Actress anjali abscond after geethanjali movie success in tollywood

actress anjali, anjali latest news, telugu actress anjali latest news, actress anjali hot photo shoot, geethanjali movie news, geethanjali movie success, anjali abscond news, anjali kannada movies, anjali tamil movies, anjali hot gallery, anjali hot stills, actress anjali updates

actress anjali abscond after geethanjali movie success in tollywood

మళ్లీ అదృశ్యమైపోయిన సినీ నటి అంజలి!

Posted: 10/17/2014 09:11 PM IST
Actress anjali abscond after geethanjali movie success in tollywood

‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’’ చిత్రంలో సీత పాత్రలో నటించి, ప్రేక్షకులను ఆకట్టుకున్న అంజలి.. ఒక్కసారిగా స్టార్ డమ్ ను సంపాదించుకుంది. అప్పటివరకు సినిమాలు చేసుకుంటూ కాలం గడుపుతున్న ఈ అమ్మడికి.. ఆ సినిమా ఒక వరంలా మారిపోయింది. ఒక్క సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న అంజలికి ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు ఎటువంటి అడ్డంకులు వుండవని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే పెద్దహీరోల సరసన ఒకేసారి మూడు మూవీ ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే ఇంతలోనే ఏమైందో ఏమో తెలీదుకానీ.. ఎవ్వరికి తెలియకుండా కొన్నాళ్లపాటు ఈ అమ్మడు అదృశ్యమైపోయింది. బాయ్ ఫ్రెండ్ తో షికారుకి వెళ్లిందని కొందరు అనుకుంటే.. కిడ్నాప్ కు గురైందని మరోవైపు వార్తలు..! కొన్నాళ్లవరకు అంజలి ఉదంతం టాలీవుడ్ లో పెద్ద సంచలనంగా మారిపోయింది.

అయితే అంతలోనే ఈ అమ్మడు బయటకు వచ్చి, తాను కిడ్నాప్ కు గురికాలేదంటూ కుండబద్ధలు కొట్టేసింది. తన పిన్నితో వున్నవ్యక్తిగత - ఆర్థిక తగాదాల వల్లే తాను ఇన్నాళ్లు అదృశ్యమయ్యానంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఆ సమయంలో డైరెక్టర్ కళంజియం కూడా ఈమెపై ఫిర్యాదు చేశాడు. తన డబ్బులు తీసుకుని సినిమా మధ్యలోనే వచ్చేసిందంటూ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశాడు. ఇలా ఒకదానిమీద ఒకటి సమస్యలతో వేగిన అంజలి.. చివరికి ఆ సమస్యల నుంచి బయటపడింది. కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఏ ఒక్క డైరెక్టర్ గానీ, ప్రొడ్యూసర్ గానీ, హీరోగానీ ఈమెను కనుకరించలేదు. ఇక పెద్ద హీరోలైతే ఈమెను పట్టించుకోవడమే మానేశారు. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అనుకుంటే.. ఒక్కసారిగా కిందకు పడిపోయింది అంజలి.

దాంతో ఈ అమ్మడికి వేరే ఆప్షన్స్ లేక కొన్నాళ్లవరకు ఖాళీగా కూర్చుంది. పెద్ద సినిమాలు ఎలాగో రావడం లేదు.. కనీసం చిన్న సినిమాలైనా చేసుకుందామనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాలు కూడా చేసింది. కొన్నిరోజులవరకు టాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ్ లకు బాగానే చక్కర్లు కొట్టింది. అలా చాలారోజుల తర్వాత తిరిగిన అనంతరం టాలీవుడ్ ఆమెను మళ్లీ అక్కున చేర్చుకుంది. కామెడీ - హారర్ ఎలిమెంట్ తో కూడుకున్న ‘‘గీతాంజలి’’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దీంతో ఆమె వచ్చిన అవకాశాన్ని ఉపయోగించాలనుకుని వెంటనే ఓకే చేసేసింది. ఆ సినిమాతోనైనా విజయం సాధించి, తిరిగి తన స్టార్ డమ్ పొందాలనుకుంది. అనుకున్నట్లుగానే ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఒక్కసారిగి తిరిగి అంజలి సక్సెస్ గురించి వార్తలే వార్తలు వచ్చేశాయి. కానీ అంజలి ఊహించినట్లుగా ఆమెకు వేరే సినిమాల్లో ఆఫర్లు మాత్రం రాలేదు. కనీసం ‘‘గీతాంజలి’’ లాంటి సినిమా ఆఫర్లైనా వస్తాయనుకుంటే అలా కూడా కుదరలేదు.

బహుశా అందుకేనేమో... తీవ్ర అంసతృప్తికి గురయి ఈ అమ్మడు మళ్లీ అదృశ్యమైనట్లు వుంది. గత కొన్నాళ్లనుంచి అంజలికి సంబంధించిన ఏ వార్తగానీ, ఇతర వ్యవహారాలుగానీ ఏమీ రాలేదు. ఆమె ఎక్కుడుంది, ఏం చేస్తోంది, ఎలా వుందనే..? విషయాలు ఎవ్వరికీ తెలియదు. టాలీవుడ్ లో ఒక్క మూవీ కూడా లేకపోవడం వల్ల చిత్రపరిశ్రమలో ఈ అమ్మడు కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో అంజలి మళ్లీ అదృశ్యమయ్యిందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు! ఈసారి మూవీ ఆఫర్లు రావడం లేదనే బాధతో ఈ అమ్మడు కనిపించకుండా పోయిందని, పరిశ్రమకు చెందిన వారెవ్వరితోనూ ఈ అమ్మడు కలవడం లేదని చర్చించుకుంటున్నారు. సక్సెస్ రూట్ నుంచి కెరీర్ అనుకోకుండా ఒక్కసారిగా గాడిలో పడిపోవడంతో తీవ్ర అసహనానికి గురై, ఒంటరిగా ఎక్కడైనా కాలక్షేపం చేస్తుందేమోనన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుండగా.. టాలీవుడ్ కూడా లేకపోవడం వల్ల అంజలి కోలీవుడ్, శాండల్ వుడ్ లలో చక్కర్లు కొడుతోందనే సమాచారాలు వెలువడుతున్నాయి. తెలుగులో అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో ఈ అమ్మడు కన్నడ, తమిళ్ చిత్రపరిశ్రమలవైపు మళ్లిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ‘‘ధీర రానా విక్రమ’’ అనే కన్నడ సినిమాలోనూ, ఇంకా టైటిల్ ఖరారు చేయని తమిళ్ సినిమాతో బిజీగా వుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ‘‘మధ గజరాజ’’ అనే సినిమా షూటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమయ్యిందని తెలిసింది. ఏదేమైనా.. గతకొన్నిరోజుల నుంచి సినీ నటి అంజలి తెరమీద కనిపించకపోవడంతో ఆమె మళ్లీ అదృశ్యమైందనే పుకార్లు మాత్రం ఫిలింనగర్ లో బాగానే షికార్లు షికార్లు చేస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress anjali  telugu actresses  tollywood  kollywood  sandalwood  telugu news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh