ఇజం మూవీ రివ్యూ | ISM telugu movie review

Teluguwishesh ఇజం ఇజం Kalyanram's ISM movie review. Product #: 78389 2.5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ఇజం

 • బ్యానర్  :

  నందమూరి తారక రామారావు ఆర్ట్స్

 • దర్శకుడు  :

  పూరీ జగన్నాథ్

 • నిర్మాత  :

  నందమూరి కళ్యాణ్ రామ్

 • సంగీతం  :

  అనూప్ రూబెన్స్

 • సినిమా రేటింగ్  :

  2.52.5  2.5

 • ఛాయాగ్రహణం  :

  ముకేశ్

 • ఎడిటర్  :

  జునైద్ సిద్ధిఖీ

 • నటినటులు  :

  కళ్యాణ్ రామ్, అతిథి ఆర్య, జగపతి బాబు, గొల్లపూడి మారుతీరావు, పోసాని, జయప్రకాశ్ రెడ్డి తదితరులు

Ism Telugu Movie Review

విడుదల తేది :

2016-10-21

Cinema Story

కథ:
సుల్తాన్(కళ్యాణ్ రామ్) అనే ఓ స్ట్రీట్ ఫైటర్ జల్సాగా జీవితం గడుపుతంటాడు. తన శత్రువులను ఏరీపారేసేందుకు స్పెయిన్ లో పెద్ద డాన్ అయిన జావెద్ బాయ్ సుల్తాన్ ను కుడిభుజంగా ఉంచుకుంటాడు. అదే టైంలో అతనికి ప్రాణమైన కూతురు అలియా(అధితి ఆర్య)తో ప్రేమాయణం సాగిస్తాడు. ఇంతలో సుల్తాన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అతని అసలు పేరు సత్య మార్తాండ్ అని, అతను ఓ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అని.

 

కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తుంటాడు సత్య. ఈ క్రమంలో అతని కుటుంబాన్ని కోల్పోతాడు. అంతే అక్కడి నుంచి ప్రశ్నించడం మానేసి, చెడుపై పోరాటం సాగిస్తుంటాడు. ఆ క్రమంలోనే సుల్తాన్, ముసుగు వీరుడిలా మారి వేల కోట్లకు సంబంధించిన స్కాంలు, బడాబాబుల అవినీతి బయటపెడుతుంటాడు. చివరికి అతని ఆశయం పూర్తిగా నెరవేరుతుందా? ప్రేమించిన అమ్మాయి దక్కుతుందా? జావెద్ బాయ్ ఏమౌతాడు? అన్నదే కథ.

cinima-reviews
ఇజం

ఇండస్ట్రీకి వచ్చాక రెండవ చిత్రంతో హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత పటాస్ తో సక్సెస్ రుచి చూశాడు. గతేడాది వచ్చిన షేర్ ఫ్లాప్ అనుభవాన్నే ఇచ్చింది. ఈ క్రమంలో పూరితో సినిమా అనౌన్స్ చేయగానే క్రేజీ కాంబోపై ఇంటస్ట్ర్ కలిగింది. కళ్యాణ్ రామ్ స్టైలిష్ గెటప్, ట్రైలర్ చూశాక ఇజంపై అంచనాలు పెరిగిపోయాయి. మరి వాటిని అందుకునేలా పూరీ తెరకెక్కించాడా ఇప్పుడు చూద్దాం.

విశ్లేషణ:

టెంపర్ తర్వాత రెండు ఫ్లాపులు, మెగాస్టార్ తో సినిమా మిస్ అయి ఢీలా పడిపోయిన పూరి మంచి కథనే ఎంచుకున్నాడు. రెగ్యులర్ రివెంజ్ డ్రామానే అయినప్పటికీ, దానికి సోషల్ మెసేజ్ ఓరియంటల్ టచ్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. అందుకు కళ్యాణ్ రామ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోను ఎంచుకుని పూర్తిగా మార్చేసి మంచి లుక్ తో ముందుకు వచ్చాడు. కానీ, కాన్సెప్ట్ ఎంత మంచిదైనా దానిని చూపించటంలో మాత్రం పూరీ తడబడ్డాడనే చెప్పుకోవచ్చు. అవినీతి, బ్లాక్ మనీ లాంటి కరెంట్ అఫైర్స్ టాపిక్ తీసుకున్నప్పటికీ నేరేషన్ పరంగా మాత్రం విఫలం అయ్యాడు. ఫస్టాఫ్ లో కొంచెం కామెడీ, ప్రేమ కథతో తన రెగ్యులర్ సినిమాలను తలపించినప్పటికీ, అవి ఎంటర్ టైనింగ్ గా ఉండటంతో జనాలు కాస్త కనెక్ట్ అవుతారు.

ఇక సెకండాఫ్ స్లోగా నడవటం, క్లైమాక్స్ ను హర్రీ బర్రీగా ముగించేయటం పెద్ద మైనస్. ఫ్రీ క్లైమాక్స్ కోర్టు సీన్, అందులో డైలాగులు మాత్రం అద్భుంగా పండాయి. మొదట్లో జగపతి బాబును పెద్ద తోపులా చూపించి, తర్వాత మెల్లిగా ఆ క్యారెక్టర్ ను తేల్చేయటం కూడా పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. హీరో నల్ల ధనాన్ని ఇండియాకు తిరిగి తెప్పించడానికి, దోపిడీదారులను బయటకు లాగడానికి చేసిన ప్రయత్నాన్ని చాలా డ్రమాటిక్ గా చూపించాడు. సీరియస్ గా సాగుతున్న కథలో మధ్య మధ్యలో పాటలు అవాంతరంగా మారాయి. జర్నలిస్ట్ల కష్టాలు, విలువలు తెలిపేలా పూరి రాసిన డైలాగ్స్ బాగున్నాయి.

ఇక నటీనటుల విషయానికొస్తే... కళ్యాణ్ రామ్ సినిమా కోసం పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. బాడీ, బాడీ లాంగ్వేజ్ టోటల్ గా మారిపోయాయి. పూరీ మార్క్ డైలాగులను చాలా ఈజ్ తో చెప్పేశాడు. కోర్టు సీన్ లో కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ ఎమోషన్ ను బాగా పండించాయి. హీరోయిన్ అధితి ఆర్య చేసింది ఏం లేదు. కేవలం పాటలు, గ్లామర్ షోకి మాత్రమే పరిమితమైంది. ఆమెతో కాస్త యాక్టింగ్ చేయించి ఉంటే బావుండేది. ఇక జగపతి బాబు ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బావుండేది. ఫస్టాఫ్ లో జగపతి బాబుకి, కళ్యాణ్ రామ్ కి మధ్య బీడీ స్నేహం, హీరోయిన్ అధితి ఆర్యకు, కళ్యాణ్ రామ్ కు మధ్య లవ్ సీన్స్ కొన్ని బాగున్నాయి. మినిస్టర్ గా పోసాని పాత్ర తప్ప మిగతా క్యారెక్టర్లు అంతగా ఆకట్టుకోవు.

టెక్నికల్ పరంగా... అనూప్ రూబెన్స్ పాటలతో మ్యాజిక్ చేయలేకపోయాడు. వినడానికి బాగానే ఉన్న తెర మీద అంతగా ఆకట్టుకోలేదు. కానీ, బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చాడు. లోకేష్లను మాత్రం బ్యూటిఫుల్ గా చూపించాడు సినిమాటోగ్రఫర్ ముకేష్. జునైద్ ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హీరోగానే కాక నిర్మాతగానూ సినిమాకు వందశాతం న్యాయం చేశాడు కళ్యాణ్ రామ్. ఎక్కడ కాంప్రమైజ్ కాకుంగా సినిమాను రిచ్ గా నిర్మించాడు.

ఫ్లస్ పాయింట్లు:
కళ్యాణ్ రామ్ నటన,
మెసేజ్ ఓరియంటల్ కథ, డైలాగులు,
ప్రీ అండ్ క్లైమాక్స్

 

మైనస్ పాయింట్లు:
స్క్రీన్ ప్లే,
పాటలు,
స్లో సెకండాఫ్

తీర్పు:
అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఎంచుకున్న పూరీ, దానిని తెరకెక్కించటంలో జస్ట్ పాస్ మార్కులే వేయించుకున్నాడు. ఫస్టాఫ్ తన రెగ్యులర్ ఫ్లేవర్ తో గట్టెక్కించి, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయేలా ఇచ్చినప్పటికీ, సెకండాఫ్, పాటల విషయంలో మాత్రం బాగా తడబడ్డాడు. దానిని కూడా బాగా డీల్ చేసి ఉంటే ఇజం ఔట్ పుట్ ఇంకాస్త బెటర్ గా వచ్చి ఉండేదేమో!

చివరగా... ఇజం సగం పూరీ మార్క్... సగం కళ్యాణ్ రామ్ కష్టం. ఓవరాల్ గా ఓకే. 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.