Ananya takes one rupee advance for movie

ananya, balasriram, ananya hot scenes, tamil heroines, heroines hot scenes, indian heroines, tamil movies, tamil latest news, iruvum pagalum varum movie

ananya takes one rupee as advance for a movie : ananya agrees to act for a tamil movie by taking one rupee as advance

ఒక్కరూపాయికే ఒప్పేసుకుంది

Posted: 08/12/2014 05:56 PM IST
Ananya takes one rupee advance for movie

రూపాయికి ఏం వస్తుందంటే ఠక్కున ఏం చెప్తారు. జనరల నాలెడ్జ్ ఎక్కువున్నవారయితే కేజి బియ్యం వస్తాయని చెప్తారు. అదే సినిమా నాలెడ్జ్ ఎక్కువున్నవాళ్ళు అనన్య పేరు చెప్తారు. ఒక్కసారి హీరోయిన్ అని పేరు వస్తే చాలు కాల్షీట్లు కాళీ లేకుండా ఉంటారు. ఇక డబ్బుల విషయంలో అయితే చెప్పలేము. హీరోయిన్ రేంజ్ ను బట్టి లకారాలు పెరుగుతాయి. ఇక కావాలనుకుంటే కోట్లు కూడ సమర్పించుకోక తప్పని పరిస్థితుతలు పరిశ్రమలో ఉన్నాయి. ఇలా సింగల్ సినిమాకు కోట్లు తీసకుంటున్నజాబితాలో చాలామంది ముద్దుగుమ్మలే ఉన్నారు. రెమ్యునరేషన్ కు తోడు మెయింటెనెన్స్ అదనం. ఎప్పుడూ రుచి చూడని వంటలన్నీ వారికి షూటింగ్ సమయంలోనే గుర్తుకు వస్తాయని నిర్మాతలు, ప్రోడక్షన్ మేనేజర్లు చెప్తుంటారు. ఇది నిజమే ఇళ్ళు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని అప్పట్లో అంటే ఇప్పుడు సినిమా తీసి చూడు అని మార్చుకోక తప్పదు. అంచనా బడ్జెట్ ఒకటయితే అసలు బడ్జెట్ లెక్కలు చూసుకునే సరికి చెమటలు పడతాయి ప్రొడ్యూసర్లకు.

అయితే తమ హీరోయిన్ అందరిలా కాదంటున్నాడు తమిళ దర్శకుడు బాలశ్రీరాం. తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించేందుకు అనన్య కేవలం రూపాయి మాత్రమే అడ్వాన్స్ తీసుకుందట. ఈ విషయం స్వయంగా శ్రీరాం వెల్లడించాడు. త్వరలో తెరకెక్కే  ఇరవుం పగలుం వరుం సినిమాలో మహేష్, అనన్యలతో పాటు జగన్, స్వామినాధన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కధను విన్న అనన్య వెంటనే సినిమా చేయటానికి ఒఫ్పుకుందట. తనకు అడ్వాన్స్ కూడా అవసరం లేదని.., అంతగా తప్పదంటే ఒక్క రూపాయి ఇవ్వండి చాలు అని చెప్పిందట. ఓ ప్రెస్ మీట్ లో అనన్య మంచితనాన్ని మాటలతో ముంచెత్తారు బాలశ్రీరాం. ఇలాంటి నటిని తానెక్కడా చూడలేదని.., అడ్వాన్స్ తీసుకోకుండా నటించటం తనను ఆశ్చర్యం కల్గిస్తుందన్నారు. మరి అనన్య అడ్వాన్స్ తీసుకోకపోవటానికి అసలు కారణమేంటో ఆమెకే తెలియాలి.

సినీ ఇండస్ర్టీ అదో రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశం రావటానికి ఎంత కష్టపడాలో దాన్ని నిలబెట్టుకోవటానకి అంతకంటే ఎక్కువ తంటాలు పడాలి. కలిసి వస్తే కాసుల పంట లేదంటే కాలే కడుపు మంట. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇవన్నీ తెలిసి అడ్వాన్స్ తీసుకోకుండా సినిమా చేయటం ఏంటని సిని ఎనలిస్టులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుడల తర్వాత అంచనాలు తలకిందులతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని సూచిస్తున్నారు. మంచితనం ఉండాలి కాని అది మనల్ని ముంచేంతగా కాదని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కధ విషయానికొస్తే.., ఇంజనీరింగ్ చదివే ఓ స్టూడెంట్ పగలంతా మంచివాడు. రాత్రయితేనే దొంగతనాలకు పాల్పడుతాడు. ఆ విధ్యార్థి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడనేది సినిమా కధ అని దర్శకుడు బాలశ్రీరాం చెప్పారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ananya  tamil movies  balasriram  iruvum pagalum varum  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more