Mega family eyes on sunny leone niharika comments on sunny

mega family, sunny leone, niharika, nagababu daughter niharika, sunny leone hot photo shoot, sunny leone latest stills, sunny leone movies, sunny leone tollywood, megastar chiranjeevi, director vv vinayak

mega family eyes on sunny leone niharika comments on sunny : the rumours are going that mega family wants to take sunny leone in chiru 150 movie. recently niharika praises sunny leone which goes viral in tollywood

సన్నీలియోన్ కు గాలం వేస్తున్న మెగా కుటుంబం!

Posted: 09/03/2014 04:22 PM IST
Mega family eyes on sunny leone niharika comments on sunny

(Image source from: mega family eyes on sunny leone niharika comments on sunny)

ఎక్కడో విదేశాల్లో పోర్న్ సినిమాలు చేసుకుంటూ జీవితపు బండిని నెట్టుకుంటున్న సన్నీలియోన్ ను... నేడు బాలీవుడ్ ఆమెను నెత్తిమీద కూర్చోబెట్టుకుంది. ఈమె పంజాబీ భామ కాబట్టి.. ఎక్కడో గాలికి వదిలేయడం ఎందుకు.. మన ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి బిజినెస్ చేసుకుందామనే ఆలోచనతో సన్నీలియోన్ ను ఏకంగా పోర్న్ తార నుంచి బాలీవుడ్ అగ్రకథానాయికగా మార్చేశారు. దీంతో వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా సన్నీలియోన్ బాగానే వాడేసుకుంది. విదేశాల్లో ఎలాగో మొత్తం చూపించేసింది... ఆ ఎక్స్ పీరియెన్స్ తో ఇక్కడ తన అందాలను ఆరబోసేసింది. అంతే! ప్రేక్షకజనాలు ఎగబడిమరీ థియేటర్లబాట పట్టారు. తనలో వున్న సెక్స్ అప్పీల్ ను మొత్తం చూపించేయడంతో అటు ప్రేక్షకులతోపాటు దర్శకనిర్మాతలు కూడా కరిగిపోయారు. ఈ అమ్మడితో బిజినెస్ బాగానే చేసుకోవచ్చంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. సన్నీ కూడా తనలో వున్న గ్లామర్ ను మొత్తం చూపించుకుంటూపోతోంది. దీంతో బాలీవుడ్ అగ్రకథానాయిక జాబితాల్లో సన్నీ చేరిపోయింది.

అంతేకాదు.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా తన మాయాజాలాన్ని కప్పేసింది. ఇప్పటికే తమిళ తంబీలకు కునుకులేకుండా చేసిన ఈ భామ... మంచుమనోజ్ సరసన అందరికీ షాక్ ఇవ్వడానికి కరెంట్ తీగలో నటిస్తోంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని తెలుగు ప్రేక్షకులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. చిత్రపరిశ్రమకు వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రేక్షకులను ఎలా ఆకర్షించాలోనన్న మంత్రాన్ని సన్నీ ఫాలో అవడంతో దేశంమొత్తం మీద ఈ అమ్మడికి యమ క్రేజ్ పెరిగిపోయింది. ఈ అమ్మడి క్రేజ్ క్యాచ్ చేసుకుని తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి బాలీవుడ్ అగ్రహీరోలు సైతం ఈ అమ్మడితో తమ సినిమాల్లో ఐటెంగాళ్ గా స్టెప్పులు వేయించుకుంటున్నారంటే... సన్నీకి ఎంత డిమాండ్ వుందో ఇట్టే అర్థమైపోతుంది. అదీ సన్నీలియోన్ పవర్!

ఇదిలావుండగా... తాజాగా టాలీవుడ్ మెగాఫ్యామిలీ కూడా సన్నీలియోన్ వలలో చిక్కుకుపోయిందని జోరుగా వార్తలు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడు చిరు 150వ సినిమాలో నటిస్తోందంటూ ప్రచారాలు సాగుతున్నాయి. చిరు నటించే 150వ సినిమాలో తనకూ అవకాశం కల్పించాల్సిందిగా దర్శకుడు వివి వినాయక్ కు సన్నీలియోన్ రిక్వెస్ట్ చేసినట్లు సమాచారాలు వెలువడ్డాయి. ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఎలాగైనా ఇప్పించాలని.. అందుకు తాను ఎంత సెక్సీగా రెడీ అవ్వడానికైనా సిద్ధమేనని చెప్పినట్లు ఇన్ సైట్ టాక్ నడుస్తోంది. కానీ ఈ అమ్మడు ఆఫర్ ఇవ్వాలా..? వద్దా..? అన్న విషయం మాత్రం ఇంకా కన్ఫర్మ కాలేదు. అయితే చిరు 150వ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు కానీ... ఆ లిస్టులో వివి వినాయక్ పేరు ఖచ్చితంగా వుంది. ఆ నేపథ్యంలోనే సన్నీ, వినాయక్ తో కలిసి తన తదుపరి చిత్రం గురించి సంభాషణలు జరిపినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్న వ్యాఖ్యానాల ప్రకారం.. తన 150వ చిత్రంలో సన్నీలియోన్ కు చిరు ఆఫర్ ఇవ్వడానికి సిద్ధమేనన్న వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

మరోవైపు మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా ఈ అమ్మడి గురించి తెగ పొగిడేస్తోంది. సన్నీలియోన్ చాలా క్యూట్ గా వుంటుందని.. సన్నీ అంటే తనకెంతో ఇష్టమని చెబుతోంది. దీంతో నిహారిక నోటినుంచి సన్నీ గురించి ప్రస్తావన రావడం హాట్ టాపిక్ గా మారిపోయింది. చిరు 150వ చిత్రంలో తీసుకునే దిశగా నిహారిక ఇలా కామెంట్లు చేసి వుండొచ్చని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇటీవలే నిహారిక, మంచు లక్ష్మీతో కలిసి అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమంలో సన్నీలియోన్ మీద తన అభిమానాన్ని ఇలా చాటుకుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే.. చిరు తన 150వ చిత్రంలో సన్నీలియోన్ ఏదైనా ఒక పాత్రగానీ లేదా ఐటెంసాంగ్ ఆఫర్ ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా వున్నాయనే ఊహాగానాలు టాలీవుడ్ లో బాగానే వీస్తున్నాయి. దీంతో సన్నీలియోన్ కోసం మెగా ఫ్యామిలీ గాలం వేస్తున్నారని.. అలాగే సన్నీ కూడా చిరు సినిమాలో నటించడానికి తన హాట్ మంత్రాన్ని ఉపయోగిస్తోందని చర్చలు సాగుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunny leone  nagababu daughter niharika  megastar chiranjeevi  tollywood  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more