Hero nani yevade subramanyam jendapai kapiraju movie updates

yevade subramanyam, jendapai kapiraju, hero nani, amala paul, ragini dwivedi, hero nani news, hero nani movie, hero nani movie updates, nani movies, nani yevade subramanyam

hero nani yevade subramanyam jendapai kapiraju movie updates : hero nani's two movies yevade subramanyam and jendapai kapiraju releasing with one day differences

నాని కెరీర్ కి ఆ రెండు సినిమాలే సవాళ్లు!

Posted: 03/09/2015 04:04 PM IST
Hero nani yevade subramanyam jendapai kapiraju movie updates

‘ఈగ’ చిత్రంలాంటి భారీ విజయాన్ని అందుకున్న హీరో నాని.. అప్పటినుంచి తిరిగి ఒక్క సక్సెస్ కూడా సాధించలేకపోయాడు. అతడు నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ దగ్గర టపీటపీమని ఫెయిలయ్యాయి. దీంతో ఈ హీరో కొన్నాళ్లు ఇండస్ట్రీ నుంచి గ్యాప్ తీసుకుని.. ఇప్పుడు ‘ఎవడే సుబ్రమణ్యం’ ద్వారా తన కెరీర్ ని పరీక్షించుకోబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్లకు మంచి స్పందనే లభించింది. ఈ సినిమాతో నాని హిట్ దక్కించుకుంటాడని అందరూ ఆశిస్తున్నారు. అయితే... ఈ సినిమాకు నాని నటించిన మరో సినిమా ‘జెండాపై కపిరాజు’ పెద్ద అడ్డంకిగా మారుతున్నట్లు కనిపిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. నాని నటించిన తాజా చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’ మార్చి 20వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధంగా వుంది. అయితే.. ‘జెండాపై కపిరాజు’ మూవీ కూడా ఒక్కరోజు ఆలస్యంగా అంటే మార్చి 21వ తేదీన విడుదల కావడానికి రెడీగా వుంది. నిజానికి ఈ సినిమా గతేడాదే విడుదల అవ్వాల్సి వుండేది కానీ.. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నిర్మాతలు వాయిదా వేసుకుంటూ వచ్చారు. పైగా.. ఈ మూవీ తమిళ వెర్షన్ అత్యంత దారుణంగా ఫ్లాప్ కావడంతో తెలుగులోనూ ఎక్కడ ఫ్లాప్ అవుతుందోని నిర్మాత భయపడుతున్నారు. ఇటు ఈ భయం, అటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో నిర్మాత ఆ సినిమా విడుదల ఊసే మరిచిపోయారు. ఇప్పుడు సమస్యలన్నీ ఓ కొలిక్కి రావడంతో జెండాను ఎగురవేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నాని మొట్టమొదటిసారిగా డ్యూయల్ రోల్ చేస్తూ, అమలా పాల్, రాగిణి ద్వివేది హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

నానికి సంబంధించిన ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం బంపరాఫరే అయినప్పటికీ.. అందరూ కాస్త సందేహాల్లో మునిగిపోయారు. ఈ రెండు సినిమాల్లో ఏదోటి ఫ్లాప్ అయినా.. దాని ప్రభావం మరొక మూవీపై పడుతుందోమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తమిళంలో ‘జెండాపై కపిరాజు’ ఫ్లాప్ అయి, నిర్మాతకు నష్టాలు మిగిల్చింది. ఇక తెలుగులోనూ ఫ్లాప్ అవుతుందేమోనని అనుకుంటున్నారు. ఒకవేళ అది ఫ్లాప్ అయితే.. ఆ దెబ్బతో ‘సుబ్రమణ్యం’ కూడా జెండా ఎత్తేయ్యాల్సిందేనని అంటున్నారు. అలాకాకుండా రెండు ఒకేసారి హిట్ అయితే.. నాని కెరీర్ బ్రహ్మాండంగా సాగుతుంది. ఒకవేళ రెండూపోతే.. నాని ఇక కష్టాల్లో మునిగిపోతాడని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. నాని కెరీర్ ఆ రెండు సినిమా పెద్ద సవాళ్లుగా మారాయి. ఆ మూవీలు ఇతనికి ఎటువంటి ఫలితాన్నిస్తాయో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yevade subramanyam  jendapai kapiraju  hero nani  amala paul  ragini dwivedi  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more