సహజనటుడుగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ మరో కొత్త సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ కధ చిరంజీవికి చెందినది. అంటే ఆయన కధ అని చెప్పలేము. మెగాస్టార్ 150వ సినిమా కోసం సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం తయారుచేసిన కధ. ఆ మద్య ఈ కధను చిరుకు చెప్పగా.., తనకు సూట్ కాదు అని సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఇదే కధను పట్టుకుని మలయాళ సూపర్ స్టార్ దల్వ్కేర్ సింగ్ ను పెట్టి సినిమా తీస్తున్నారు.
ఇప్పుడిదే సినిమాలో ప్రకాష్ రాజ్ కీ రోల్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పాత్రలో నటించాలని మణి కోరగా.., ప్రకాష్ రాజ్ ఓకే చెప్పారట. ప్రీ ప్రొడక్షన్ పనులన్ని పూర్తి చేసుకుని రెండ్రోజుల క్రితమే షూటింగ్ ప్రారంభం కాగా త్వరలో రాజ్ జాయిన్ అవుతారని కోలివుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక కధ విషయానికి వస్తే ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరి అట. హీరోయిజం నుంచి వచ్చి లవ్ స్టోరీల్లో నటిస్తే ఆదరించరనే ఉద్దేశ్యంతోనే చిరు వద్దు అన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి తమిళం, మలయాళ బాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
నిత్యామీనన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోందని కోలివుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం చిరు కధలు వెతికే పనిలో బిజీగా ఉండగా... ఆయన వద్దు అన్న కధనే పట్టుకుని మణి సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి. అటు ప్రస్తుతం కొన్ని సినిమాలు మాత్రమే చేతిలో ఉన్న నిత్యకు ఈ మూవీ విడుదల అయితే మంచి ఆఫర్లు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను తెలుగులో రీ మేక్ చేస్తారా.., లేదా డబ్ చేస్తారా అనే విషయంపై మాత్రం మణిరత్నం సన్నిహితులు ఎలాంటి సమాచారం బయటకు రానివ్వటం లేదు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more