Chandrababu naidu to celebrate 31st tdp foundation day at pithapuram

tdp foundation day, 31st foundation day celebration, chandrababu naidu, tdp leaders, pithapuram, talasani srinivas yadav, celebrate 31st tdp foundation day at pithapuram

chandrababu naidu to celebrate 31st tdp foundation day at pithapuram

chandrababu.gif

Posted: 03/29/2013 04:54 PM IST
Chandrababu naidu to celebrate 31st tdp foundation day at pithapuram

handrababu naidu to celebrate 31st tdp foundation day at pithapuram

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. పేదలకు, వృద్ధులకు పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెదపూడిలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాలులర్పించి. 31కేజీల కేక్‌ను కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బాబు, వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తండ్రిని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించి, పిల్ల కాంగ్రెస్ పార్టీ పెట్టిందని, రాజకీయ విలువలను నాశనం చేసిందని, ఈ పార్టీ అసెంబ్లీకి వస్తే దాన్ని కూడా దోచుకుంటారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పుడు తెలుగుదేశంపార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తుదని, టీడీపీ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని, వాళ్లు ఇంకా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

handrababu naidu to celebrate 31st tdp foundation day at pithapuram

తమకు అధికార కాంక్ష లేదని, టీడీపీ ప్రజలకోసమే పోరాటం చేస్తుందని, స్వార్ధం కోసంకాదని చంద్రబాబు పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలపై నాలుగు రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు దీక్షలు చేస్తున్నది ప్రజలకోసమేనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని పాలించే శక్తి ఒక్క టీడీపీకే ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని నగర పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీడీపీ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తలసాని, పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.  ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో టిడిపి నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడే విధంగా టిడిపి పాలన సాగిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు టిడిపిని స్థాపించారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  More barricades in hyderabad for metro rail
Five andhra ministers readies to tour in russia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more