అందరి కళ్లు ఈనెల 14 తేదీపైనే ఉన్నాయి. రాజకీయ పార్టీలకు ఒకటే టెన్షన్. ఆరోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్. ఆ రోజు ఏం జరుగుతుంది? ఆరోజు కోసం అందరు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ఈనెల 14 సాయంత్రం హైటెక్స్ లో జరిగే ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నాడు. దాదాపు 3000 మంది పవన్ అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే అసలైన పవన్ అభిమానుల్ని వివిధ జిల్లాల నుంచి గుర్తించారు. వీరందరికీ గుర్తింపు కార్టులు కూడా ఇవ్వనున్నారు.
హైటెక్స్ లో జరిగే పవన్ మీటింగ్ కోసం వీరికి ప్రత్యేకంగా పాసులు ఇస్తున్నారు. పాసు లేని వారిని అనుమతించేది లేదని నిర్వాహకులు చెబుతున్నారు. పవన్ ప్రసంగాన్ని అందరూ వీక్షించే విధంగా జిల్లా కేంద్రాల్లో ఎల్ సి డి స్క్రీన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.
మరో వైపు నేషనల్, లోకల్ మీడియాతో కలిసి దాదాపు 300 మంది మీడియా సభ్యులు పాల్గొనే అవకాశముంది. పవన్ కళ్యాణ్ 48 నిమిషాల పాటు ప్రసగించనున్నారు. మీడియాతో ఇంటరాక్షన్ సెషన్ ఉండే అవకాశం లేదు. వేదికపై పవన్ మాత్రమే ఉంటాడని సమాచారం.
ఈ సందర్భంలోనే రాజకీయాలపై తాను రాసిన పుస్తకాన్ని విడుదల చేస్తాడు. ఈ పుస్తకంలోనే రాజకీయాలపై తనకున్న అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పనున్నాడట. ఇదే పవన్ ఎన్నికల మేనిఫెస్టోగా భావించొచ్చని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏమైన రాజకీయల్లో పవన్ ఒక చరిత్ర స్రుష్టిస్తాడేమో అనే అనుమానం రాజకీయ పార్టీలను వెంటాడుతుంది.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more