Nandamuri Mokshagna debut film details

Nandamuri mokshagna debut film details

Nandamuri Mokshagna debut film fixed, Nandamuri Mokshagna movie news, Nandamuri Mokshagna movie gossips, Nandamuri Mokshagna stills, Nandamuri Mokshagna latest updates, Nandamuri Mokshagna stills, Balakrishna movie release dates, Balakrishna stills

Nandamuri Mokshagna debut film details: Nandamuri Balakrishna son Mokshagna debut film fixed. Singeetam srinivasarao direction. Aditya 999 title.

యువరాజుగా రాబోతున్న నందమూరి మోక్షజ్ఞ?

Posted: 01/09/2016 12:20 PM IST
Nandamuri mokshagna debut film details

నందమూరి అభిమానులకు ఈ ఏడాది పండగలే పండగలు అన్నట్లుగా కనిపిస్తోంది. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రస్తుతం బాలయ్య నటించిన ‘డిక్టేటర్’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలయ్యింది.

ఇదిలా వుంటే బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే విషయం తెలిసిందే. ప్రస్తుతం నటనలో శిక్షణ పొందుతున్నాడు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోయే సినిమా ఎలా వుండబోతుందోనని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మాస్, క్లాస్, యాక్టింగ్, రొమాంటిక్, లవ్.. అంటూ ఏ క్యారెక్టర్ తో ఎంట్రీ ఇస్తాడోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ ‘ఆదిత్య 369’ సీక్వెల్ లో నటించనున్నాడని సమాచారం. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా ‘ఆదిత్య 369’. ఈ సినిమాతో నటుడిగా బాలయ్యకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ‘ఆదిత్య 369’కు సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ పేరుతో బాలయ్య 100వ చిత్రంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇందులోని కీలకపాత్ర అయినటువంటి యువరాజుగా మోక్షజ్ఞతో చేయించాలని బాలకృష్ణ మరియు సింగీతం భావిస్తున్నట్లుగా తెలిసింది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ‘డిక్టేటర్’తో 99 చిత్రాలను పూర్తి చేసుకున్న బాలయ్య.. ఇంకా ఆలస్యం చేయకుండా ‘ఆదిత్య 999’ను ప్రారంభించడం ఖాయమని సినీవర్గాల సమాచారం. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఏ సినిమాతో వుంటుందో, ఎలా వుండబోతుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Mokshagna  debut film  Aditya 999  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more