Allu Arjun Clarifies about Mega Family Cold War

Allu arjun clarifies about mega family cold war

Allu Arjun Clarifies on Mega Family Cold War, Allu Arjun Clarifies on Cold War, Allu Arjun mega fans, Allu Arjun latest issuce, Allu Arjun latest news, Allu Arjun movie news, Allu Arjun movie updates, Allu Arjun stills, Allu Arjun

Allu Arjun Clarifies about Mega Family Cold War: Tollywood stylish star Allu Arjun Clarifies on Cold War between Mega Family Heros. Allu arjun recently meets with mega fans.

ఫ్యాన్స్ కు బన్నీ స్ట్రాంగ్ క్లారిటీ ఇచ్చేసాడట

Posted: 11/03/2015 12:44 PM IST
Allu arjun clarifies about mega family cold war

మెగా ఫ్యామిలీ గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే వుంటాయి. ఇందులో వార్తలకంటే రూమర్లే ఎక్కువ. మెగా ఫ్యామిలీ విడిపోయిందని గతంలో వార్తలొచ్చాయి కానీ సమయం దొరికినప్పుడల్లా అందరూ కలుస్తూనే వున్నారు. మెగా ఈవెంట్ లకు పవన్ కళ్యాణ్ రాడు అంటూ నాగబాబు ఇటీవలే తన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందుకు బదులుగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలకు పవన్ కళ్యాణ్ విచ్చేసి సందడి చేసి, ఆ వార్తలకు స్వస్తి పలికాడు.

అంతేకాకుండా చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ సినిమా సక్సెస్ కావడం, ఈ సినిమాలో చిరంజీవి ఎంట్రీ ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ చాలా సంతోషించి స్పెషల్ గా చిరంజీవి, చరణ్ లను కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఇలా సమయం కుదిరినపుడల్లా మెగా కుటుంబ సభ్యులంతా కలుస్తూ సంతోషంగానే వున్నారు. కానీ మెగా ఫ్యామిలీ సభ్యుల్లో కోల్డ్ వార్ నడుస్తోందంటూ వార్తలొస్తూనే వున్నాయి.

కానీ ఈ వార్తలపై మెగా ఫ్యాన్స్ కు  స్టైలిష్ స్టార్ స్ట్రాంగ్ స్టేట్ మెంట్ ఇచ్చేసాడట. ఇటీవలే ‘కుమారి 21 ఎఫ్’ ఆడియో వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన బన్నీని మెగా ఫ్యాన్స్ కలిసారట. వారి కోరిక మేరకు ఫ్యాన్స్ తో ప్రత్యేకంగా కలిసి బన్నీ ముచ్చటించారు. అయితే ఇందులో మెగా ఫ్యాన్స్ కు కొన్ని విషయాలు స్పష్టం చేసి, స్ట్రాంగ్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసాడట బన్నీ.

మెగా ఫ్యామిలీలో ఎలాంటి కోల్డ్ వార్ నడవడం లేదని, అందరి మధ్య సన్నిహిత్యం బాగుందని తెలిపాడట. ఎప్పటికి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ వేరు కారని, మెగా హీరోస్ అంతా ఒకటేనని స్పష్టం చేసాడట. మెగా హీరోలకు సంబంధించిన సినిమా విడుదల సమయంలో ఏర్పాటు చేసే బ్యానర్లలో మెగా హీరోలందరి ఫోటోలు వుండేలా చూడాలని, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఫోటో ఖచ్చితంగా వుండాలని చెప్పాడట బన్ని.

మొత్తానికి బన్నీ ఇచ్చిన ఈ క్లారిటీతో మెగా అభిమానులు అంతా ఒక్కటయ్యే అవకాశం వున్నట్లుగా భావిస్తున్నారు సినీ అభిమానులు. మరి బన్నీ చెప్పినట్లుగా మెగా కుటుంబ హీరోల ఫ్యాన్స్ అంతా ఒక్కటిగా వుంటారో లేక మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటూ విడివిడిగా తమ అభిమానాన్ని చాటుతారో అనే విషయం భవిష్యత్తులోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Allu Arjun  Cold War  Clarfies  Mega Family  News  Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more