International level project in shamshabad airpor

International Level project in Shamshabad Airpor.News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

International Level project in Shamshabad Airpor

Shamshabad Airpor.gif

Posted: 03/13/2012 06:37 PM IST
International level project in shamshabad airpor

International_Level_project

International_Level_projectదేశంలో తొలిసారిగా విమాన మరమ్మతుల ప్రాజెక్టు హైదరాబాద్‌లో కానుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను మలేషియా ఏరోస్పేస్‌, జిఎంఆర్‌ సంస్థల సంయుక్తభాగస్వామ్యంతో చేపట్టనున్నారు. విమానాశ్రయ నిర్వహనణలో అంతర్జాతీయ ప్రమాణాలకు ప్రాధాన్యతనిచ్చిన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఈ ప్రాజెక్టు అమలు చేసేందుకు కేంద్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.

దీంతో ఎట్టకేలకు ఇవాళ కేంద్రమంత్రి అజిత్‌ సింగ్‌ ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేయనున్నారు. దేశానికే తలమానికమైన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఓ అంతర్జాతీయ ప్రాజెక్టును అమలు చేయనుంది. విమానాల్లో సాంకేతికలోపం తలెత్తినపుడు మరమ్మతులు చేసే మెయింటెనెన్స్‌ అండ్‌ రిపేర్‌ ఓవరాల్‌ ప్రాజెక్టును అమలు చేసేందుకు అనుమతి లభించింది. ఇదివరకు విమానాల్లో ఏదైనా సాంకేతికలోపం తలెత్తినపుడు సింగపూర్‌గానీ, మలేషియాగానీ వెళ్లాల్సి వచ్చేది. లేదా అక్కడి నిపుణులు వచ్చి చూసేవారు. గత ఐదు నెలలక్రితం భారీ విమయానం మలేషియానుంచి సౌదీకి వెళ్తూ సాంకేతికలోపం తలెత్తడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌చేశారు. దుబాయ్‌నుంచి నిపుణులు రావాల్సి వచ్చింది.

దీంతో విమానాల్లో సాంకేతిక లోపాలను గుర్తించి సరిజేసే పూర్తిస్థాయి ప్రాజెక్టును జిఎంఆర్‌ సంస్థ ఏర్పాటు చేసింది. దేశంలో ఎక్కడైనా విమానంలో సాంకేతికలోపం చోటుచేసుకుంటే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రావాల్సి ఉంటుంది. మలేషియా ఏరోస్పేస్‌, జిఎంఆర్‌ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టును కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి అజిత్‌సింగ్, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే తొలిగ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుగా రాణించిన శంషాబాద్‌ మెయింటెనెన్స్‌ రిపేరింగ్‌ ప్రాజెక్టు అమలుతో మరింత గుర్తింపు పొందనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Drinking water shortage likely
Water problems starts in hyderabad city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more