Chandrababu fire on telangana tdp leaders

chandrababu fire on telangana tdp leaders, tdp, chandrababu naidu, telangana tdp leaders meet on chandrababu, telangana tdp senior leaders, telangana issue, babu yatra, babu bus yatra,

chandrababu fire on telangana tdp leaders, telangana tdp leaders meet on chandrababu

తెలంగాణ సీనియర్లపై చంద్రబాబు ఫైర్

Posted: 09/13/2013 08:42 AM IST
Chandrababu fire on telangana tdp leaders

ఆత్మగౌరవ యాత్ర అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సీనియర్లపై దృష్టి సారించారు. ప్రజల సమస్యలు కంటే సీనియర్లతో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని బాబు కృతనిశ్చయానికి వచ్చినట్లున్నారు. మొదటి విడత బస్సు యాత్ర ముగిసిన సందర్భంగా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. యాత్రకు సంబంధించిన పలు విషయాలను వారితో చర్చించారు. తాను చెప్పిన విషయాలను ప్రజలు బాగానే రిసీవ్‌ చేసుకున్నారని, ప్రస్తుత పరిస్ధితిని ప్రజలకు వివరించడంలో సీనియర్ తమ్ముళ్లు విఫలమయ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌ సీపీ, టీఆర్‌ఎస్‌ నేతల కామెంట్లకు కౌంటర్‌ ఇవ్వడంలో సీనియర్‌ నాయకులు వెనుకబడ్డారని. లేఖ విషయం, సీమాంధ్రకు న్యాయం తదితర అంశాలను సీమాంధ్ర ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆ ప్రాంత నేతలు చతికిలపడ్డారనే విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి రెండు ప్రాంతాల్లో తమ సమస్యలు చెప్పుకుందామనుకున్న సీనియర్‌ నేతలు బాబు ఆగ్రహంపై కంగుతిన్నట్లు కనబడుతోంది. ఈ సమయంలో ఏమీ మాట్లాడకుండా ఉండడమే సరైన మార్గమని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more