Mahanubhavudu Movie Review and Rating | మహానుభావుడు రివ్యూ.. భలే భలే ఎంటైర్ టైన్ మెంట్

Teluguwishesh మహానుభావుడు మహానుభావుడు Mahanubhavudu Telugu Movie Review and Rating. Shrawanand Starrer under Maruthi Direction impressed. Product #: 84884 3 stars, based on 1 reviews
 • చిత్రం  :

  మహానుభావుడు

 • బ్యానర్  :

  యూవీ క్రియేషన్స్

 • దర్శకుడు  :

  మారుతి

 • నిర్మాత  :

  వంశీ, ప్రమోద్

 • సంగీతం  :

  ఎస్ ఎస్ థమన్

 • సినిమా రేటింగ్  :

  333  3

 • ఛాయాగ్రహణం  :

  నిజార్ షఫి

 • నటినటులు  :

  శర్వానంద్, మెహ్రీన్ కౌర్, వెన్నెల కిషోర్, నాజర్, కళ్యాణి నటరాజన్, ఆనంద్, జబర్దస్త్ వేణు, భద్రం తదితరులు

Mahanubhavudu Telugu Movie Review

విడుదల తేది :

2017-09-29

Cinema Story

ఆనంద్ (శర్వానంద్) అతి శుభ్రత అనేది బలహీనతగా మారిపోయిన ఓ కుర్రాడు. అది క్రమంగా ఓసీడీ అనే వ్యాధి అయితే అతను మాత్ర దాన్నో అర్హతగా గర్వంగా ఫీలవుతుంటాడు. ఇంతలో తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న మేఘన (మెహ్రీన్ కౌర్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమించి తన తండ్రికి విషయం చెప్పటంతో ఓకే చెబుతాడు కూడా. అయితే ముందు ఆనంద్ బలహీనతను తేలిగ్గానే తీసుకున్న మేఘనకు తర్వాత దాని తీవ్రత అర్థమవుతుంది. దీంతో అతణ్ని అసహ్యించుకుని దూరంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు తన ప్రేమను సాధించుకునేందుకు ఆనంద్ ఏం చేస్తాడు? తన బలహీనతను మార్చుకుంటాడా? చివరకు ఏమౌతుంది? అన్నదే కథ.

cinima-reviews
మహానుభావుడు

వరుసగా ఎంటర్ టైన్ మెంట్ సబ్జెక్టులు ఎంచుకుంటున్న శర్వానంద్ సక్సెస్ రాధాతో కాస్త బ్రేక్ పడింది. మరోవైపు మారుతి కూడా ఎంటర్టైనర్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే ఓ ఆసక్తి నెలకొంది. దీనికి తోడు అతిశుభ్రత అనే వ్యాధితో హీరో బాధపడుతున్నాడంటూ కథను రివీల్ చేయటంతో మహానుభావుడు సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి సినిమాగా ఏమేరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

విశ్లేషణ:

యూనిక్ కాన్సెప్ట్ అంటే సినిమాలో ఏదో ఒక కీ పాయింట్ చుట్టూ కథలు రావటం చాలా అరుదు. అయితే పోలిక కథలతోనే సినిమాను రూపొందించటం చాలా కష్టం. అదే సమయంలో దాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయటంలోనూ దర్శకుడు చాలా కష్టపడాలి. కానీ, మహానుభావుడు మాత్రం అలాంటి కథ కాదు. భలే భలే మగాడివోయ్... సినిమాను కాస్త అటు ఇటుగా మార్చి తెరకెక్కించాడు.

పైగా అదే ఫార్మాట్లో నడిపించాడు కూడా. కాకపోతే ఇక్కడ తండ్రిని బదులు ప్రేమించిన అమ్మాయినే ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఇక్కడ వచ్చింది. కథ పరంగా కొత్తగా ఏం అనిపించదు. అలాగని డల్ ఫ్లాట్ తో కథను ఏ మాత్రం నడిపించలేదు. పూర్తిగా వినోదాత్మకంగా నడిపించాడు. కీలకమైన కొన్ని సందర్భాల్లో కథ లాజిక్కులకు అందకుండా సాగినప్పటికీ.. ఎంటర్టైన్మెంట్ వరకు ఢోకా ఉండదు. హీరో మానసిక రుగ్మతను ఏ మాత్రం సైడ్ ట్రాక్ లోకి తీసుకెళ్లకుండా పూర్తిగా ఆ పాయింట్ మీదే నడిపించాడు.

దీనికి తోడు లీడ్ పెయిర్.. వాళ్ల మధ్య మంచి కెమిస్ట్రీ.. వినసొంపైన సంగీతం.. ప్లెజెంట్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాలోని లోపాల్ని కవర్ చేస్తాయి. మారుతి మార్కు చమత్కారం అడుగడుగునా కనిపిస్తుంది. దీనికి తోడు సిచువేషనల్ కామెడీ పండిచడంలో మారుతి విజయవంతమయ్యాడు. ద్వితీయార్ధంలో హీరోయిన్ ఇంట్లో నేపథ్యంలో సాగే వ్యవహారం మరీ రొటీన్ గా అనిపిస్తుంది. హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్స్ తో హీరో సెంటిమెంట్.. సర్పంచ్ పదవి కోసం కుస్తీ ఇవన్నీ పాత కాలం నాటి సినిమాను తలపిస్తాయి. మధ్య మధ్యలో గుసగుసల కామెడీ కాస్త నవ్విస్తుంది. హీరో హీరోయిన్లు.. వాళ్ల రొమాన్స్.. మంచి సంగీతం.. ఛాయాగ్రహణం కూడా సినిమాను ప్లెజెంట్ గా మార్చే అంశాలు.

 

కాస్టింగ్ విషయానికొస్తే.. శర్వానంద్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఓవర్ క్లీన్ కోసం పరితపించే యువకుడి రోల్ లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్లతో మెహ్రీన్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. యూత్ మెహ్రీన్ కు కనెక్ట్ అయ్యే ఛాన్సులే ఎక్కువ. వీరి తర్వాత చెప్పుకోదగింది వెన్నెల కిషోరే. తనదైన కామెడీ టైమింగ్ తో.. హావభావాలతో అలరించాడు. నాజర్, మిగతా వాళ్లు ఫర్వాలేదు.

సాంకేతికవర్గం విషయానికొస్తే.. థమన్ చాలా రోజుల తర్వాత మెలోడియస్ ట్యూన్లు అందించాడు. టైటిల్ సాంగ్ మెప్పిస్తుంది. బ్యాగ్రౌండ్ ఎప్పటిలాగే ఓకే. నిజార్ షఫి ఛాయాగ్రహణం కూడా బాగుంది. విజువల్స్ ఆద్యంతం రిచ్ గా... ప్లెజెంట్ గా అనిపిస్తాయి. యువి క్రియేషన్స్ వాళ్ల నిర్మాణ విలువలకు ఢోకా లేదు.


తీర్పు :

తన కెరీర్ డల్ అయినప్పుడల్లా ఏదో ఒక మ్యాజిక్ మూమెంట్ తో మ్యాజిక్ చేసే మారుతి.. ఈసారి అదే పని చేశాడు. కథలో పెద్దగా అద్భుతం అనిపించే మూమెంట్స్ ఏం లేకపోయినా వినోదంతో సినిమా బండిని లాగించేశాడు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ మన తెలుగు వారికి కొత్త కావటం విశేషం. ఓవరాల్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ తో యువ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించే అంశాలుండటం కలిసొచ్చే అంశం.

చివరగా.. మహాభావుడు ఫర్వాలేదు.. మెప్పిస్తాడు.