More barricades in hyderabad for metro rail

hyderabad metro, metro rail project secretary, hyderabad rangareddy collectors, ghmc, minni mathew

more barricades in hyderabad for metro rail

metro-rail.png

Posted: 04/02/2013 04:29 PM IST
More barricades in hyderabad for metro rail

minnie-mathew

మెట్రో నిర్మాణం వేగవంతం చెయ్యటం కోసం హైద్రాబాద్ నగరంలో మరో ఆరు చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ని మళ్ళించేందుకు ట్రాఫిక్ పోలీస్ కి అనుమతించటానికి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఛీఫ్ సెక్రటరీ మిన్నీ మాథ్యూ నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో జరిపిన సమావేశంలో నిర్ణయించబడింది.

బారికేడ్లను ఏర్పాటు చెయ్యవలసిన స్థలాలు ఇవి-

ఎస్.ఆర్.నగర్, పంజాగుట్ట, హైటెక్ సిటి, జుబిలీ చెక్ పోస్ట్, మెట్టుగుడ, సంగీత్ జంక్షన్, డిసిపి నార్త్ ఆఫీస్, పరేడ్ గ్రౌండ్స్, రసూల్ పురా, హెచ్ పి ఎస్, బేగం పేట్, గ్రీన్ ల్యాండ్స్.

చిన్న చిన్న దారులున్న చోట బ్లాకేడ్స్ పెట్టవద్దని మిన్నీ మాథ్యూ అన్నారు. దుకాణాల ముందున్న పెయిడ్ పార్కింగ్ లను తొలగించమని చెప్పారు. అయితే ఎక్కడా ట్రాఫిక్ కి అంతరాయం కలుగకూడదని కూడా అన్నారామె.  హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను, జిహెచ్ ఎమ్ సి అధికారులను పిలిచి, రోడు వెడల్పు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చెయ్యమని చెప్పారావిడ.

మెట్రో రైల్ అధికారులకు అభినందనలు తెలియజేస్తూ, న్యూయార్క్ లో ఈ మధ్య నిర్వహించిన గ్లోబల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లీడర్ షిప్ ఫోరమ్ లో ఈ ప్రోజెక్ట్ కి ఉత్తమ బహుమతి వచ్చిందని మిన్నీ మాథ్యూ తెలియజేసారు.

ఇప్పటి వరకు 506 పిల్లర్లు, 626 ఫౌండేషన్లు, 2276 సెగ్మెంట్లు పూర్తయ్యాయి. హైద్రాబాద్ మెట్రో రైల్ ఎమ్ డి ఎన్ వి ఎస్ రెడ్డి మాట్లాడుతూ, 72 కి.మీ. ల మూడు మెట్రో రైలు కారిడార్ లలో 30 శాతం అనగా 22 కి.మీ వరకు బారికేడ్లను ఏర్పాటు చేసామని చెప్పారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ghmc nets a record tax collection
Chandrababu naidu to celebrate 31st tdp foundation day at pithapuram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more