Ntr sukumar movie heroine

ntr sukumar movie heroine, ntr sukumar movie latest news, ntr sukumar movie updates, ntr next movie updates, tamanaah next movie latest updates, tollywood latest news updates

ntr sukumar movie heroine : junior ntr sukumar combination movie heroine is under consideration but, there is a rumor that milky beauty name is at top preferred for lady lead role

అంతా ఆ రింగు మహిమేనా

Posted: 12/16/2014 12:20 PM IST
Ntr sukumar movie heroine

మిల్కీ బ్యూటి తమన్నాకు అదృష్టం ఎక్కడో తగులుకుంది. లేదంటే, కెరీర్ క్లోజింగ్ స్టేజ్ అని... ఇక సినిమాలు చేయదనుకున్న టైంలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. చెన్నైలో చేస్తున్న సినిమానే లాస్ట్ అని అంతా అనుకున్నారు. అయితే అనుకోకుండా నాగార్జున సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అక్కడితో ఆగకుండా ఇప్పుడు... ఎన్టీఆర్ మూవీలోనూ నటించనుందని టాక్ విన్పిస్తోంది. ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్ లో త్వరలోనే ఓ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలోనే చెప్పటం జరిగింది. ఈ మూవీ కోసం హీరోయిన్ ను ఇప్పటివరకు ఎవర్నీ ఎంపిక చేయలేదు.

రకుల్ ప్రీత్ సింగ్, ఇతర హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈ లిస్ట్ లో తమన్నా కూడా ఉందని టాక్ విన్పిస్తోంది. అంతేకాదు మిగతావారికంటే తమన్నాకు కాస్త ఎక్కువ అవకాశం ఉన్నట్లు ఫిలింనగర్ నుంచి టాక్ విన్పిస్తోంది. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. ప్రణిత, సమంత లాంటి హీరోయిన్లు కూడా ఇప్పటికిప్పుడు డేట్లు అడ్జస్ట్ చేయాలంటే ఇబ్బందులు పడక తప్పదు. తమన్నా ప్రస్తుతం తమిళంలో ఆర్యతో ఒక సినిమా చేస్తోంది. ఈ మూవీ తర్వాత నాగార్జున-కార్తి మల్టీస్టారర్ లో నటించనుంది. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ కన్ఫర్మ్ కాకపోవటంతో పాటు..  మిల్కీ బ్యూటికి బయట కూడా పెద్దగా చాన్సులు లేవు. దీంతో అమ్మడికే ఈ ఆఫర్ వస్తుందని గుసగుసలు విన్పిస్తున్నాయి.

ఇక దీనికంతటికి కారణం తమన్నా చేతికి ఉన్న రింగ్ అని ఊహాగానాలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం తమన్నా చేతికి ఉన్న ఉంగరం చూసి ఎంగేజ్మెంట్ రింగ్ అనుకున్నారు. అయితే తన తండ్రి గిఫ్ట్ గా ఇచ్చిన డైమండ్ రింగ్ అని బ్యూటి క్లారిటీ ఇచ్చింది. ఆ రింగ్ పెట్టుకోవటం వల్లే ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయి అంటున్నారు. తమన్నా - ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో ‘ఊసరవెల్లి’ సినిమా వచ్చింది. ఈ మూవీ కమర్షియల్ గా హిట్ కాకపోయినా.., ఇద్దరి యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన నటిస్తున్న ‘టెంపర్’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ‘రభస’ ఫ్లాప్ కావటంతో.., పూరీ తెరకెక్కించిన ఈ మూవీపై నందమూరి ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ntr sukumar movie update  tamannaah updates  tollywood latest  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more