Oxygen Telugu Movie Review and Rating | ఆక్సిజన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Teluguwishesh ఆక్సిజన్ ఆక్సిజన్ Gopichand's Oxygen Telugu Movie Review and Rating. Cast Performance and Verdict. Product #: 85816 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఆక్సిజన్

  • బ్యానర్  :

    శ్రీ సాయి రాం క్రియేషన్స్

  • దర్శకుడు  :

    ఎం.జ్యోతికృష్ణ‌

  • నిర్మాత  :

    ఎస్‌.ఐశ్వ‌ర్య‌

  • సంగీతం  :

    యువ‌న్ శంక‌ర్ రాజా

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    ఛోటా కె.నాయుడు, వెట్రి

  • ఎడిటర్  :

    ఎస్‌.బి.ఉద్ధ‌వ్‌

  • నటినటులు  :

    గోపీచంద్, రాశీఖన్నా, జగపతిబాబు, అనూ ఇమ్మాన్యుయేల్, షియాజీ షిండే తదితరులు

Oxygen Telugu Movie Review

విడుదల తేది :

2017-11-30

Cinema Story

ఒకే ఊరికి చెందిన పెద్ద మనషులు రఘుపతి (జ‌గ‌ప‌తిబాబు), వీర‌భ‌ద్ర‌మ్ (షాయాజీ షిండే) కుటుంబాలు మొదట్లో స్నేహంగానే ఉంటాయి. తర్వాత కొన్ని అపార్థాలతో వాళ్లు విడిపోతారు. వాళ్ల పగలు కూడా కొన్నేళ్లపాటు అలాగే కొనసాగుతుంటాయి. తర్వాత ర‌ఘుప‌తి కుమార్తె శ్రుతి (రాశి ఖ‌న్నా)కి ఓ అమెరికా సంబంధం కుదురుతుంది. తెలుగింటి సంప్ర‌దాయాల‌కు విలువిచ్చే కృష్ణ ప్ర‌సాద్.. త‌క్కువ టైమ్‌లోనే ఆ కుటుంబానికి ద‌గ్గ‌ర‌వుతాడు. అదే సమయంలో వాళ్ల కుటుంబాన్ని ఆపద నుంచి రక్షిస్తుండటంతో శ్రుతికి కూడా కృష్ణ ప్రసాద్ పై ఇష్టం పుడుతుంది. ఇంతలో ఊహించని ఓ ట్విస్ట్ తో కృష్ణ ప్ర‌సాద్ భండారం బయటపడుతుంది. అసలు కృష్ణ ప్ర‌సాద్‌ గతం ఏంటి? ఆ ఇంటికి ఎందుకు వస్తాడు? అతని అసలు పోరాటం ఏంటి? అన్నదే కథ. 

 

cinima-reviews
ఆక్సిజన్

గోపీచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రం ఎట్ట‌కేల‌కు గురువారం విడుదలయ్యింది. రాశీఖన్నా హీరోయిన్ గా, జగపతిబాబు కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

విశ్లేష‌ణ‌

ద‌ర్శ‌కుడు జ్యోతికృష్ణ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కానీ తెర‌పై దాన్ని ప్ర‌జెంట్ చేసిన తీరు అంతా ఇంప్రెసివ్‌గా అనిపించ‌లేదు. ప్ర‌థ‌మార్ధం కంటే ద్వితీయార్ధం ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. స్క్రీన్‌ప్లేని మ‌రింత బాగా తీర్చిదిద్దాల్సింది. సినిమాలో ఓవ‌రాల్‌గా రెండు, మూడు స‌న్నివేశాలు మాత్ర‌మే అల‌రించేలా ఉన్నాయి. ట్విస్టులతోనే కథ అల్లాలనుకున్న దర్శకుడి ప్రయత్నం బెడిసి కొట్టింది. మిగతా కథంతా చాలా పేలవంగా ఉండటంతో ప్రేక్షకుడి సహనానికి పరీక్షలాగా అనిపిస్తుంది.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే..గోపీచంద్ న‌ట‌న బాగుంది. ఇంట్ర‌వెల్ సీన్‌, క్లైమాక్స్ సీన్‌లో అత‌ని న‌ట‌న గుర్తుండిపోతుంది. క‌థానాయిక‌ల ప‌రిధి త‌క్కువ‌. పల్లెటూరి అమ్మాయిగా రాశి కనిపించినా గ్లామర్ పరంగా మెరుపులు లేవు. అనూ అందంగా కనిపించినా మరీ చిన్నపిల్లలా అనిపిస్తుంది. న‌ట‌న‌తో ఇద్దరూ మెప్పించ‌లేక‌పోయారు. ఇక జ‌గ‌ప‌తిబాబు ఎప్ప‌టిలాగే త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. మిగిలిన న‌టులు త‌మ ప‌రిధుల్లో చ‌క్క‌గా న‌టించారు.

సాంకేతికంగా సినిమా ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. యువన్ శంకర్ పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాడు. ఛాయాగ్ర‌హ‌ణం రిచ్ గా ఉంది. ఎడిటింగ్ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త తీసుకోవాల్సింది. నిర్మాణ‌ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌

గోపీచంద్‌ నటన

కాన్సెప్ట్‌

సెకండాఫ్‌

  

 

మైన‌స్ పాయింట్స్‌

రొటీన్ స్క్రీన్‌ప్లే

పాట‌లు

ఫ‌స్టాఫ్‌

ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేక‌పోవ‌డం


తీర్పు ...
అప్పుడెప్పుడో పదేళ్ల క్రితమే దర్శకుడిగా పరిచయం అయిన జ్యోతికృష్ణ సక్సెస్ ఫుల్ చిత్రాన్ని అందించలేకపోయాడు. ట్విస్టులతో థ్రిల్లింగ్ గా ఫీలయినప్పటికీ.. మిగతా కథలో పసలేకుండా పోయింది. హాల్ నుంచి బయటకు వచ్చే రెండు సినిమాలు చూశామా? అన్న ఫీలింగ్ తో బయటకు వస్తాడు.

చివ‌ర‌గా.. ఆక్సిజ‌న్‌.. అస్సలు అలరించలేదు.