దర్శకుడు హీరోలతో రౌడీలను తన్నిస్తాడనే విషయం మనకు తెర మీద తెలుసు. కానీ అదే రియల్ లైప్ అలా కాదు.. దర్శకుడే వేశ్యల నుండి తన్నులు తప్పించుకున్నాడు. హైదరాబాద్ బ్లూస్ పేరుతో సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ ఆ తరువాత తీసిన రాక్ ఫోర్డ్, బాలీవుడ్ కాలింగ్, తీన్ దివారీన్, ఇక్బాల్, హైదరాబాద్ బ్లూస్ 2, బాంబే టు బ్యాంకాక్ తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇప్పుడు ఆయన తాజగా వేశ్యల ఇతివృత్తంతో ‘లక్ష్మి’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రత్యేకంగా ముంబయి వేశ్యల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమా మొత్తం చూసిన తరువాత ఆగ్రహంతో ఊగిపోయిన వేశ్యలు సినిమాలో బ్రోకర్ పాత్ర పోషించిన వ్యక్తిని చూయించాలని పట్టుబట్టారట.
నగేశ్ కుకునూర్ చుట్టుముట్టి ఆ వ్యక్తిని మాకు అప్పగించాల్సిందేనని గొడవ చేశారట. వారికి ఆ మాట ..ఈ మాట చెప్పిన ఆయన అక్కడి నుండి తప్పించుకున్నాడు. ఆ సినిమాలో ఆ పాత్ర పోషించింది ఆయనేననట. ఆ సినిమాలో బ్రోకర్ పాత్ర నిజ జీవితంలో తమను మోసం చేసినట్లుగానే ఉందట.
అది సినిమా అన్న విషయం కూడా మరిచి అతన్ని మాకు పట్టించాలని వేశ్యలు డిమాండ్ చేశారట. అది నగేశ్ కుకునూర్ అని తెలియక ఆయనను వదిలి పెట్టారట. ముంబయిలోని అలంకార్ థియేటర్లో కామాటిపుర సెక్స్ వర్కర్ల కొరకు ప్రత్యేకంగా ప్రదర్శించారట.
అదే దర్శకుడే తెరపై బోకర్ గా మారిన విషయం వేశ్యలకు తెలిసినట్లైతే . దర్శకుడు నగేశ్ కుకునూర్ పని ..జింతాత జిత జిత అయ్యేదని .. అలంకార్ ధియేటర్ యాజమాన్యం అంటుంది. అద్రుష్టం కొద్ది వైశ్యల చేతిలో తన్నులు తప్పించుకున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారని చిత్ర యూనిట్ సభ్యులు చెవులుకొరుక్కుంటున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more