Rajinikanth 2.0 Beats Avengers Infinity War ‘రోబో 2.0’ రివ్యూ..

Teluguwishesh ‘రోబో 2.0’ ‘రోబో 2.0’ The film, Rajinikanth and Akshay Kumar's 2.0 the most expensive one that has ever been made in India is also expected to earn far more than its budget. Product #: 89200 3.5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ‘రోబో 2.0’

 • బ్యానర్  :

  లైకా ప్రొడక్షన్స్‌

 • దర్శకుడు  :

  శంకర్‌

 • నిర్మాత  :

  ఎ.సుభాష్‌కరణ్‌, రాజు మహాలింగం

 • సంగీతం  :

  ఎఆర్ రహమాన్

 • సినిమా రేటింగ్  :

  3.53.53.5  3.5

 • ఛాయాగ్రహణం  :

  నీరవ్ షా

 • ఎడిటర్  :

  అంథోని

 • నటినటులు  :

  రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్, సుధాన్షు పాండే, అదిల్ హుస్సేన్, కళాభవన్ షాంజన్, రియాజ్ ఖాన్ త‌దిత‌రులు

Robo 2 0 Movie Review Rating

విడుదల తేది :

2018-11-29

Cinema Story

పక్షిరాజా (అక్షయ్ కుమార్) పక్షులను అమితంగా ప్రేమించే వ్యక్తి. పక్షులు లేకపోతే మానవుడి మనుగడే లేదని నమ్మిన వ్యక్తి. ప్రపంచంలోని రకరకాల పక్షి జాతులను ఆయన తన ఇంట్లో సంరక్షిస్తుంటారు. మరోవైపు, సెల్‌ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా పక్షులు చనిపోతున్నాయని.. సెల్‌ఫోన్ వాడకాన్ని మానుకోవాలని ప్రచారం చేస్తుంటారు. సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ను తగ్గించాలని టెలీకాం కంపెనీలతో, ప్రభుత్వంతో పోరాడతాడు.

కానీ, ఎక్కడికి వెళ్లినా పరిష్కారం దొరకకపోగా పక్షిరాజాకు అవమానమే ఎదురవుతుంది. ఆఖరికి తను పక్షులను సంరక్షిస్తోన్న ఇంటి పక్కన సెల్ టవర్ ఏర్పాటు చేస్తారు. దీని నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా పక్షిరాజా పక్షులన్నీ చనిపోతాయి. దీంతో ఆ సెల్ టవర్‌కే పక్షిరాజా ఉరివేసుకుని చనిపోతాడు. ఆ తరవాత భయంకర శక్తిగా మారి ప్రజలపై కక్ష తీర్చుకోవడానికి బయలుదేరుతాడు. ఆ శక్తిని వసీకరన్ (రజినీకాంత్) తన చిట్టి (రోబో)ని ఉపయోగించి ఎలా ఎదుర్కొన్నారు అనేదే అసలు సినిమా.

cinima-reviews
‘రోబో 2.0’

విశ్లేషణ

‘2.0’ ఓ విజువల్ వండర్. విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్, 3డి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇన్నీ వున్నా ప్రేక్షకుడిని కట్టిపడేసే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ మాత్రం లేవు. ‘రోబో’లో చూపించిన ఆ కమర్షియల్ అంశాలకు శంకర్ ఈ చిత్రంలో అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. తన దృష్టినంతా కేవలం విజువల్ ఎఫెక్ట్స్ పైనే పెట్టారు. సినిమా మొత్తం కేవలం యాక్షన్‌ థ్రిల్లర్ తో నింపేశారు. పక్షిరాజా గతాన్ని ఎమోషన్ అద్దే విషయాన్ని కూడా మర్చిపోయాడా.? అన్నట్లు గా వుంది. అయితే విజువల్‌గా మాత్రం ‘2.0’ అద్భుతమనే చెప్పాలి.

స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉన్న కథనాన్ని మాత్రం శంకర్ తనదైన శైలిలో నడిపించారు. తొలిభాగలో సెల్ ఫోన్లన్నీ ఆకాశంలోకి ఎగిరిపోవడం, కొంత మందిని సెల్‌ఫోన్ల సాయంతో కంటికి కనిపించని శక్తి అంతమొందించడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ శక్తి ఏంటో కనిపెట్టడానికి తన రోబో అసిస్టెంట్ వెన్నెల (అమీ జాక్సన్) సాయంతో వసీకరన్ చేసే పరిశోధనలు, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తే ఆ శక్తి అని తెలుసుకోవడం, దాన్ని అడ్డుకోవడానికి ఏం చేయాలి అనే అంశాలతో తొలి భాగం ముగుస్తుంది. పాటలు, అనవసరపు సన్నివేశాలు లేకపోవడం వల్ల ఫస్టాఫ్ బోరింగ్ గా అనిపించదు.

ఇక మలిభాగంలో పక్షిరాజా పరిచయం, ఆయన గతం, ఆయనతో చిట్టి పోరాటాలను చూపించారు. సెకండాఫ్ లో మొత్తం కంప్యూటర్ సృష్టే. రోబో వర్షన్ 2.0తో పాటు చిన్ని అనే మైక్రోరోబోలను కూడా శంకర్ పరిచయం చేశారు. రజినీ స్టైల్లో రోబో పోరాట సన్నివేశాలు, రోబోగా ఆయన నటన ఆకట్టుకుంటాయి. ఇక ఆఖరి 30 నిమిషాల పోరాట సన్నివేశాలైతే ప్రేక్షకుడికి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. వసీకరన్ లోకి ప్రవేశించిన పక్షిరాజాను రోబో వర్షన్ 2.0 ఎదుర్కొన్న సన్నివేశాలు అద్భుతం. ముఖ్యంగా 3డిలో చూసే ప్రేక్షకుడు కొత్త అనుభూతిని పొందుతాడు. పావురాలపై మైక్రో రోబోలు ఎగురుకుంటూ రావడం కొత్తగా అనిపిస్తుంది.

నటీనటుల విషానికి వస్తే

ఈ సినిమాలో నటనకు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి. అక్షయ్ కుమార్ పాత్రకు మాత్రమే కాస్త ఎక్కువ స్కోప్ ఉంది. వృద్ధుడిగా, మనుషులను చంపే క్రూరమైన పక్షిగా అక్షయ్ నటన చాలా బాగుంది. ఇక ఎప్పటిలానే రజినీకాంత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా రోబో పాత్రలో తన స్టైల్ చమత్కారాలతో నవ్వించారు. అమీ జాక్సన్ హ్యూమనాయిడ్ రోబోగా బాగా నటించింది. అదిల్ హుస్సేన్, కళాభవన్ షాజన్, సుధాన్షు పాండే తమ పాత్రల పరిధి మేర నటించారు.

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘రోబో’ సినిమాతోనే భారతీయ సినిమాను శంకర్ మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ ‘2.0’తో దాన్ని మరింత పెంచే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయ స్థాయి విజువల్స్, యానిమేషన్, ఎఫెక్ట్స్‌తో అద్భుతమైన ఔట్‌పుట్‌ను అందించారు. ఈ సినిమాను 3డిలో చూసే ప్రేక్షకుడు టైటిల్స్‌ చూసినప్పుడే ‘వావ్’ అనకమానడు. శంకర్ తరవాత చెప్పుకోవాల్సిన అంశం చిత్ర సంగీతం గురించే. ఎఆర్ రహమాన్ సంగీతానికి ఈ చిత్రంలో ఫుల్ మార్క్స్ పడ్డాయి.

కుతుబ్-ఇ-కృపతో కలిసి ఆయన చేసిన రీరికార్డింగ్ అదిరిపోయింది. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో సౌండ్ టెక్నాలజీ కొత్త అనుభూతిని ఇస్తుంది. నిరవ్ షా సినిమాటోగ్రఫీ మరో ప్లస్. ఇలాంటి సినిమాలను చిత్రీకరించడంలో కెమెరామన్ పాత్ర కూడా చాలా కీలకం. ఆ పాత్రకు నిరవ్ పూర్తి న్యాయం చేశారు. సినిమాను సాగదీయకుండా ఎడిటర్ ఆంటొని బాగా ఎడిట్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు..

సెల్ టవర్స్ విచ్చలవిడిగా ఏర్పాటు చేయడంతో పక్షుల అంతమవుతున్నాయని, ఇది క్రమేనా మనిషి జాతిని కూడా అంతం చేస్తుందన్న సందేశాత్మక చిత్రమిది. అయితే ఆ మెసేజ్ ను బలంగా చెప్పడం కన్నా విజువల్ గా చూపించే ప్రయత్నం బాగుంది. మొత్తంగా ఈ సినిమా ఒక విజువల్ వండర్..!

చివరగా... అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ చిత్రం....

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh