Chiranjeevi 150 movie bvs macha ravi story paruchuri brothers allu arvind ram charan

chiranjeevi news, chiranjeevi 150 film, ram charan chiranjeevi, chiranjeevi allu arvind, chiranjeevi macha ravi, macha ravi movies, macha ravi chiru 150 film story, macha ravi story chiru film, ram charan tej production banner, chiranjeevi movie news

chiranjeevi 150 movie bvs macha ravi story paruchuri brothers allu arvind ram charan : Megastar chiranjeevi has mesmerised with bvs macha ravi story. So he finalised that story for his latest 150 film.

చిరంజీవి 150వ సినిమా కథకు ‘మచ్చ’ పెన్ను!

Posted: 02/16/2015 06:14 PM IST
Chiranjeevi 150 movie bvs macha ravi story paruchuri brothers allu arvind ram charan

ఇదిగో ఇప్పుడు.. అదిగో అప్పుడు.. అంటూ చిరంజీవి 150వ సినిమా ఆయన బర్త్ డే నుంచి పోస్ట్ పోన్ అవుతూనే వస్తోంది కానీ.. అందుకు సంబంధించిన ఒక్క విషయం ఇంకా పక్కాగా విడుదల కాలేదు. ఓవైపు అభిమానులు మెగాస్టార్ మూవీ గురించి వేచి చూస్తుంటే.. మరోవైపు సరైన స్ర్కిప్ట్ దొరకక చిరు ఆందోళనల్లో మునిగిపోయారు. రాజకీయాల్లో కాస్త దెబ్బపడిన నేపథ్యంలో ఇండస్ట్రీకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనతో చిరు తన 150వ మూవీపై ఆచితూచి పావులు కదుపుతున్నారు. అందుకే.. ఆలస్యమైనా అదిరిపోయే మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయిపోయారు. చిరు ఇలా వేచివుండటం వల్లే.. ఆయనకిప్పుడు ఊరట లభించినట్లు తెలుస్తోంది.

సరైన కథ దొరక్క తీవ్ర ఆలోచనల్లో మునిగిపోయిన చిరుకి ఎట్టకేలకు ఓ అద్భుతమైన కథ లభించిందని సమాచారం! ఇన్నాళ్లు చిరంజీవిని ఎందరో దర్శకులు తమ కథల ద్వారా మెప్పించాలని ప్రయత్నించారు కానీ.. ఫలితం దక్కలేదు. అయితే.. ప్రముఖ రచయిత బీవీఎస్ రవి (మచ్చ రవి) కథ చిరును మెస్మరైజ్ చేయడంతో దానికే కమిట్ అయ్యాడని వార్తలొస్తున్నాయి. ఇటీవలే మచ్చరవి తన దగ్గరున్న కథతో చిరు దగ్గరికి వెళ్లాడు. రవి దాన్ని వివరించగా అది చిరుకు ఎంతగానో నచ్చిందట! రాజకీయ ఇమేజ్ ను కూడా ఆ కథలో జోడించి, పవర్ ఫుల్ సబ్జెక్టును సమకూర్చాడట రవి! అది కేవలం చిరుకే కాదు.. అల్లు అరవింద్, రామ్ చరణ్ లకు కూడా బాగా నచ్చేసిందట! దీంతో మచ్చ రవి కథనే మెగాఫ్యామిలీ ఓకే చేసినట్లు తాజా సమాచారం. ఇందుకుగాను రవికి వాళ్లు 70 లక్షలు ఇస్తున్నట్లు చెబుతున్నారు.

ఇక ఈ కథకు తగ్గట్టుగానే పరుచూరి బ్రదర్స్ తమదైన శైలిలో పదునైన సంభాషణలు జోడించే పనిలో నిమగ్నమయ్యారట! స్టోరీ దొరకడంతో మెగాఫ్యామిలీ చిరు 150వ చిత్రానికి సంబంధించిన వ్యవహారాలను చకచకా మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన విషయాలను అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఏదైతేనేం.. మచ్చ రవి అందించిన కథ చాలా బాగుండటంతో దానిని మరింత పదును పరిచే పనిలో పడిపోయారని టాక్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more