేయడం ఖైరతాబాద్ లో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. లడ్డూ పాడవకుండా ఉంటే లక్షా 60 వేల మందికి పంచేవారు. ఖైరతాబాద్ వినాయకుడికి నైవేద్యంగా ఉంచిన లడ్డూను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. వర్షంలో తడిసిన లడ్డూ పాడైపోవడంతో దీన్ని హుస్సేన్ సాగర్ లో కలిపేశారు. చెడిపోకుండా ఉంటే భక్తులకు పంపిణీ చేయాలని నిర్వాహకులు భావించారు. భక్తుల కూడా మహాగణపతి ప్రసాదం కోసం భారీగా తరలివచ్చారు. లడ్డూ పూర్తిగా పాడైపోయిందని, తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు తేల్చారు. దీంతో భక్తులు నిరాశగా వెనుదిరిగారు.

 

కన్నీళ్లు పెట్టుకున్న మల్లిబాబు

లడ్డూ పాడైపోవడంతో దాన్ని తయారుచేయించిన సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే లడ్డూ పాడైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 16 మంది గణేష్ మాలలు ధరించి వారం రోజుల పాటు కష్టపడి అత్యంత పవిత్రంగా లడ్డూను తయారు చేశారని చెప్పారు. తానెంతో వ్యయప్రయాసలకోర్చి తయారు చేయించిన లడ్డూ భక్తులకు దక్కకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more