kollywood and bollywood planing high budgeting movies like bahubali

Kollywood and bollywood planing high budgeting movies like bahubali

after great success of tollywood bahubali movie kollywood and bollywood directors are craze about telugu historical strories. they are planing to do big movies like bahubali

kollywood and bollywood planing high budgeting movies like bahubali

'బాహుబలి' లాంటి సినిమా తీస్తారంట...!

Posted: 06/08/2016 12:49 PM IST
Kollywood and bollywood planing high budgeting movies like bahubali

టాలీవుడ్ లో బాహుబలి క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమాకి వచ్చి బిజినెస్ కానీ, ఆ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఒక రేంజ్ కి తీసుకెళ్లింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఇలాంటి సినిమాలు మాకు కూడ కావాలంటూ బాలీవుడ్, కోలీవుడ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
 
బాహుబలికి వచ్చిన, వస్తున్న రెస్పాన్స్ ని చూసి కోలీవుడ్ , బాలీవుడ్ ఇండస్ట్రీలకు ఒక్కసారిగా దిమ్మతిరిగిందట. దీంతో వాళ్లు ఇలాంటి సినిమాలు మేము కూడ చేయగలం అన్నట్లుగా ఇప్పుడు సరికొత్త సినిమా ప్రొజెక్ట్స్ ని డిజైన్ చేసే వేటలో పడ్డట్లుగా సమాచారం తెలుస్తోంది. దీనికి తోడు ఈమధ్యనే తమిళ నటి కుష్బూ తన భర్త సుందర్ సి సుమారు 300కోట్ల బడ్జెట్ సినిమాని తీసే ప్లాన్ లో ఉన్నాడని, దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్స్స్ అన్నీ సిద్ధమైపోయాయని స్టేట్మెంట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మల్టీస్టారర్ గా చెయ్యాలని స్టార్ కాస్టింగ్ కోసమే చూస్తున్నామని చెప్పింది.
 
ఇప్పుడు బాలీవుడ్ లో కూడ ఇలాంటి సినిమాలు చేసేందుకు సౌత్ నుంచి వచ్చిన కథలను ఆహ్వానిస్తున్నట్లుగా సమాచారం. ప్రొడ్యూసర్స్ కరణ్ జోహార్, ఏక్తాకపూర్ అండ్ కో కూడ మంచి చారిత్రాత్మక సినిమాలు రూపొందించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. గతంలో మన దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇచ్చిన భజరంగీ భాయిజాన్ కథ ఎంతటి ఘనవిజయం సాధించిందో చెప్పక్కర్లేదు.
ఇప్పుడు అలాంటి కథలు వచ్చినా చేసేందుకు బాలీవుడ్ వర్గాలు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బాహుబలి సినిమా ఒక్కటే తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ని మార్చేసిందని, ఇక మేము కూడ అలాంటి సినిమాలు చేసేందుకు ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని చెప్తున్నారట బాలీవుడ్ అగ్ర నిర్మాతలు.
అలాగే, కోలీవుడ్ లో సైతం మంచి చారిత్రాత్మక కథలను రీసెర్చ్ చేసి తయారు చేయాలని అక్కడ యంగ్ రైటర్స్ కి చెప్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.

ఏది ఏమైనా, బాహుబలి సినిమా అనేది కేవలం తెలుగు చిత్ర సీమనే కాకుండా యావత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసిందని, ఇక మన తెలుగు సినిమాలపైనే అందరి దృష్టి ఉంటోందని చెప్తున్నారు సినీ పండితులు.
    
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more