Allu Arjun Father in Law Chandrasekhar Reddy house demolished

Bunny uncle chandrasekhar reddy house demolished in banjara hills

Allu Arjun Father in Law, Chandrasekhar Reddy Building, political vendata, TRS, Manchireddy kishan reddy, banjara hills, GHMC, bunny, bunny uncles house demolished, Allu Arjun Father in Law house demolished,

South Indian Top Actor Allu Arjun Father in Law Chandrasekhar Reddy house demolished in Banjara hills for Road extension...

అల్లు అర్జున్ మామను పోమ్మనలేక పోగబెడుతున్నారా..?

Posted: 12/16/2015 12:59 PM IST
Bunny uncle chandrasekhar reddy house demolished in banjara hills

దక్షిణాది స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మామకు అధికార టీఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో పేరున్న విద్యాసంస్థలకు అధిపతి అయిన చంద్రశేఖర్ రెడ్డిని పొమ్మనలేక పోగబెడుతోందా..? అంటే అలాంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన చంద్రశేఖర్ రెడ్డి.. టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే తర్వాత కిషన్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరడంతో చంద్రశేఖర్ రెడ్డికి పార్టీలో గుర్తింపు లేకుండా పోయింది. సౌమ్యుడిగా పేరున్న చంద్రశేఖర్ రెడ్డి మంచిరెడ్డి దూకుడు ముందు ఆగలేకపోయారన్న విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ తరుణంలో చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 7లో వున్న నివాసాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడం అధికార పార్టీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మెరిడియన్ స్కూల్ దగ్గర ఉన్న బన్ని మామగారిల్లును.. రోడ్డు వెడల్పు చేయడంలో భాగంగా ప్రభుత్వ అధికారులు కూల్చేశారు. కాగా తన ఇంటిని కూల్చేస్తామని అదికారులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అధికారులు మాత్రం చంద్రశేఖర్ రెడ్డి కి నోటీసులు జారీచేశామని ఇంట్లో కుటుంబ సభ్యులు ఆ నోటీసులు అందుకున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని అంటున్నారు. తన స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం తీసుకున్నందున భారీ పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానంటున్నారు.

అయితే చంద్రశేఖర్ రెడ్డినీ పార్టీలో నుంచి సాగనంపే కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి చర్యలకు అధికార పార్టీ పాల్పడిందన్న అరోపణలు వినబడుతున్నాయి. అధికార పార్టీ ప్రోత్భలంతోనే అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దూకుడుగా వున్న మంచిరెడ్డి తమ పక్షాన వున్నాక.. ఇక చంద్రశేఖర్ రెడ్డితో పనిలేదని భావించిన టీఆర్ఎస్ ఆయనను పోమ్మనలేక.. పోగబెట్టి పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తుందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. మరి నిజానిజాలేంటో పార్టీ నేతలకు, జీహెచ్ఎంసీ అధికారులకే తెలియాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Father in Law  Chandrasekhar Reddy  TRS  ManchiReddy kishan Reddy  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more