‘భీమవరం బుల్లోడు’ సినిమా తర్వాత సునీల్ హీరోగా సునీల్ హీరోగా ‘జోష్’ ఫేం దర్శకుడు వాసు వర్మ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదే కాకుండా ఇటీవలే వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో సునీల్ ఓ సినిమా చేయనున్నాడు.
త్వరలోనే ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఇందులో సునీల్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ భామను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. హిందీలో ‘రాక్ ఆన్’, ‘వన్స్ అపాన్ అ టైం ఇన్ ముంబై’, ‘బోల్ బచ్చన్’ సినిమాలతో మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ ప్రాచి దేశాయ్ ను సునీల్ సరసన హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తెలిసింది.
ఇటీవలే ప్రాచి దేశాయ్ ను వంశీ ఆకెళ్ల కలిసి ఈ సినిమా కథ వినిపించాడట, ప్రాచికి ఈ కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో వున్నట్లుగా తెలిసింది. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రేమకథా చిత్రమ్’ నిర్మాత అయిన సుదర్శన్ రెడ్డి ఆర్.ఫై.ఏ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా తెలియజేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more