అప్పట్లో ఒకడుండేవాడు రివ్యూ | Appatlo Okadundevadu review

Teluguwishesh అప్పట్లో ఒకడుండేవాడు అప్పట్లో ఒకడుండేవాడు Appatlo Okadundevadu Movie Review. Product #: 80003 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    అప్పట్లో ఒకడుండేవాడు

  • బ్యానర్  :

    అరాన్ మీడియా వర్క్స్

  • దర్శకుడు  :

    సాగర్ కె చంద్ర

  • నిర్మాత  :

    ప్రశాంతి, కృష్ణ విజయ్

  • సంగీతం  :

    సాయి కార్తీక్, బ్యాగ్రౌండ్:సురేష్ బొబ్బిలి

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    నవీన్ యాదవ్

  • ఎడిటర్  :

    కొటగిరి వెంకటేశ్వర రావు

  • నటినటులు  :

    నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్య హోపే, బ్రహ్మజీ, ప్రభాస్ శ్రీను, రాజీవ్ కనకాల, సత్యరాజ్

Appatlo Okadundevadu Review

విడుదల తేది :

2016-12-30

Cinema Story

కథ...

అప్పట్లో క్రికెట్ లో రాణించి ఎలాగైనా సరే హైదరాబాద్ రంజీ టీంలో చోటు సంపాదించాలని కష్టపడే రైల్వే రాజు (శ్రీ విష్ణు) ఓ కుర్రాడు. అదే సమయంలో నక్సలైట్లను ఏరిపడేసే ఇంతియాజ్(నారా రోహిత్) అనే సిన్సియర్ పోలీసాఫీసర్ ఉండేవాళ్లు. కొన్ని కారణాల వల్ల రాజు అరెస్టయి జైలుకి వెళ్లతాడు. ఆపై బయటికి వచ్చి హంతకుడిగా మారి, క్రికెట్ అనే తన లక్ష్యానికి దూరమౌతాడు.

 

అదే సమయంలో మెల్లిగా రౌడీగా ఎదుగుతున్న రాజుకి-ఇంతియాజ్ కు మెల్లిగా వైరం మొదలై ముదురుతుంది. అది కాస్త వాళ్లిద్దరి మధ్య ఆరని చిచ్చును పెడుతుంది. అసలు రాజు క్రిమినల్ ఎందుకు అవుతాడు? వాళ్ల మధ్య గొడవ ఎందుకు మొదలౌతుంది? రాజుయే ఇంతియాజ్ మెయిన్ టార్గెట్ గా ఎందుకు మారతాడు? రాజు ప్రేమకథకు ఎలాంటి ముగింపు దక్కుతుంది? చివరకు ఏమౌతుంది అన్నదే కథ.

cinima-reviews
అప్పట్లో ఒకడుండేవాడు

టాలీవుడ్ లో నారారోహిత్ ఒక సినిమాకు మరో సినిమాకు అస్సలు సంబంధం ఉండదు. ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన జోనర్లతో ఎంటర్ టైన్ చేయటం అతని ప్రత్యేకత. ఈ యేడాది ఇప్పటికే తుంటరి, సావిత్రి, జ్యో
అచ్యుతానంద, శంకర సినిమాలతో పలకరించి కేవలం జ్యో.. తో మాత్రమే హిట్ అందుకున్నాడు. ఇక ఈ యేడాది చివరగా అప్పట్లో ఒకడుండేవాడును తీసుకొచ్చాడు. అయ్యారే చిత్రంతో మంచి దర్శకుడు అన్న
పేరు సంపాదించుకున్న సాగర్ కే చంద్ర దీనికి దర్శకుడు. 90వ దశకంలో జరిగిన యథార్థ ఘటన ఆధారం తెరకెక్కిన కథ కావటం, పైగా ట్రైలర్ అట్రాక్షన్ గా ఉండటంతో హైప్ బాగా క్రియేట్ అయ్యింది.మరి ఆ
అంచనాలను చిత్రం అందుకుందా? ఇప్పుడు చూద్దాం.


విశ్లేషణ...

ఇప్పుడొచ్చే తెలుగు సినిమాకు ఓ లైన్ గీసుకున్నారు ప్రస్తుత మన దర్శకులు. అయితే వివాదాలు ఉంటాయి, లేదంటే రోటీన్ మసాలాతో దంచేస్తుంటారు. కానీ, అప్పట్లో ఒకడుండేవాడు ఆ అంశాలన్నింటికి చాలా
దూరంగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫర్ ఫెక్ట్ కథ, కథనాలు, డైలాగులు పైగా యూనిక్ కంటెంట్ తో వచ్చిన సినిమా లేదనే అనుకోవాలి. 90వ దశకంలో ఎక్కువగా ఉన్న హైదరాబాదీ పరిస్థితులు ఎలా
ఉండేయో అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లు చూపించాడు. ముఖ్యంగా గ్యాంగ్ స్టర్ ఎపిసోడ్, స్టాంపుల కుంభకోణం, ఆడ నక్సలైట్ హత్య తదితర కాంట్రవర్సీరీ సబ్జెక్ట్ లను చాలా సింపుల్ గా నిజాయితీగా
చూపించాడు దర్శకుడు సాగర్ చంద్ర. ఇవన్నీ దాదాపు మనకు తెలిసిన విషయాలే అయినా లోతుగా స్టడీ చేసి మరీ మనకు చూపించాడని అర్థమౌతోంది. అందుకే ఈ విషయంలో అతనిని ప్రత్యేకంగా
అభినందించాల్సిందే.

టేకింగ్ విషయంలోనూ, స్క్రీన్ ప్లేను అంతే రేసీగా చూపించటంలో దర్శకుడు పూర్తిగా తన సత్తా చూపించాడు. హీరోల కోసం కాదు.. సమాజం నుంచి కథలు పుట్టాలి అన్న మాట ఈ సినిమాకు సరిగ్గా
సూటవుతుందేమో. ఒకానోక దశలో అమానుష సంఘటనలకు డాక్యుమెంటరీగా అనిపించినప్పటికీ, లీడ్ రోల్స్ ఫెర్ ఫార్మెన్స్ తో సినిమా పీక్స్ లోకి వెళ్లిపోయింది. అయితే రెండు గంటల నాలుగు నిమిషాల రన్
టైంలో ఫస్టాఫ్ కథ ఎంత వేగంగా సాగుతుందో, సెకండాఫ్ కాస్త నిదానంగా సాగుతుంది. రాజు రౌడీ షీటర్ గా మారాక కథ వేగంగా సాగటం కాస్త డ్రామాటిక్ గా అనిపించక మానదు. అయినా చివర్లో మళ్లీ కథ పుంజు
కోవటం, అదిరిపోయే క్లైమాక్స్ సినిమాను నిలబెట్టాయి.

ఫెర్ ఫార్మెన్స్ విషయానికొస్తే.. నారా రోహిత్.. శ్రీ విష్ణు... సినిమా మొత్తం వీరి షోనే. అలాగని మిగతా పాత్రలకు ఇందులో ఆస్కారం లేదనుకుంటే పొరపాటే. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ మరో జీవితం నాశనం
కావటానికి ఎలా సాయం చేస్తుందనే పాత్రలో రోహిత్ ఒదిగిపోయాడు. పోలీస్ పాత్ర అంటే పరకాయ ప్రవేశం చేసి సీరియస్ నెస్ చూపే నారావారాబ్బాయి ఈసారి అదరగొట్టాడు. సెటైరిక్ డైలాగ్ డెలివరీ తో, నటనతో
సినిమాను నిలబెట్టాడు. ఇక మరో పిల్లర్ గా సినిమాకు నిలిచాడు. ఇంతకు ముందు ఓ రెండు మూడు చిత్రాల్లో కేవలం సైడ్ క్యారెక్టర్లలో కనిపించిన ఈ యంగ్ నటుడిలో హీరో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని
నిరూపించుకున్నాడు. కొన్ని సీన్లలో రోహిత్ ను డామినేట్ చేశాడు కూడా. ఓవరాల్ గా నారా రోహిత్-శ్రీవిష్ణు ఇద్దరూ పోటీ పడి యాక్ట్ చేశారు. తన్య హోప్ హీరోయిన్ గా బాగానే చేసింది. సత్యరాజ్ పాత్ర చూస్తే నయీం గుర్తు రాకమానడు. రాజీవ్ కనకాల పాత్ర గుర్తుండిపోతుంది. మిగతా వారంతా తమ పాత్రలో ఒదిగిపోయారు.

టెక్నికల్ అంశాలపరంగా.. మ్యూజిక్ విషయానికొస్తే సాయి కార్తీక్ ఎప్పటిలాగే తనకు అలవాటైన సంగీతంతో ఆకట్టుకున్నాడు. మధ్యలో ఒకటి రెండు పాటలు అవాతంరం అనిపించానా.. కథ ముందు అవి పెద్దగా
పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నవీన్ యాదవ్ అందించిన కెమెరా వర్క్ ఇంప్రెసివ్ గా ఉంది. అయితే ఆ క్వాలిటీ మూలానో ఏమో 90 పరిస్థితులకు తగ్గట్లుగా కాకుండా ఇప్పట్లో ఉన్నట్లు కొన్ని చోట్ల
అనిపిస్తుంది. బహుశా కాస్టూమ్స్ విషయంలో కూడా దొర్లిన తప్పు అందుకు కారణం కావొచ్చు.

ఇక సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది సురేష్ బొబ్బిలి బ్యాగ్రౌండ్ స్కోర్. పతాక సన్నివేశాల్లో అది హైలెట్ గా నిలిచిందనటంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్
సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. నిడివి కూడా తక్కువగా ఉండటం బాగా కలిసొచ్చింది. డైలాగులు కూడా సింపుల్ అండ్ స్వీట్ గా పేలాయి. మొత్తానికి అన్ని డిపార్ట్ మెంట్లను దర్శకుడు సాగర్ సరిగ్గా హ్యండిల్
చేయగలిగాడు. అయితే ఎటొచ్చి నిర్మాణ విలువలే సినిమా స్థాయికి తగ్గట్లు లేవేమో అనిపించకమానదు.


ఫ్లస్ పాయింట్లు:
రోహిత్, శ్రీ విష్ణు నటన,
స్టోరీ, అందులోని ఎలిమెంట్స్
స్క్రీన్ ప్లే,
సినిమా రన్ టైం

 


మైనస్ పాయింట్లు:
సెకండాఫ్ లో కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్లు
పాటలు

తీర్పు:
ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. ప్రతీ సీన్ లోనూ అతని కష్టం కనిపిస్తుంది. ఫెర్ పార్మెన్స్ బేస్ట్ సినిమా. ముందుగా చెప్పుకున్నట్లు ఇది సోసైటీకి సంబంధించింది. జీవితాల నుంచే పుట్టుకొచ్చిన కథ. పోలీసులు,
నక్సలైట్లు, మత వాదాలు, ఉద్రిక్తతలు, నడుమ పుట్టుకొచ్చిన నయీంలు, రాజ్యహింస ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి. అక్కడక్కడ వర్మ సినిమా ఛాయలు కనిపించినా... కథ అనే బలం దానిని తొక్కి పడేసింది.
తొంభైల్లో పరిస్దితులను, మనకు తెలియని వాటి వెనక దారుణమైన నిజాలు ఇందులో కనిపిస్తాయి. ఇలాంటి వాస్తవ ఘటనల ఆధారంగా వచ్చే చిత్రాలను మెచ్చేవారికి ఈ చిత్రం ఓ పెద్ద ట్రీట్ అనే అనుకోవాలి.
రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోణం పక్కనపెడితే ఇది ఖచ్ఛితంగా అందరికీ నచ్చి తీరుతుందనే నమ్మకం.

చివరగా... అప్పట్లో ఒకడుండేవాడు.. రియలిస్టిక్, బోల్డ్  అండ్ డేరింగ్ అటెంప్ట్.

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.