చిత్రపరిశ్రమలో జీరో సైజ్ బాడీ కలిగివున్న తారలకు క్రేజ్ కాస్త ఎక్కువగానే వుంటుంది. ఎక్స్ పోజ్ చేయడానికి వీలుగా వుంటుందని, తమ శరీరాకృతి అందంగా కనిపిస్తుందని తారలు తమ నడుమును జీరో సైజ్ లో మలుచుకుంటుంటారు. ఆమధ్య కరీనా కపూర్ తన జీర్ సైజ్ బాడీతో ఇండస్ట్రీని మత్తులో ముంచెత్తింది కానీ.. ఎక్కువకాలం మెయింటేన్ చేయలేకపోయింది. నిజానికి.. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి.. కొందరు మాత్రమే ఈ జీరో సైజ్ కి కసరత్తు చేస్తుంటారు. ఇప్పుడు వీరి జాబితాలోకి తాజాగా అమీ జాక్సన్ చేరిపోయింది.
సన్నజాజి తీగలాగా సోగ దేహం కలిగివున్నప్పటికీ.. ఈమె మరింత సన్నబడేందుకు క్రమం తప్పకుండా కసరత్తు చేస్తోందని సమాచారం. అసలు బికినీ వేయడానికి ఏమాత్రం శరీరభాష సరిపోదనిపించినా.. ఈమె మాత్రం నిద్రహారాలు మానేసి కసరత్తులు చేస్తోందిట. ఇదంతా అక్షయ్ సరసన నటించే ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ సినిమా కోసమేనని అమ్మడు స్వయంగా చెప్పింది. ఆ సినిమా స్ర్కిప్ట్ డిమాండ్ మేరకు అమీజాక్సన్ బికినీలో దర్శనమివ్వాల్సి వుంటుంది. అది కూడా కేవలం ఒక్కసారి కాదు.. రెండుమూడుసార్లు బికినీలో కనువిందు చేయాల్సి వుంటుంది. ఇప్పటికే ఆ సినిమా టీజర్ లో అమీజాన్స్ రెడ్ హాట్ బికినీ వేసుకుని, కనువిందు చేసింది. అయితే.. అందులో తన బాడీ స్లిమ్ గా లేదని, అందుకే తన శరీరాకృతిని మరింత స్లిమ్మింగ్ గా చేసుకునేందుకే మరింత కసరత్తు చేస్తున్నట్లు అమ్మడు చెబుతోంది.
ప్రస్తుతం ఈ అమ్మడు క్రమం తప్పకుండా జిమ్ముకెలుతోంది. అక్కడ కసరత్తులు బాగానే చేస్తోంది. అలాగే.. వీలున్నప్పుడల్లా స్విమ్మింగ్ సెషన్స్ కి వెళుతోంది. అంతేకాదు.. అక్షయ్ కూడా కొన్ని ట్రిక్స్ నేర్పిస్తున్నాడట. అప్పట్లో రతి అగ్నిహోత్రి - కృతిసనన్ ఇద్దరికి బికినీ బాడీల్ని తయారు చేయించాడు అక్షయ్. ఇప్పుడు ఎమీకి కూడా సాయం చేశాడు. ఏదేమైనా.. ఎమీ మాత్రం పట్టు వదలకుండా జీరో సైజ్ కోసం తెగ కష్టపడుతోంది. మరి.. ఈ జీరో సైజ్ ఈమె కెరీర్ కి ఎంత హెల్ప్ అవుతుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more