సప్తగిరి ఎక్స్ ప్రెస్ రివ్యూ | Sapthagiri Express Movie Review

Teluguwishesh సప్తగిరి ఎక్స్ ప్రెస్ సప్తగిరి ఎక్స్ ప్రెస్ Sapthagiri Express Telugu Movie Review. Product #: 79828 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సప్తగిరి ఎక్స్ ప్రెస్

  • బ్యానర్  :

    సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్

  • దర్శకుడు  :

    అరుణ్ పవార్

  • నిర్మాత  :

    రవి కిరణ్

  • సంగీతం  :

    బుల్గానిన్

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • ఛాయాగ్రహణం  :

    సి. రాంప్రసాద్

  • ఎడిటర్  :

    గౌతం రాజు

  • నటినటులు  :

    సప్తగిరి, రోషిణి ప్రకాష్‌, అలీ, పోసాని తదితరులు

Sapthagiri Express Movie Review

విడుదల తేది :

2016-12-23

Cinema Story

కథః
సప్తగిరి (సప్తగిరి) సినిమాలోకి వెళ్లాలని... పెద్ద నటుడవ్వాలని కలలగంటూ ఉంటాడు. సప్తగిరి తండ్రి ఓ కానిస్టేబుల్(శివప్రసాద్). కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నది అతని కల. అయితే తండ్రి మాటలు వినకుండా సినిమా ప్రపంచం చుట్టూ తిరుగుతుంటాడు. అలాంటి సయంలో తండ్రి ఓ ఎన్ కౌంటర్ లో చనిపోవటంతో సప్తగిరి తన సినిమా లక్ష్యాన్ని పక్కనబెట్టి పోలీస్ జాబ్ లో చేరుతాడు. అలా పోలీస్ అయిన సప్తగిరి ఆ ఉద్యోగంలో కూడా నానా కష్టాలు పడుతుంటాడు. ఇంతలో తన తండ్రిని మాములు చావు కాదని, దాని వెనుక కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని తెలుస్తుంది. దానికి కారణం ఎవరో తెలుసుకుని సప్తగిరి వాళ్లను అంతం చేయటమే టోటల్ గా సప్తగిరి ఎక్స్ ప్రెస్ కథ. 

cinima-reviews
సప్తగిరి ఎక్స్ ప్రెస్

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఓ గుర్తింపు వచ్చాక హీరోలుగా మారి తమ అదృష్టాన్ని పరిక్షించుకోవటం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్న ట్రెండ్. ప్రస్తుతం కమెడియన్ గా కడుపుబ్బా నవ్విస్తున్న సప్తగిరి ఇప్పుడు హీరోగానూ అలరించేందుకు సిద్ధమయ్యాడు. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పవార్ దర్శకత్వం వహించాడు. డాక్టర్ రవికిరణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ క్రేజ్ మూలంగా బాగానే హైప్ వచ్చింది. మరి ఈ నవ్వుల రాజు ఎక్స్ ప్రెస్ ఏ మేర ఆకట్టుకుందో చూద్దాం. 

విశ్లేషణః

తిరుడన్ పోలీస్ తమిళ్ లో హిట్ అయిన ఓ రివెంజ్ డ్రామా. దానికి కామెడీ అద్దులు అద్ది దర్శకుడు అరుణ్ పవార్ సప్తగిరి ఎక్స్ ప్రెస్ ను పట్టాలెక్కించాడు. ఇది ఓ కామెడీ రివెంజ్ డ్రామా. అలాగని ఇందులో కామెడీ ఎక్కువగా ఉండదు. పోనీ రివెంజ్ డ్రామా అనుకుంటే దానికి న్యాయం జరగలేదు. రెండింటి కలగూర గంపలా అనిపించకమానదు. అక్కా.. అక్కా... అంటూ ఓ టైప్ ఆఫ్ నెల్లూర్ స్లాంగ్ తో కామెడీ చేసే సప్తగిరి ఎగిరేగిరి ఫైట్స్ చేస్తుంటే కాస్త కామెడీగా అనిపించకమానదు.

సెంటిమెంట్; కామెడీ, యాక్షన్ ఇలా కావాల్సినన్నీ కమర్షియల్ హంగులు అద్దినప్పటికీ ఎందుకో డైరక్టర్ తడబడ్డాడు. కానీ, సెకంఢాఫ్ లో కాసేపు మాత్రం సినిమా ఆకర్షణగా అనిపిస్తుంది. ఆపై అసలు విషయం రివీల్ అయ్యాక మళ్లీ సినిమా గాడి తప్పి మరో రకమైన ఫీలింగ్ కలగజేస్తుంది. కొన్ని చోట్ల లాజిక్ అస్సలు సహించలేనంతగా ఉంటుంది. అయితే సప్తగిరి నుంచి ఎక్స్ పెక్ట్ చేసే కామెడీకి మాత్రం ఎక్కడా లోటు లేదు. ఓవరాల్ గా ఇలా అప్ అండ్ డౌన్స్ తో సప్తగిరి ఎక్స్ ప్రెస్ నిరాశపరచకమానదు.

నటీనటుల విషయానికొస్తే.. తనలో ఉన్న వేరే టాలెంట్లను కూడా చూపించడానికి హీరో అవతారం ఎత్తానని ప్రకటించిన సప్తగిరి అన్నట్లుగానే ఇందులో తన అన్ని యాంగిల్స్ ను చూపించాడు. పరుశరాముడి గెటప్, ఎన్టీఆర్ దానవీర శూర్ణ డైలాగులు చెప్పే టైంలో తడబాటు లేకుండా బాగా చేశాడు. అక్కడక్కడా ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకున్నప్పటికీ, మోతాదుకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్ గిరికి సూట్ కాలేకపోయాయి. సింహం అంటూ స్టార్ హీరోలకే సెటైర్ వేసే యత్నం చేశాడు.
ఇక మిగతా వాళ్లలో హీరోయిన్ గురించి చెప్పుకోడానికి ఏం లేదు. ఏదో ఉందంటే ఉంది. గ్లామర్ పరంగానే కాదు.. యాక్టింగ్ పరంగా కూడా మైనస్ గా మారింది. ఉన్నంతలో షకలక శంకర్ చేసిన కామెడీ బాగా నవ్విస్తుంది. మిగతా వాళ్లు జస్ట్ ఫర్వాలేదు.


టెక్నికల్ విషయాలకొస్తే... బుల్గానిన్ సంగీతం ఆడియోలో ఫర్వాలేదనిపించనా.. విజువల్ గా మాత్రం అస్సలు ఎక్కలేదు. రెండు మూడు మాస్ పాటలు పర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం పరమ రొటీన్. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం డల్ గా ఉంది. మాటలు కొన్ని పర్వాలేదు. తమిళ ఒరిజినల్ ఎలా ఉందో.. తెలుగు వెర్షన్ కోసం ఎలాంటి మార్పులు చేశారో కానీ.. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ కథాకథనాల్లో అయితే విశేషాలేమీ లేవు. దర్శకుడు అరుణ్ పవార్ మాత్రం దారుణంగా నిరాశపరిచాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి బాగానే ఉన్నట్లే. సప్తగిరి అని చూడకుండా బాగానే ఖర్చు పెట్టారు. సప్తగిరే హీరోగా తన తొలి సినిమాకు స్క్రీన్ ప్లే కూడా అందించాడు.

ఫ్లస్ పాయింట్లు
సప్తగిరి ఫెర్ ఫార్మెన్స్
కొన్ని కామెడీ సీన్లు

 

మైనస్ పాయింట్లు
స్క్రీన్ ప్లే
సాగదీత

 

తీర్పు:

అసలు కథను చెప్పడంలో మొత్తం గందరగోళం కనిపించింది. ఫలానా జోనర్ అని చెప్పలేని పరిస్థితి సప్తగిరి ఎక్స్ ప్రెస్. సప్తగిరి అంటే మెయిన్ కామెడీనే కోరుకుంటాం. కానీ, ఇక్కడ మాత్రం ఎక్స్ ట్రాగా మిగతా హంగులు, వాటికి తోడు కథలో కూడా పసలేకపోవటం, దానిని డల్ గా తెరకెక్కించటం ఇలా ఈ చిత్రానికి సాగతీత వల్ల లెంగ్త్ ఎక్కువన్న ఫీలింగ్ ఇస్తుంది. .. సప్తగిరి కోసం అయితే ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ఓకే. మాస్ ప్రేక్షకుల్ని మాత్రం మెప్పించొచ్చు.

చివరగా... సప్తగిరి ఎక్స్ ప్రెస్ అక్కడక్కడా కొన్ని నవ్వుల కోసం మాత్రమే...

 

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.