కాష్మోరా రివ్యూ: కామెడీ హర్రర్ కానీ, టోటల్ డిఫరెంట్ | kashmora telugu movie review

Teluguwishesh కాష్మోరా కాష్మోరా Karthi's kashmora telugu movie review. Product #: 78559 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    కాష్మోరా

  • బ్యానర్  :

    పీవీపీ సినిమా

  • దర్శకుడు  :

    గోకుల్

  • నిర్మాత  :

    పొట్లూరి వరప్రసాద్

  • సంగీతం  :

    సంతోష్ నారాయణన్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    ఓం ప్రకాష్

  • ఎడిటర్  :

    వీ జే శాబు జోసెఫ్

  • నటినటులు  :

    కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్ తదితరులు

Kashmora Telugu Movie Review

విడుదల తేది :

2016-10-28

Cinema Story

కథ:

కాష్మోరా (కార్తీ) దెయ్యాల పేరుతో డబ్బులు వెనకేసుకునే ఓ మాయగాడు. ఇంట్లో తల్లి, చెల్లి కూడా కాష్మోరాను ఓ మోడ్రన్ భూత వైద్యుడిగానే చూస్తుంటారు. ఓ బడా పొలిటీషియన్ ను బోల్తా కొట్టించి ఆ డబ్బుతో విదేశాలకు చెక్కేద్దామని ఫ్లాన్ వేస్తాడు. అలా పారిపోతున్న క్రమంలో ఓ పెద్ద భవనంలో అతను ఇరుక్కుపోవాల్సి వస్తుంది. 

 

యువరాణి రత్నమహాదేవి శాపంతో అక్కడే ప్రేతాత్మగా తిరుగుతున్న విక్రాంత రాజ్య సైన్యాధ్యక్షుడు రాజ్ నాయక్ (కార్తీ) సీన్లోకి ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి కాష్మోరాను ఆ దెయ్యం ఓ ఆట ఆడుకుంటుంది. అసలా దెయ్యం కథ ఏంటీ? శాపం ఎవరిచ్చారు? కాష్మోరా అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడు? యువరాణి రత్నమహాదేవికి ఏమైంది? అన్నదే కథ. 

cinima-reviews
కాష్మోరా

కోలీవుడ్ తోపాటు ఊపిరి తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు నటుడు కార్తీ. ఈ మధ్య కాలంలో కార్తీ నటించిన తమిళ్ డబ్ సినిమాలేవీ తెలుగులోకి రిలీజ్ కాలేదు. అయితే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన కాష్మోరాను మాత్రం ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. తమిళ్ లో 350 స్క్రీన్లలో అయితే, తెలుగులో ఏకంగా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మరి ఈ హర్రర్ థ్రిల్లర్ తో కార్తీ ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడో చూద్దాం. 

విశ్లేషణ:

నార్త్ సౌత్ తేడా లేకుండా హర్రర్ చిత్రాలకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఇప్పుడు ఏర్పడింది. పైగా కాష్మోరా పేరుతో, ఓ భారీ బడ్జెట్ తీయటం, కార్తీ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో అందులో విచిత్రమైన గెటప్ లో కనిపించటంతో చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కానీ, అంతా ఊహించినట్లు ఇది హర్రర్ థ్రిల్లర్ అస్సలు కానే కాదు. టోటల్ గా కామెడీ జోనర్ చిత్రం. ఓ పిరియాడికల్ పాయింట్ తో కథ అల్లి, దానికి దెయ్యం స్టోరీని జతచేసి, ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లు కంప్లీట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడు దర్శకుడు గోకుల్. ఈ విషయంలో అతడు చేసిన రిస్క్ ను అభినందించవచ్చు. అయితే రిలీజ్ కు ముందే ఎడిటింగ్ చేశామని చెప్పుకున్న యూనిట్, ఫస్టాఫ్ లెంగ్త్ కూడా మరీ ఎక్కువ అయ్యింది. ఈ విషయంలో మరో పది నిమిషాలు కోత పెట్టినా ఫర్వాలేదనిపించకమానదు.

ఇక ఇలాంటి హర్రర్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రానికి పాటలు బాగా కుదరకపోయినా, కనీసం బ్యాగ్రౌండ్ స్కోర్ అయినా ఆకట్టుకునేలా ఉండాలి. కానీ, అది ఇక్కడ జరగలేదు. ఆ రెండింటిని పక్కన బెడితే కాష్మోరా టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్ అనే చెప్పుకోవాలి. కోలీవుడ్ లో, తెలుగులో వచ్చే రెగ్యులర్ హర్రర్ కామెడీ చిత్రాల్లాగా కాకుండా, కాష్మోరా ఓ ప్రత్యేక చిత్రంగా చెప్పుకోవచ్చు. కామెడీనే బేస్ చేసుకుని, అరుంధతి టైప్ ఆఫ్ సెట్, విజువల్ ఎఫెక్ట్ తో చేసిన ఈ భారీ ప్రయోగం చాలా వరకు సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవాలి.

నటీనటుల విషయానికొస్తే... కార్తీ రెండు రోల్స్ లో చింపేశాడు. ముఖ్యంగా రాజ్ నాయక్ పాత్ర కార్తీ కెరీర్ లో గుర్తుండిపోతుంది. ఎప్పటిలాగే చలాకీగా, కామెడీతో కాష్మోరాగా అలరిస్తూనే, క్రూరమైన విలన్ గా రాజ నాయక్ ప్రత్యేకంగా నిలిచింది. ఆ పాత్ర కోసం చేసిన మేక్ ఓవర్ దగ్గరి నుంచి, అమ్మాయిల పిచ్చి ఉన్న బాడీ లాంగ్వేజ్, చనిపోయే సమయంలో చేసిన యాక్టింగ్ అస్సలు ఊహించలేం. అయినా అది బాగా ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా కొత్త కార్తీని చూపించాడు. 

అందం, పరాక్రమం కలగలిసిన యువరాణి పాత్రలో నయనతార పాత్ర కాసేపయిన ఉన్నంతలో బాగా చేసింది. ఆమె రోల్ ఇంకాసేపు ఉంటే బావుండనిపించింది. శ్రీదివ్య, కార్తీ తండ్రిగా వివేక్ లు న్యాయం చేశారు.

టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే... సంతోష్ నారాయణన్ మ్యూజిక్ పరంగా ఆకట్టుకోలేకపోయాడు. నేపథ్య సంగీతం కూడా సో సోగానే ఉంది. శాబు ఎడిటింగ్ ఇంకాస్త చేయాల్సి ఉంది. సినిమా కోసం వేసి సెట్స్, కార్తీ మేకప్ సూపర్బ్ గా ఉన్నాయి. గ్రాఫిక్స్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫ్లస్ పాయింట్లు:
కార్తీ నటన,
కామెడీ,
విజువల్ ఎఫెక్ట్స్
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్

 

మైనస్ పాయింట్లు:
మ్యూజిక్
ఎడిటింగ్

తీర్పు:
పాడుబడ్డ బంగ్లాలో ప్రేతాత్మ కాన్సెప్ట్ అరుంధతిని గుర్తుతెచ్చినప్పటికీ, టోటల్ గా కామెడీని నమ్ముకుని గోకుల్ సినిమాను తీశాడు. భారీ హంగులతో తెరకెక్కించిన ఈ కాష్మోరా భయం కన్నా ఎక్కువ నవ్విస్తుంది. టైంపాస్ కోసం లుక్కేయొచ్చు.

చివరగా... హర్రర్ కామెడీ మూవీయే కానీ, రోటీన్ మాత్రం కాదు.

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.