Actress anjali geethanjali movie to be telecast on television

anjali latest news, actress anjali news, anjali hot news, anjali updates, anjali movie updates, anjali latest, anjali hot photo shoot, anjali photos, anjali news, anjali geethanjali movies, geethanjali movie, geethanjali movie on television

actress anjali geethanjali movie to be telecast on television

బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టించనున్న అంజలి!

Posted: 10/15/2014 09:48 PM IST
Actress anjali geethanjali movie to be telecast on television

‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’’ సినిమాలో సీత పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అంజలి... ఆ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ ను తన సొంతం చేసుకుంది. ఆ మూవీ తర్వాత ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి. దీంతో అంజలికి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు ఇక ఎదురులేదని అందరూ భావించారు. కానీ ఇంతలోనే కుటుంబ గొడవలతోపాటు తమిళ డైరెక్టర్ కళంజియంతో వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ అమ్మడి స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా పడిపోయింది. ఆ వివాదాలకు ముందు ఒప్పుకున్న సినిమాలు మినహా.. మరే ఆఫర్లు ఆమె దరికి చేరలేదు. అయితే ఏదో ఒకవిధంగా ఆ వివాదాల నుంచి బయటపడిన అంజలి... తిరిగి తన స్టార్ డమ్ ను సంపాదించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా... చివరికి ఫలితం లేకపోయింది. దీంతో ఈ అమ్మడు వచ్చిన చిన్నచిన్న మూవీ ఆపర్లతోపాటు అప్పుడప్పుడు యాడ్ లలో కనువిందు చేస్తోంది.

అయితే ఇంతలోనే అంజలికి ‘‘గీతాంజలి’’ రూపంలో టాలీవుడ్ లో మళ్లీ సక్సెస్ లభించింది. సినిమా మొత్తంలో అంజలిదే లీడ్ రోల్ కావడంతో ఈ అమ్మడికి ఆ సినిమా ద్వారా మంచి మార్కులే పడ్డాయి. చిన్న సినిమాయే అయినా... మంచి కలెక్షన్లతో ఓ మోస్తరు విజయాన్నే సాధించింది. మళ్లీ సక్సెస్ బాటలోకి తిరిగొచ్చిన ఈ అమ్మడికి అవకాశాలు వస్తాయనే నమ్మకంతో వుంది కానీ... ఇంతవరకు ఏ భారీ మూవీ ఆఫర్ ఆమె దరికి చేరలేదు. దీంతో కోలీవుడ్, కన్నడ పరిశ్రమలో అవకాశాల కోసం చక్కర్లు కొడుతోంది. ఏ చిన్న సినిమాల్లో నటించడానికైనా సై అంటూ చెబుతోంది. ఇదిలావుండగా... తాజాగా ఈ అమ్మడు బుల్లితెర వీక్షకులను భయపెట్టించేందుకు సిద్ధమవుతోందనే వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు యాంకరింగ్ గా అవతారమెత్తుతోందా..? లేదా ఏదైనా హారర్ టీవీ సీరియల్ లో క్యారెక్టర్ చేస్తోందా..? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని తేలిపోయింది.

అసలు విషయం ఏమిటంటే.. అంజలి ప్రధాన పాత్రధారిగా ఇటీవల వచ్చిన ‘‘గీతాంజలి’’ చిత్రం హిట్ జాబితాలోకి చేరిపోయిన సంగతి తెలిసిందే! కెరీర్ గాడిలో పడిపోయిందనే సందర్భంలో ఈ మూవీ అంజలికి టర్నింగ్ పాయింట్ గా మారిపోయింది. హారర్, కామెడీ ప్రధానంగా సాగిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే రాబట్టుకుంది. ఇందులో బ్రహ్మానందం పాత్ర ప్రేక్షకులను బాగానే చక్కిలిగింతలు పెట్టింది. కోన వెంకట్ దీనికి రచన చేయడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లో చూడలేకపోయిన వారికి ఇంట్లోనే వీక్షించే అవకాశం త్వరలోనే వచ్చేస్తోందని సమాచారం. ఈనెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు ‘‘గీతాంజలి’’ చిత్రాన్ని జీటీవీలో తొలిసారిగా ప్రసారం చేయనున్నారు. ఈ సినిమా బాగా హిట్ అవడంతో జీటీవీ ఫ్యాన్సీ రేటుతో దీని హక్కులను సొంతం చేసుకుని, ఇలా ప్రసారం చేస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : geethanjali movie  actress anjali  writer kona venkat  comedian brahma nandam  tollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more