టాలీవుడ్ లో ఓ లీడింగ్ డైరక్టర్, గ్లామర్ డాల్ హీరోయిన్ కు మధ్య జరిగిన అఫైర్ గురించి అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది. వారి వ్యవహారం పీక్స్ లోకి చేరేసరికి మండిపోయిన సదరు దర్శకుడి భార్య ఇద్దరికీ గడ్డిపెట్టి విడగొట్టిందనే టాక్ కూడా వినిపించింది. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ మళ్లీ ఇప్పుడు ఆ బంధం గట్టి పడుతుండటంతో హాట్ టాపిక్ గా మారింది.
ఇంత కాలం గుట్టు చప్పుడు కాకుండా(అఫ్ కోర్స్ మీడియా దృష్టిలో పడ్డారులేండి) నడిపిన వ్యవహారం ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. కొన్ని నెలలు గ్యాప్ వచ్చింది కదా. సో... మరింత స్ట్రాంగ్ మారిన ఈ బంధం ఇప్పుడు అఫీషియల్ గానే మీడియాకే ఎక్కేసింది. అంతేకాదు ఆయనగారి వ్యవహారాలన్నింటిని ఆమె చూసుకునే స్థాయికి పరిస్థితి చేరుకుంది.
రీసెంట్ గా మీడియాతో ఇంటరాక్ట్ అయిన దర్శకుడే ఈ విషయం గురించి చెప్పటం విశేషం. ఇప్పటి నుంచి తన సినిమా వ్యవహారాలను ఓ ఏజెన్సీ చేతిలో పెట్టానని చెప్పిన ఆయన, మాటల మధ్యలో ఆ హీరోయిన్ పేరును కూడా ప్రస్తావించటం, తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఆ ఏజెన్సీ సీఈవో సదరు హీరోయినే కావటంతో విషయం మొత్తం క్లిస్టర్ క్లియర్ అయిపోయింది. అసలు సినిమాలు, చెడు వ్యసనాలతో నష్టపోయిన అతన్ని తిరిగి ఆర్థికంగా ఆదుకునేందుకే ఆ హీరోయిన్ ఇలా సీన్ లోకి ఎంటర్ అయినట్లు చెప్పకుంటున్నారు.
ఎంత రిలేషన్ అయినా ఇలా మరీ టూ మచ్ గా పబ్లిక్ అయిపోవటం అంటే మాములు విషయం కాదు. జనాలు ఎంతగా, ఎలాగ మాట్లాడుకున్నా సరే మాకేంటి అని దులుపుకునే స్వభావం ఉండటంతోనే వాళ్లు ఇలా రెచ్చిపోతున్నట్లు స్పష్టమౌతోంది. అయితే చెడామడా వాయించేసి అడ్డుకున్న డైరక్టర్ వైఫ్ ఇప్పడు ఎందుకు కామ్ గా ఉంది? ఏం చెప్పి ఆమెను సైలెంట్ చేశాడన్నదే అసలు పాయింట్.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more