అందరు సినిమా హీరోయిన్లు హన్సికలా ఉండరు అని అప్పట్లో దర్శక నిర్మాతలు తెగ సంతోషపడేవారు. అమ్మడు చెప్పిన టైంకు వస్తుంది, షూటింగ్ పూర్తయ్యే వరకు ఉంటుంది. పని పట్ల చాలా నిబద్ధత ఉందని తెగ మెచ్చుకునేవారు. ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతి కాల్చినట్లు.., అప్పుడు మెచ్చుకున్నవారికి ఇప్పుడీ అమ్మడు చుక్కలు చూపిస్తోంది. షూటింగ్ కు రావటం లేదా, సరిగ్గా నటించటం లేదా అంటే అదేం లేదు. టైంకు వస్తోంది, షూటింగ్ చేస్తోంది అంతా బాగానే ఉంది కానీ.., ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీ మాదిరిగా, ఎక్స్ ట్రా ఖర్చులతో వాడకమేంటో చూపిస్తోంది.
షూటింగ్ సమయంలో వచ్చేందుకు ప్రయాణ ఖర్చులు, ఫైవ్ స్టార్ హోటల్ బిల్లులు, ఫైవ్ స్టార్ హోటల్ నుంచే తీసుకొచ్చే తిండి ఖర్చులు, పర్సనల్ సిబ్బంది మెయింటనెన్స్ ఇతరత్రా ఖర్చులన్ని నిర్మాతే భరించాలట. పర్వాలేదులే, రెమ్యునరేషన్ లో కట్ చేసుకుంటాడు అనుకునేరు. అలా ఏమి కుదరదు, ఎక్కడి లెక్కలు అక్కడే అన్నట్లుగా, రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వాల్సిందే దీనిక తోడు మెయింటెనెన్స్ తప్పకుండా చేయాల్సిందే. ఈ లావిష్ లైఫ్ చార్జీలపై నిర్మాతలు మండిపోతున్నారు. అమ్మడి ఖర్చు తడిసి మోపెడు అవుతుంది అని వాపోతున్నారు.
పెద్ద నిర్మాతలు అయితే పర్వాలేదు అనుకోవచ్చు. కాని చిన్న, మోస్తరు నిర్మాతలు కూడా ఇలాంటి మెయింటనెన్స్ చేయాలి అంటే భయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం రెమ్యునరేషన్ పెంచి భయపెట్టిన హన్సిక ఇప్పుడు మెయింటెనెన్స్ తో మతిపోగొడుతోంది. తెలుగులో సినిమా ఇండస్ర్టీకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు, తమిళంలో స్టార్ హీరోయిన్ అయింది. బిజీ షెడ్యూల్ వల్ల ప్రస్తుతం హైదరాబాద్ కంటే చెన్నైలోనే ఎక్కువగా ఉంటోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more