Khakee Movie Review and Rating | కార్తీ ఖాకీ మూవీ రివ్యూ... యాక్షన్ లవర్స్ కి ట్రీట్

Teluguwishesh ఖాకీ ఖాకీ Karthi Khakee Telugu Movie Review and Rating. Karthi and rakul in lead roles Vinoth Directed this Action Cop Drama. Product #: 85608 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఖాకీ

  • బ్యానర్  :

    డ్రీమ్ వారియర్ పిక్చర్స్

  • దర్శకుడు  :

    హెచ్ వినోథ్

  • నిర్మాత  :

    ఎం డీ ఉమేశ్ గుప్తా-సుభాష్ గుప్తా

  • సంగీతం  :

    గిబ్రాన్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    సత్యన్ సూర్యన్

  • ఎడిటర్  :

    శివనందీశ్వరన్

  • నటినటులు  :

    కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యు సింగ్ తదితరులు

Khaki Movie Review

విడుదల తేది :

2017-11-17

Cinema Story

ధీరజ్(కార్తీ) కల పోలీస్ కావటం. అందుకోసం చాలా కష్టపడతాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయిని(రకుల్) ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే ఉద్యోగంలో చేరిన ధీరజ్ దూకుడు చూపిస్తూ క్రిమినల్స్ భరతం పడుతుంటాడు. ఈ క్రమంలో అధికారం అతనికి ట్రాన్స్ ఫర్ లనే బహుమతులు అందిస్తుంది. 

ఇంతలో దోపిడీ దొంగలు ఎక్కువగా ఉండే ప్రాంతానికి నిజాయితీపరుడైన ధీరజ్ ను బదిలీ చేస్తారు అధికారులు. అక్కడ ధీరజ్ కిరాతకులైన ఓ ముఠా అంతు తేల్చాలని కంకణం కట్టుకుంటాడు. అయితే ఆ గ్యాంగ్ మాత్రం అతనికి అస్సలు చిక్కదు. పైగా వాళ్ల నుంచి సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. ఈ పరిస్థితుల్లో ధీరజ్ ఏం చేస్తాడు? ఆ గ్యాంగ్ నేత ఓమా ను ఎలా ట్రాప్ చేస్తాడు? చివరకు ధీరజ్ ఎలా విజయం సాధిస్తాడు అన్నదే కథ.

cinima-reviews
ఖాకీ

తమిళ్ హీరో అయినా కార్తీకి ఇక్కడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఊపిరితో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన కార్తీ ఇప్పుడు ఖాకీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాతృక ధీరన్‌ అధిగారమ్ ఒండ్రు.. డబ్బింగ్ వర్షన్ ఖాకీ రెండూ ఒకేసారి ఇవాళ రిలీజ్ అయ్యాయి. వినోథ్ దర్శకత్వం వహించిన ఈ కాప్ థ్రిల్లర్ లో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

విశ్లేషణ...

ఖాకీ 1995-2005 మధ్య కాలంలో జరిగే ఓ కథ. దీనికి తగ్గట్లే దర్శకుడు ఎంచుకున్న కథ, కథనం.. ఆయా వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించే యత్నం చేశాడు దర్శకుడు వినోథ్. కథ వరకు పక్కాగా రాసుకుని సస్పెన్స్ గా తెరకెక్కించిన దర్శకుడు.

ముఖ్యంగా దోపిడీ దొంగలు ఎలా వ్యవహరిస్తారో బాగా అధ్యయనం చేసి చిత్రీకరించటంపై అభినందించకుండా ఉండలేం. అయితే ఆ ఎపిసోడ్ లే చిత్రానికి బ్యాక్ డ్రాప్ గా మారాయి. హీరో ప్రణాళికలు వేసి వారిని మట్టుపెట్టే సన్నివేశాలు సాగదీతలా అనిపించాయి. రొమాంటిక్ ట్రాక్.. కామెడీ సీన్లు... హీరో ఎయిమ్ తో ఫస్టాఫ్ ను ఫర్వాలేదనిపించిన దర్శకుడు.. అసలు కథలోకి ఎంటర్ అయ్యాక ఎంగేజింగ్ గా నడిపాడు. కానీ, అవి లెంగ్తీగా ఉండటంతో ప్రేక్షకుడు కాస్త అసహనానికి లోనవుతారు.

 

కార్తీ నిజాయతీపరుడైన పోలీసాఫీసర్ రోల్ లో అలరించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హుషారుగా కనిపించే పాత్ర.. డ్యూటీ లో చేరాక టఫ్ ఆఫీసర్ గా రెండు వేరియేషన్స్ చూపించాడు. రకుల్ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణ. హీరో-హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అభిమన్యు సింగ్ విలన్ పాత్ర మెప్పించినా స్క్రీనింగ్ స్కోప్ తక్కువగానే ఉంది. మిగతా పాత్రలు ఫర్వాలేదు.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. గిబ్రాన్ అందించిన పాటలు అంత ఘనంగా ఏం లేవు.అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ తో మాత్రం మ్యాజిక్ చేశాడు. బృందా ఇచ్చిన విజువల్ వర్క్ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ ముఖ్యంగా హైవే బస్సు ఫైట్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

తీర్పు...

వాస్తవిక ఘటనల ఆధారంగా కథను రాసుకున్న దర్శకుడు కమ్ రచయిత వినోథ్ సినిమాకు గ్రిప్పింగ్ గా మాత్రం తెరకెక్కించలేకపోయాడు. అయితే క్రైమ్ తరహా థ్రిల్లర్స్ ను ఎంజాయ్ చేసేవారికి మాత్రం ఖాకీ ఖచ్ఛితంగా నచ్చి తీరుతుంది.

చివరగా... యాక్షన్ మూవీ లవర్స్ కోసమే ఖాకీ