అతి ప్రేమను ఎవరూ తట్టుకోలేరంటారు. ఇలియానాకు కూడ ఇదే జరుగుతోంది ఇప్పుడు. హైదరాబాద్ లో ఇళ్ళు అమ్మేసి అంతా సర్దేసుకుని ముంబైకి చెక్కేసిన గోవా బ్యూటికి అక్కడ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. తమ సినిమాలు చేయాలంటూ వరుసగా ఇల్లీ అద్దెఇంటి తలుపు ఇంటిని తడుతున్నారు. దీంతో ఇదెక్కడి ఆఫర్ల వర్షమంటూ తెగ సంతోషపడుతోందట. ఇప్పటికే మూడు పెద్ద సినిమాలకు సంతకం పెట్టగా.., మిగతా డైరెక్టర్లు.., నిర్మాతలు కూడా ఇలియానా నడుమే తమకు కావాలని కోరుతుండటంతో... ఎలా భరించాలి బాలీవుడ్ ప్రేమను అని బాధపడుతోందట.
బాలీవుడ్ లో ప్రస్తుతం మూడు పెద్ద సినిమాలకు సంతకం చేయగా.., అవన్ని యష్ రాజ్ ఫిలింస్ సంస్థవే కావటం విశేషం. హీరోయిన్లతో వరుసగా సినిమాలు చేసే సాంప్రదాయం ఉన్న యష్ రాజ్ సంస్థ.., మొదటగా షారూఖ్ ఖాన్ తో ఒక సినిమాను ఒప్పుకుంది. సాంప్రదాయం తప్పము అన్నట్లుగా.., మరో రెండు సినిమాలకు కూడా సన్నజాజిచే సంతకం పెట్టించుకున్నారు. రెండిటిలో ఒకటి రణభీర్ కపూర్ తో తీయాలని మరొకటి.. సల్మాన్ ఖాన్ తో తీయాలని ప్లాన్ చేస్తోందీ సంస్థ. ఇలా బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటిస్తూ మరో ఏడాది వరకు బిజీ షెడ్యూల్ తో కనీసం హాలిడేకు కూడా వెళ్లలేనంత కష్టాలు పడుతోంది.
దేవదాసు సినిమాతో సిని ఇండస్ర్టీలోకి అడుగు పెట్టిన ఇలియానా.. తెలుగులో ఓ వెలుగు వెలిగింది. తెలుగు పరిశ్రమలో కోటి రూపాయలు డిమాండ్ చేసిన తొలి హీరోయన్ గా రికార్డు సృష్టించింది. తొలి ఆఫర్ టాలీవుడ్ ఇవ్వటంతో కొంతకాలం పాటు హైదరాబాద్ ను అంటిపెట్టుకుంది. ఆ తర్వాత రెక్కలు రావటంతో ఇతర ఇండస్ర్టీలపై కూడా పడింది. ఇలా తెలుగుతో పాటు తమిళ, కన్నడ బాషల్లో కూడా నటించింది. కొద్దికాలంగా బాలీవుడ్ కు కూడా నడుము ఒంపులను పరిచయం చేయటంతో అక్కడా.., సన్నని నడుముకు ఫ్యాన్స్ అయ్యారు. దీంతో టాలీవుడ్ కు టాటా చెప్పేసి ముంబైకి చెక్కేసిందీ గోవా బ్యూటి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more