ఆమధ్య విబేధాలు చోటు చేసుకోవడం వల్ల చిరుకు, రాజయ్యకు మధ్య ఘర్షణలు ఏర్పడిన సంగతి విదితమే! చిరు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో రాజయ్య అందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. కొన్నాళ్ల తర్వాత ఈయనపై, కుటుంబసభ్యులపై ఎయిర్’పోర్టు దగ్గర దాడి చేశారు. దాంతో ఈ రెండు ఫ్యామిలీల మధ్య రానురాను దూరంగా పెరుగుతూ వచ్చింది. ఆమధ్య చిరు, రాజయ్య ఇంటికి వెళ్లి జరిగిన వివాదాన్ని సద్దుమణిగేలా చూసేందుకు ప్రయత్నించారు కానీ.. కుదరలేదు.
అలా ఆ విధంగా ఇద్దరూ శత్రువులుగా మారిపోయారు. అయితే.. ఇంతలోనే ఏం జరిగిందోగానీ ఇటీవలే వీరిద్దరూ కలుసుకోవడం జరిగింది. దాంతో అదొక సెన్సేషన్’గా నిలిచిపోయింది. ఇద్దరూ మళ్లీ కలుసుకోవడంపై అందరూ ఆశ్చర్యంతోపాటు హర్షం వ్యక్తం చేశారు. అయితే.. వీరిమధ్య పూర్తిగా విబేధాలు తొలగిపోయాయా..? లేదా..? అన్న సందేహాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే వున్నాయి. కానీ.. వీటన్నింటికి ఇప్పుడు ఫుల్’స్టాప్ పెడుతూ తాజాగా యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. చిరుకు, తన తాజా చిత్రం ‘గడ్డం గ్యాంగ్’ ప్రీమియర్ షోకి ఆహ్వానించినట్లు సమాచారలు వెలువుడుతున్నాయి. తమ మధ్య ఎటువంటి వైరుధ్యాలు లేవంటూ రాజశేఖర్ ఇక్కడితో తేల్చి చెప్పేశారని అంటున్నారు.
ఇదే విషయమై రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘నేను ‘గడ్డం గ్యాంగ్’ మూవీ ప్రీమియర్ షోకి చిరంజీవిని ఆహ్వానించాలనుకుంటున్నాను. ఒకవేళ చిరు మూవీ చూడటంపై ఆసక్తి తెలిపితే.. నేను ఖచ్చితంగా ఆయన కోసం ప్రత్యేక స్ర్కీనింగ్ షోను ఏర్పాటు చేస్తాను. అలాగే ఇతర హీరోలను ఆహ్వానించడానికి కూడా ఇష్టపడతాను’’ అంటూ పేర్కొన్నారు. రాజశేఖర్ ఇలా పేర్కొనడంపై వారిమధ్య వున్న ఘర్షణలు ఇక శాశ్వతంగా ముగిసినట్టేనని అనుకుంటున్నారు.
ఇదిలావుండగా.. చాలాకాలం నుంచి ఒక్క హిట్టు దక్కని నేపథ్యంలో రాజశేఖర్ ఇప్పుడు ‘గడ్డం గ్యాంగ్’ చిత్రంపై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ మూవీ విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే.. ఈ మూవీని వీలైనంత మేరకు ప్రచారం సాగిస్తున్నారు. ఇందులోభాగంగానే చిరును ఆహ్వానిస్తే తమ మూవీకి మరింత క్రేజ్ వస్తుందనే ఉద్దేశంతోనే రాజయ్య ఆయన్ను ఆహ్వానించి వుంటారని చెప్పుకుంటున్నారు. ఏదైతేనేం.. గడ్డం గ్యాంగ్ మూవీతోనైనా ఇద్దరు ఏకం అయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more