Manisharma joins in Balakrishna Dictator

Manisharma joins in balakrishna dictator

Manisharma joins in Balakrishna Dictator, Balakrishna Dictator Audio Date, Balakrishna Dictator First Look, Balakrishna Dictator Movie Release Date, Balakrishna Dictator Movie news, Balakrishna Dictator Movie shooting updates, Balakrishna Dictator News, Balakrishna Dictator Movie details, Balakrishna Dictator, Balakrishna Latest News, Balakrishna Movie News, Balakrishna Movie Updates

Manisharma joins in Balakrishna Dictator: Nandamuri balakrishna latest film Dictator. Anjali, sonal chauhan heroines. Srivas direction. Thaman music. Balakrishna Dictator Movie Release on Pongal 2016.

థమన్ అదృష్టం చేజారిపోయినట్లేనా?

Posted: 12/11/2015 05:05 PM IST
Manisharma joins in balakrishna dictator

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డిక్టేటర్’. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మరియు వేదాశ్వ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన అంజలి, సోనల్ చౌహన్, అక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను ఈనెల 20వ తేదిన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.

అయితే ఈ సినిమా రీరికార్డింగ్ విషయంలో థమన్ చాలా బాధపడుతున్నాడట. అసలే రాక రాక బాలయ్య సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం వస్తే, ప్రకృతి తనకు అడ్డుగా నిలుస్తుందని థమన్ బాధపడుతున్నాడట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... ఇటీవలే చెన్నైలో భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందులో థమన్ కూడా ఒకరు.

ఈ వర్షాలు, వరదల కారణంగా థమన్ రికార్డింగ్ స్టూడియో కూడా బాగా దెబ్బతిందట. దీంతో ‘డిక్టేటర్’ సినిమాకు రీరికార్డింగ్ విషయంలో కాస్త ఆలస్యం కానుందట. అందుకు మరో నెల రోజులు సమయం ఇస్తే ‘డిక్టేటర్’కు రీరికార్డింగ్ చేస్తానని, లేదంటే మణిశర్మతో రీరికార్డింగ్ చేయించుకోమని థమన్ ‘డిక్టేటర్’ దర్శకనిర్మాతలకు తెలియజేసాడని తెలిసింది. దీంతో తనకొచ్చిన అదృష్టం చేజారిపోయిందని థమన్ బాధపడుతున్నాడట.

అయితే విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర దర్శకనిర్మాతలు కూడా మణిశర్మ వైపే మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో బాలకృష్ణ నటించిన ఎన్నో చిత్రాలకు మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించాడు. అంతేకాకుండా రీరికార్డింగ్ లో మణిశర్మకు మంచి పేరుంది. అందువల్ల ‘డిక్టేటర్’ చిత్రం రీరికార్డింగ్ బాధ్యతలను మణిశర్మకు అప్పజెప్పడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్ర్కీన్ ప్లే ను ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లు అందిస్తున్నారు. చ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ‘డిక్టేటర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Dictator  Thaman  Manisharma  Anjali  sonal chauhan  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more