actress poonam bajwa got huge tamil offer to act in horror movie aranmai sequel | kollywood gossips

Poonam bajwa huge tamil offer horror movie aranmai sequel

poonam bajwa, poonam bajwa hot photos, poonam bajwa movies, poonam bajwa wikipedia, poonam bajwa gallery, poonam bajwa photo gallery, poonam bajwa history, poonam bajwa tamil movies, poonam bajwa, trisha krishnan, trisha hot photos, aranmai sequel movie, hansika motwani news

poonam bajwa huge tamil offer horror movie aranmai sequel : actress poonam bajwa got huge tamil offer to act in horror movie aranmai sequel. In this movie trisha and hansika motwani are playing lead roles which is to be directed by sundar c.

దెయ్యాల గూటిలో చిక్కుకున్న పూనం

Posted: 06/02/2015 01:37 PM IST
Poonam bajwa huge tamil offer horror movie aranmai sequel

రిస్క్.. జీవితంలో కొత్త మలుపు తీసుకురావచ్చు లేదా మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టవచ్చు. ఈ విషయాన్ని గ్రహించినవారు చాలావరకు ‘రిస్క్’ తీసుకోరు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ.. సాఫీగా కొనసాగించడానికి ఇష్టపడతారు. ‘ఆల్రెడీ కష్టాల్లో వున్న లైఫ్ ని మరింత ‘రిస్క్’లో ఎందుకు నెట్టేయాలి’ అంటూ సైడైపోతారు. కానీ.. మరికొందరు మాత్రం తమ ఆశయాలను, లక్ష్యాన్ని చేరుకోవడం కోసం జీవితాన్ని పణంగా పెడతారు. వారి దగ్గర అనుభవించడానికి ఎన్నో సౌకర్యాలున్నా, లేకపోయినా.. ఏదో సాధించాలన్న తపనతో ‘రిస్క్’ తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటివారి కోవలోకి తాజాగా నటి పూనం బాజ్వా చేరిపోయినట్లు కనిపిస్తోంది.

‘బాస్’, ‘పరుగు’ వంటి సినిమాల్లో నటించిన పూనం బాజ్వాకి ఆ తర్వాత తెలుగులో మరే అవకాశాలు రాకపోవడంతో తమిళ, మలయాళ సినిమాలపై దృష్టి సారించింది. అక్కడ అందివచ్చిన చిన్నాచితకా సినిమాలు కాలక్షేపం చేసిన ఈ అమ్మడు.. భారీ సినిమాలో ఆఫర్ దక్కించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. కేవలం చిన్న సినిమాలు చేసుకుంటూ కాలం వెళ్లదీయకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న తపనతో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించాలన్న కోరికతో ముందడుగు వేసింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి ఓ భారీ ఆఫర్ వరించింది. ప్రస్తుతం భోగీ అనే తమిళ సినిమాలో నటిస్తున్న పూనంకు.. హారర్ నేపథ్యంలో కొనసాగే ఓ చిత్రంలో ఈమె వైవిధ్యభరితమైన పాత్ర పోషించే భారీ ఆఫర్ సొంతం చేసుకుంది.

ప్రముఖ దర్శకుడు సుందర్.సి దర్శకత్వం వహిస్తున్న ‘అరణ్మనై’ సీక్వెల్ లో నటించే చాన్స్ పూనంకు లభించిందని కోలీవుడ్ న్యూస్! ఈ హారర్ మూవీలో ఇప్పటికే త్రిష, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే.. మరో కీలకపాత్ర కూడా వుండటంతో దానికోసం పూనంను సంప్రదించి ఆమెను తీసుకున్నారట! అందుకు ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం! అయితే.. ఇద్దరూ స్టార్ హీరోయిన్లు వున్న ఈ చిత్రంలో పూనంకి గుర్తింపు లభిస్తుందా? ప్రశ్నలు లేవనెత్తాయి. దీంతో ఆమె తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు ప్రయత్నిస్తానని .. ఈ చిత్రం తన కెరీర్ ని చాలా హెల్ప్ అవుతుందని.. అందుకు తాను ఎంత రిస్కైనా తీసుకుంటానని అమ్మడు వెల్లడించిందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : poonam bajwa  hansika motwani  trisha krishnan  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more