మాస్ మహారాజా రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘కిక్-2’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం చిత్రీకరణ దాదాపు చివరిదశకు చేరుకుంది. ఇందులో రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలావుండగా.. ప్రస్తుతం ‘కిక్-2’ చిత్రీకరణలో బిజీగా వున్న రవితేజ.. ఈ మూవీ పూర్తికాగానే సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే ‘బెంగాల్ టైగర్’ షూటింగ్ లో పాల్గొంటాడు. రవితేజ సరసన తమన్నా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. ఇలా ఈ రెండు ప్రాజెక్టులతో బిజీ హీరోగా మారిపోయిన రవితేజ.. అప్పుడే మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం చేయనున్నట్లు తెలుస్తుంది.
హిందీలో ఘనవిజయం సాధించిన ‘స్పెషల్ 26’ సినిమా తెలుగులో రీమేక్ లో తాను నటిస్తానని రవితేజ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే! ఓ దొంగలముఠా తాము ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్స్ అంటూ రాజకీయ, వ్యాపారవేత్తల ఇళ్లలో దాడి చేసి, డబ్బులను దోచుకునే నేపథ్యంలో సాగే ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమానే హరీష్ టేకప్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నర్మించే సూచనలు కనిపిస్తున్నాయి.
‘షాక్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు హరీష్ శంకర్.. ఆ తర్వాత మళ్లీ రవితేజతోనే జతకట్టి ‘మిరపకాయ్’తో హిట్ కొట్టాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ రానుంది. కిక్ 2′ షూటింగ్ లో బిజీగా వున్న రవితేజ ఆ తరువాత ‘బెంగాల్ టైగర్’ చిత్రంలో నటిస్తాడు. వీటి తరువాత ఈ చిత్రం ప్రారంభంకానుంది. అయితే.. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడి కావాల్సి వుంది.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more