Aishwarya rai robo sequel director shankar rajinikanth aamir khan kollywood gossips

robo tamil movie, enthiran tamil movie, aishwarya rai news, aishwarya rai robo sequel, shankar aishwarya rai, rajinikanth aishwarya rai, aamir khan rajinikanth, robo sequel movie updates, director shankar news, aishwarya rai baby, aishwarya rai hot photos, aishwarya rai latest updates

aishwarya rai robo sequel director shankar rajinikanth aamir khan kollywood gossips : Tamil ace director shankar is planning to take aishwarya rai in robo sequel movie.

మరోసారి ‘రోబో’తో జతకట్టనున్న విశ్వసుందరి..

Posted: 02/21/2015 03:19 PM IST
Aishwarya rai robo sequel director shankar rajinikanth aamir khan kollywood gossips

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కి పెళ్లయినా తర్వాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆమె పెళ్లైనా కొత్తలోనే వరుసగా నాలుగు సినిమాలు చేసింది. అనంతరం ప్రెగ్నెన్సీ కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. తర్వాత పాప పుట్టడం, అప్పుడే ఏడాది గడిచిపోవడంతో... ఐశ్వర్య మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేసింది. ఇప్పటికే ‘జజ్బా’ అనే చిత్రం షూటింగ్ లో ఫుల్ బిజీగా వున్న ఈమె.. ‘రోబో’ సీక్వెల్ లో నటించేందుకు సుముఖత చూపుతోందని వార్తలొస్తున్నాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోబో’ చిత్రం.. అప్పట్లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే! దేశంలో అత్యధిక బడ్జెట్ తో నిర్మితమైన మొదటి చిత్రంగా పేరుపొందడంతోపాటు దాదాపు రూ.250 కోట్ల మేర వసూళ్లను రాబట్టిన మొదటి దక్షిణాది చిత్రంగా అది చరిత్ర సృష్టించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని శంకర్ భావించాడు కానీ.. అందుకు అయ్యే ఖర్చుకు భరించే ప్రొడ్యూసర్ దొరక్క డ్రాప్ అయ్యాడు.

అయితే.. ఇతను రూపొందించిన విజువల్ వండర్ ‘ఐ’ చిత్రం భారీగా ఫ్లాప్ కావడంతో ‘రోబో’ సీక్వెల్ తీయాలని పూనుకున్నాడు. ఇక ‘కొచ్చాడయాన్’, ‘లింగ’ చిత్రాలతో పరాజయాలు చవిచూసిన రజనీ కూడా శంకర్ తో మరోసారి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం! ఇందులో అమీర్ ఖాన్ కూడా నటించే అవకాశాలున్నాయని ఇటీవలే వార్తలు జోరుగా సాగుతున్న విషయం విదితమే!

ఈ నేపథ్యంలో ఇందులోనూ కథానాయికగా ఐశ్వర్యరాయ్ వుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో దర్శకుడు శంకర్ ఆమెను సంప్రదించాడట! ప్రస్తుతం ఈ విషయంపై వీరిమధ్య చర్చలు కూడా జరుగుతున్నాయట! ఈ చిత్రంలో నటించేందుకు ఆమె కూడా ఆసక్తి చూపుతోందని సమాచారం! ఒకవేళ ఐష్ ఓకే అంటే.. ఈ చిత్రానికి మరింత క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. మరి.. ఐష్ ఓకే అంటుందా..? లేదా..? అన్నది వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more