Hero Srikanth in Allu Arjun next film

Hero srikanth in allu arjun next film

Srikanth in Allu Arjun next film, Srikanth in Allu Arjun film, Allu Arjun movie news, Allu Arjun movie updates, Allu Arjun stills, Allu Arjun latest news, Allu Arjun, Srikanth movie news, Srikanth movie updates, Srikanth stills, Srikanth

Hero Srikanth in Allu Arjun next film: Stylish star allu arjun upcoming film under Boyapati srinu direction. Allu Aravind producer. Rakul preet singh heroine. Hero Srikanth acts in important role.

అల్లు అర్జున్ సినిమాలో శ్రీకాంత్

Posted: 07/27/2015 06:41 PM IST
Hero srikanth in allu arjun next film

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పలు చిత్రాల్లో నటించాడు. ‘శంకర్ దాదా MBBS’, ‘శంకర్ దాదా జిందాబాద్’ వంటి పలు చిత్రాల్లో నటించారు. అలాగే మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో చరణ్ కు బాబాయ్ పాత్రలో నటించాడు శ్రీకాంత్.

చరణ్, శ్రీకాంత్ ల కాంబినేషన్ బాగానే వర్కౌట్ అయ్యింది. అయితే ఈసారి శ్రీకాంత్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించనున్నాడని తెలిసింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

ఇందులో శ్రీకాంత్ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నాడని తెలిసింది. ఈ సినిమాలోని ఓ ముఖ్య పాత్ర కోసం ఇటీవలే చిత్ర దర్శకులు శ్రీకాంత్ ను కలిసి ఈ చిత్ర కథ వినిపించాడట. స్టోరీ బాగా నచ్చడంతో శ్రీకాంత్ కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. అలాగే ఈ సినిమాలో తమిళ నటుడు ఆది పినిశెట్టి ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. కమర్షియల్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srikanth  Allu arjun  Movie News  Boyapati srinu  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more