అమ్మడి రేటు అప్పుడే అంతా.. మరి ఇపుడెంతో? | Boyapati Srinu Remuneration Details

Boyapati srinu remuneration details

Boyapati Srinu Remuneration For Bellamkonda Sai Srinivas, Boyapati Srinu Remuneration details, Boyapati Srinu upcoming film, Rakul Preet Singh movies, Rakul Preet Singh hot stills, Rakul Preet Singh Remuneration, Rakul Preet Singh stills, Rakul Preet Singh

Boyapati Srinu Remuneration For Bellamkonda Sai Srinivas: Director Boyapati Srinu latest blockbuster Sarrainodu film gets possitive talk. His Remuneration For Bellamkonda Sai Srinivas

అమ్మడి రేటు అప్పుడే అంతా.. మరి ఇపుడెంతో?

Posted: 04/26/2016 01:17 PM IST
Boyapati srinu remuneration details

‘లెజెండ్’ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఓ సినిమా ముహూర్త కార్యక్రమాలు జరుపుకుని, ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవడంతో బోయపాటి శ్రీను.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ను తెరకెక్కించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని, కలెక్షన్ల మోత మోగిస్తోంది.

ఇదిలా వుంటే సాయిశ్రీనివాస్ సినిమా కోసం బోయపాటి శ్రీను భారీగా రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ కోసం బోయపాటి ఏకంగా 12కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నాడని, అందులో 5కోట్లు అడ్వాన్స్ గా తీసుకున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ రెమ్యునరేషన్ కేవలం తన గత చిత్రాల మరియు తన ప్రతిభను గుర్తించి ఆఫర్ చేసినట్లుగా సమాచారం. కానీ ‘సరైనోడు’ విడుదలై మరింత కలెక్షన్ల మోత మోగిస్తుండటంతో సాయిశ్రీనివాస్ సినిమాకు రెమ్యునరేషన్ పెంచుతాడో లేక 12 కోట్లకే కొనసాగుతాడో అనే విషయం తెలియాల్సి వుంది.

ఇక ఈ సినిమా కోసం ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో రకుల్ డేట్స్ ను ‘సరైనోడు’ సినిమా కోసం తీసుకున్నట్లుగా తెలిసింది. సాయిశ్రీనివాస్ సినిమా కోసం రకుల్ కు కోటిన్నర రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లుగా తెలిసింది. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం... ప్రస్తుతం రకుల్ టాలీవుడ్ టాప్ 1 స్థానాన్ని సొంతం చేసుకోవడం వల్ల.. ఈ ప్రాజెక్ట్ కోసం తన రెమ్యునరేషన్ మరింతగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇలా సినిమా నటీనటులు, సాంకేతికనిపుణులకే ఇంత రేంజులో రెమ్యునరేషన్ ఖర్చు చేస్తే... ఇక సినిమా మొత్తానికి నిర్మాతలు ఏ బడ్జెట్ ను ఖర్చుపెడతారో ఏమో. ‘సరైనోడు’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సాయిశ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా తెలిసింది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Boyapati Srinu  Rakul Preet Singh  Sarrainodu  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more