Interview with gayathri rao

gayathri rao, interview, happy days, telugu, telugu movies, telugu songs, telugu masala songs, telugu sexy songs, telugu hot songs,Happy Days Fame Gayatri Rao, Appu Telugu Cinema Actress

gayathri rao, interview, happy days, telugu, telugu movies, telugu songs, telugu masala songs, telugu sexy songs, telugu hot songs,Happy Days Fame Gayatri Rao, Appu Telugu Cinema Actress

Interview With Gayathri Rao.gif

Posted: 06/12/2012 12:52 PM IST
Interview with gayathri rao

Interview_With_Gayathri_Rao

Gayatri-Raoనటీనటుల కుటుంబంలో పుట్టింది. తనూ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ‘గాయత్రిరావు’ అని ఆమె గురించి చెబితే అందరికీ అర్థం కాకపోవచ్చు. కానీ ‘అప్పు’ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ‘హ్యాపీడేస్’ సినిమాలో చేసిన ఆ పాత్ర ఆమెను అంతగా ప్రేక్షకులకు దగ్గర చేసింది మరి! ఈ మధ్యనే ‘గబ్బర్‌సింగ్’తో మరోసారి అందరి మనసులనూ గెలుచుకున్న గాయత్రి చెప్పిన కబుర్లు...

చిన్ననాటి స్మృతులు...

నటిగా అమ్మ (బెంగళూరు పద్మ) హైదరాబాద్‌లో బిజీ. కన్నడ సీమలో నాన్న (అరుణ్‌కుమార్) బిజీ. దాంతో నా బాల్యమంతా బెంగళూరు, హైదరాబాదుల్లో గడిచింది. తాతయ్య, నానమ్మ, అమ్మ, నాన్న, బాబాయిలు, పిన్నమ్మలు, వాళ్ల పిల్లలు... జాయింట్ ఫ్యామిలీలో గారాబంగా పెరిగాను.

అమ్మానాన్నల ప్రభావంతోనే నటి కావాలనుకున్నారా?

అమ్మానాన్నలే కాదు, ఇంట్లో చాలామంది సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అత్తయ్య సుధారాణి నటి (రాజేంద్రప్రసాద్ ‘మాస్టారి కాపురం’లో హీరోయిన్). బాబాయ్ కన్నడసీమలో సంగీత దర్శకుడు. దాంతో నాక్కూడా చిన్నప్పట్నుంచే ఆ ఫీల్డ్‌మీద ఇంటరెస్ట్ ఉంది. కానీ కచ్చితంగా నటినై తీరాలని మాత్రం అనుకోలేదు.

మరి సినిమాల్లోకి ఎలా వచ్చారు?

‘హ్యాపీడేస్’లో ఒక పాత్ర కోసం శేఖర్ కమ్ముల నాన్నని కలవాలనుకున్నారట! మేమంతా బయటికి వెళ్తున్నప్పుడు దారిలో నాన్న శేఖర్‌ని కలుస్తానన్నారు. కారులో ఊరికే కూర్చోవడమెందుకని నేనూ ఆఫీసులోకి వెళ్లా. అప్పుడు శేఖర్ నన్ను చూసి పక్కనున్నవాళ్లతో ‘అప్పు’ దొరి కేసింది అన్నారట! అలా అప్పునైపోయా.తొలి సినిమా కదా...

ఎలాంటి అనుభవాలెదురయ్యాయి?

అప్పు టామ్‌బాయ్‌లా ఉంటుంది అని శేఖర్ అనుకున్నారు కానీ, ఆమె ఎలా కనబడాలి అన్నదాని మీద ఆయనకు స్పష్టత లేదు. అయితే ఆ పాత్రకు పొట్టి జుట్టు అయితే బాగుంటుందని మా అమ్మ అనడంతో నా పొడవైన జుట్టుని కత్తిరించేశారు. దాంతో ఎంత ఏడ్చానో చెప్పలేను. కొన్నాళ్లపాటు శేఖర్‌తో మాట్లాడలేదు కూడా. అయితే అందరికంటే చిన్నదాన్ని కావడంతో అందరూ నన్ను చాలా గారాబం చేసేవారు. (నవ్వుతూ) దాంతో ఐస్‌క్రీమ్ ఇస్తే చేస్తా, చాక్లెట్ ఇస్తే చేస్తా అంటూ తెగ విసిగించేదాన్ని.

ఆ తర్వాత ఏ పాత్రలు చేశారు?

‘హ్యాపీడేస్’ తర్వాత దాదాపు ఓ అరవై సినిమాలకైనా నో చెప్పి ఉంటాను. ఎందుకంటే అన్నీ అలాంటి పాత్రలే వచ్చేవి. కొన్నాళ్ల తర్వాత కోడి రామకృష్ణ ‘ఏక్ పోలీస్’లో చేశాను. కన్నడలో నటుడు దేవరాజ్ కొడుకు పక్కన నటించాను. ఆ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. తర్వాత ఆరెంజ్, గంగపుత్రులు, ఇప్పుడు గబ్బర్‌సింగ్.

‘గబ్బర్‌సింగ్’ అవకాశం ఎలా వచ్చింది?

దర్శకుడు హరీష్ శంకర్ నాకు మంచి స్నేహితుడు. తను ఆ క్యారెక్టర్ గురించి వివరించిన విధానమే నన్నెంతో ఆకట్టుకుంది. దాంతో వెంటనే ఓకే అనేశా. చాలా మంచి పేరు వచ్చింది.

అత్యంత సంతోషపడిన సందర్భం?

గబ్బర్‌సింగ్ షూటింగ్‌కి లంగావోణీతో వెళ్లాను. పవన్‌కళ్యాణ్ వచ్చారు. దర్శకుడు నన్ను పరిచయం చేస్తే- ‘నువ్వు అప్పువా’ అంటూ చాలా ఆశ్చర్యపోయారు. నీతో కలసి పనిచేయడం సంతోషంగా ఉంది అని కూడా అన్నారు. చాలా సంతోషమేసింది. ఇప్పటికీ చాలామంది విదేశాల నుంచి ఫోన్లు చేస్తుంటారు. హ్యాపీడేస్‌లో నా నటనను మెచ్చుకుంటుంటారు. అది కూడా చాలా ఆనందం కలిగిస్తుంది.

బాగా బాధపెట్టిన విషయం?

‘హ్యాపీడేస్’ కథ నాలుగు జంటల చుట్టూ తిరుగుతుందని చెప్పారు. అగ్రిమెంట్లో కూడా అన్ని జంటలూ లీడ్ రోల్సే అని వుంది. కానీ సినిమా రిలీజయ్యాక చూస్తే అంతా తమన్నా చుట్టే తిరిగినట్టు అనిపించింది. అది కాస్త బాధ కలిగించింది.నటిగా మీ ప్లస్/మైనస్ పాయింట్స్?
నేనేమైతే చేయగలనో అవన్నీ నాకు ప్లస్ పాయింట్లే అనుకుంటాను. ఇక మైనస్ అంటే- నేను తెలుగు అమ్మాయిని కావడమే. తెలుగువాళ్లకి తమ సినిమాల్లో తెలుగు హీరోయిన్లు అక్కర్లేదు. ఎందుకు అనేదానికి సరైన సమాధానం ఏ దర్శకుడూ చెప్పగా నేను వినలేదు.

భవిష్యత్ ప్రణాళికలు...?

మా అమ్మమ్మ సుశీలారాణి సంగీత విద్వాంసురాలు. అమ్మేమో కూచిపూడి డ్యాన్సర్. నాకు ఈ ఇద్దరి వారసత్వాన్నీ కొనసాగించాలని ఉంది. అలాగే మంచి మంచి పాత్రలు చేస్తూ నాకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకోవాలి.

పుట్టినరోజు: ఏప్రిల్ 28
నచ్చే రంగు: ఇంగ్లిష్ కలర్స్ నచ్చుతాయి.Appu
నచ్చే ఫుడ్: అమ్మ చేసేది ఏదైనా. జంక్‌ఫుడ్ బాగా ఇష్టం. చాట్ అంటే మరీను!
నచ్చిన సినిమా: సౌండ్ ఆఫ్ మ్యూజిక్, జోథా అక్బర్
నచ్చే హీరో: లియొనార్డో డికాప్రియో
నచ్చే హీరోయిన్: ప్రియాంకచోప్రా, కరీనాకపూర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Character artist rajitha interview

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజితతో...

    Nov 25 | దాదాపు 24 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను కేరక్టర్ ఆర్టిస్టుగా రంజింపజేస్తున్న రజిత ప్రతి సినిమాలోనూ దాదాపుగా కనిపిస్తుంది. మోములో అమాయకత్వం, నటనలో సహజత్వం ఆమె ప్రత్యేకత. నటిగా 25వ సంవత్సరంలోకి ఎంటరవుతున్న సందర్భంగా... Read more

  • Nagarjuna special interview for bhai movie

    ‘భాయ్ ’ నాగార్జునతో కాసేపు

    Oct 18 | మన్మథుడు.. గ్రీకువీరుడు...  టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్‌సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన... Read more

  • Actress shriya saran chit chat

    శ్రీయ చెప్పిన చిట్టి చిట్టి మాటలు

    Oct 07 | అందాల సుందరి శ్రేయ వెండితెర పై తళుక్కుమని మెరిసి అగ్ర హీరోయిన్ నుండి ఐటెం గాళ్ వరకు అన్ని పాత్రలు వేసి తన అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ అమ్మడుకు ప్రస్తుతం సినిమా... Read more

  • Chit chat lyricist bhaskarabhatla ravi kumar

    రచయిత భాస్కర భట్లతో

    Sep 18 | తెలుగు కళామతల్లికి తన మధురమైన పాటలను అందిస్తూ... తెలుగు ప్రేక్షకులను మదిని దోచుకున్న రచయిత భాస్కరభట్ల. ఆయన గురించి సినీ జనాలకు తెలిసింది తక్కువ. తెలియాల్సింది ఎక్కువ. ఆయనతో చేసిన చిట్ చాట్ లో... Read more

  • Director mohan krishna indraganti interview

    విలక్షణ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి

    Aug 24 | సృజనతో పాటు సాహిత్యాభిలాష కూడా ఉన్న దర్శకుడు పరిపూర్ణుడవుతాడు అనడానికి నిదర్శనం ఇంద్రగంటి మోహనకృష్ణ. చలం కథతో గ్రహణాన్ని తెరకెక్కించ గలిగాడంటే.. ఆ పరిపూర్ణతే కారణం. ట్రెడిషన్, ట్రెండ్... పొంతనలేని అంశాలివి. ఈ రెండిటినీ... Read more