25వ చిత్రం కోసం ముగ్గురు దర్శకులు | who will direct Mahesh 25th Movie.

Three top directors for superstar 25th film

Mahesh Babu 25th Film, Three Top Directors for Mahesh 25th film, who will direct Mahesh 25th Movie, Mahesh Babu trivikram third movie, Puri trivikram vamsi for Mahesh, three top directors for Super star

Three Top Directors tough fight for Mahesh Babu 's 25th Movie.

ఎంబీ 25 కోసం ముగ్గురు దర్శకులు!

Posted: 09/21/2016 05:57 PM IST
Three top directors for superstar 25th film

ఏ హీరోకైనా కెరీర్ లో మైలు రాయి చిత్రాలు ప్రత్యేకంగా ఉండాలని కోరుకోవటం సహజం. బాలయ్య వందో సినిమా, చిరు 150 ఇలా ఆ ఫిగర్ లను బట్టి అభిమానులతోపాటు, హీరోలు కూడా స్పెషల్ గా ఫీలవుతుంటారు. ఇక ఈ యేడాది మొదట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నాన్నకు ప్రేమతో 25వ సినిమా చేసి హిట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మరో టాప్ హీరో పాతిక సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీ గురిపెట్టింది.

టాలీవుడ్ సూపర్ స్టార్ త్వరలోనే ఆ మైలు రాయిని అందుకోబోతున్నాడు. ప్రస్తుతం మురగదాస్ తో చేస్తున్న సినిమా 23వది. దీని తర్వాత కొరటాల శివతో 24వ సినిమా చేస్తాడు. ఇక పాతిక సినిమా ఎవరి చేతిలో పెడతాడు అన్న దానిపైనే ఇప్పుడు డిస్కషన్ మొదలైంది. ఎందుకంటే ఈ రేసులో ముగ్గురు డైరక్టర్లు ఉండటమే కారణం. సినిమా స్క్రిప్ట్ ఏంటో కూడా రూపొందించకుండానే జనగణ మన అనే టైటిల్ ను ఫిక్స్ చేసేసి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసేశాడు స్పీడి డైరక్టర్ పూరి జగన్నాథ్. మహేష్ మానరిజంను టోటల్ గా మార్చేసి ఇప్పటికే పోకిరి, బిజినెస్ మెన్ లతో ట్రెండ్ సృష్టించిన ఈ కాంబో అయితేనే బావుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇక రెండో వ్యక్తి వంశీపైడిపల్లి. బృందావనం, ఎవడు, ఊపిరి హ్యాట్రిక్ హిట్లతో జోరు మీదున్న ఈ డైరక్టర్ తో మహేష్ సినిమాకి సంబంధించి అల్రెడీ నిర్మాతలు పీవీపీ వారు ప్రిన్స్ పుట్టినరోజున ఓ పోస్టర్ రిలీజ్ చేసేశారు కూడా. వైవిధ్యంగా తెరకెక్కించే వంశీ అయితేనే సెట్ అవుతుందని కొందరు అంటున్నారు. ఇక రేసులో కొత్తగా  వినిపిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్. అతడుతో సైలెంట్ హిట్ కొట్టినప్పటికీ, ఖలేజాతో పెద్ద ఫ్లాపే ఇచ్చాడు మాటల మంత్రికుడు, అయితే మహేష్ ను కొత్త కోణంలో చూపాడన్న ఆనందం మాత్రం ప్రేక్షకులకు మిగిలిపోయింది. దీంతో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రాన్ని త్రివిక్రమ్ లాంటి అన్ని వర్గాల ఆదరణ ఉన్న దర్శకుడి చేతిలో పెట్టాలని ఇంకోందరు ఫ్యాన్స్ కొరుకుంటున్నారు. చూద్దాం వీరిలో ఎవరికి ఆ భాగ్యం దక్కబోతుందో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  25th Movie  Trivikram  Vamsi Paidipally  Puri Jagannath  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more