Sachin A Billion Dreams Movie Review, Rating, Cast & Crew

Teluguwishesh సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌ సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌ Sachin Tendulkar Biopic Sachin:A Billion Dreams Movie Review. Complete Story, cast performance and Analysis. Product #: 82752 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌

  • బ్యానర్  :

    200 నాట్ అవుట్ ప్రోడక్షన్స్, కార్నివాల్ మోషన్స్ పిక్చర్స్

  • దర్శకుడు  :

    జేమ్స్ ఎర్‌స్కైన్

  • నిర్మాత  :

    రవి భగచంద్కా

  • సంగీతం  :

    ఏఆర్ రెహమాన్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఎడిటర్  :

    అద్వేశ్ మోహ్లా

  • నటినటులు  :

    సచిన్, అంజలి టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్, ధోనీ, సెహ్వాగ్ తదితరులు

Sachin Movie Review

విడుదల తేది :

2017-05-26

Cinema Story

ఇది కథ కాదు. సచిన్ టెండూల్కర్ జీవితంలోని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందించబడింది.

cinima-reviews
సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌

క్రికెట్ దేవుడిగా అభిమానులు పూజలు అందుకునే సచిన్ టెండూల్కర్ మైదానాలకు దూరమైనా ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాడు. సచిన్ ప్రత్యేకమైన ఆట శైలి. అందుకే తన బయోపిక్ విషయంలో కూడా వైవిధ్యతనే ప్రదర్శించాడు. మిగతా వాళ్లలాగా సినిమాటిక్ గా కాకుండా కేవలం డాక్యుమెంటరీ తరహాలో రియల్ ఇన్సిడెన్స్, రియల్ క్యారెక్టర్లతోనే పూర్తి సినిమాను రూపొందించాడు. అందుకే ఈ రివ్యూను కాస్త ప్రత్యేకంగా విశ్లేషిద్దాం.

2003 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్ దారుణంగా ఓడిపోయాక సచిన్ తో సహా ఆటగాళ్ల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. ఆ టైంలో ఎలా రియాక్ట్ కావాలో తెలీక అభిమానుల కోసం ఓ ఎమోషనల్ సందేశాన్ని ఇచ్చాడు మాస్టర్ బ్లాస్టర్. అది ఎంత రియాలిటీగా ఉందో... సినిమాలో కూడా అంతే ఎమోషనల్ గా పండింది. సినిమా మొత్తంగా చూసుకుంటే ఇలాంటివి బోలెడు. సచిన్ అనేది ఓ సినిమాగా కాకుండా ఇలా డిఫరెంట్ తరహాలో తెరకెక్కించి మంచి ప్రయత్నమే చేశాడు దర్శకుడు జేమ్స్ ఎరిక్ సెనె.

 

కెరీర్ ఆరంభం నుంచి రిటైర్ మెంట్ దాకా సచిన్ కెరీర్లో మిస్సయిన అంశాలన్నింటిని ఇందులో చూపించేశారు. సచిన్ పూర్తిస్థాయి లైఫ్ గమనించని జనరేషన్ కు ఇదోక మంచి ఛాయిస్. పూర్తి రన్ టైం 2 గంటల 20 నిమిషాలు కాగా, ఫస్టాఫ్ ఎంత వేగంగా సాగుతుందో.. సెకండాఫ్ కాస్త స్లోగా నడుస్తుంది. చివర్లో ముగింపు కాస్త డ్రమాటిక్ గా అనిపించినప్పటికీ, పాటలు, వగైరా లాంటి మసాలా ఎలిమెంట్స్ లేకపోయినప్పటికీ, ఓవరాల్ గా సగటు భారతీయుడికి ప్రేరణ కలిగించేందిగా ఉంటుంది. 2011 వరల్ట్ కప్ విక్టరీ హైలెట్ గా నిలవగా, సచిన్ భార్య అంజలి, తనయుడు అర్జున్, కూతురు సారా, ధోనీ, సెహ్వాగ్, కామెంటేటర్ హర్ష బోగ్లే తదితర క్యారెక్టర్లు సినిమాకు జీవం పోశాయి.

 

చివరగా.. సచిన్.. సచిన్... 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.