రైల్ రివ్యూ | Dhanush Rail Movie Review

Teluguwishesh రైల్ రైల్ Dhanush's Rail Movie Review. Product #: 77833 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రైల్

  • బ్యానర్  :

    ఆదిత్య మూవీ కార్పొరేషన్

  • దర్శకుడు  :

    ప్రభు సాల్మన్

  • నిర్మాత  :

    ఆది రెడ్డి, ఆదిత్య రెడ్డి

  • సంగీతం  :

    ఇమాన్

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • ఛాయాగ్రహణం  :

    వెట్రివేల్ మహేంద్రన్

  • ఎడిటర్  :

    ఎల్వికే దాస్

  • నటినటులు  :

    ధనుష్, కీర్తి సురేష్, హరీష్ రావత్, తంబి రామయ్య, కరుణాకరన్ తదితరులు

Dhanush Rail Movie Review

విడుదల తేది :

2016-09-22

Cinema Story

హీరో (ధనుష్) రైల్లో పాంట్రీ వర్కర్ గా పని చేస్తుంటాడు. ఢిల్లీకి వెళ్లే ఓ ట్రయిన్ లో ప్యాసింజర్స్ కి ఫుడ్ సప్లై చేస్తూ ఆడుతూ పాడుతూ జీవిస్తుంటాడు. అంతలో సరోజా(కీర్తిసురేష్) ఆ ట్రైన్ లోకే కాదు... అతని జీవితంలోకి కూడా ప్రవేశిస్తుంది. వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఇంతలో వారిపై అటాక్ జరుగుతుంది. అదే రైల్లో ప్రయాణిస్తున్న ఓ సెంట్రల్ మినిస్టర్ (రాధారవి) ని టార్గెట్ చేస్తూ కొందరు హైజాక్ చేస్తారు. ఆ టెర్రరిస్టుల్లో సరోజా కూడా ఉంటుంది. వెంటనే రంగంలోకి దిగిన కమాండోలు ఆపరేషన్ నిర్వహిస్తారు. హీరో కూడా తన వంతుగా ప్యాసింజర్లను కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంతకీ సరోజకి, టెర్రరిస్టులకు ఉన్న సంబంధం ఏంటీ? చివరకు హీరో ప్రేమ ఏమైపోతుంది? అన్నదే కథ...

cinima-reviews
రైల్

అంతకు ముందు రజనీకాంత్ అల్లుడు అంటూ ఎన్ని డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసినా ధనుష్ సినిమాలు తెలుగులో అంతగా ఆడలేదు. అయితే ఫీల్ గుడ్ మూవీ రఘువరన్ బీటెక్ తో తెలుగులో మార్కెట్ ను క్రియేట్ చేసుకోవటంతోపాటు, క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు ధనుష్. ఆపై అనేకుడు, నవమన్మథుడు చిత్రాలతో పలకరించాడు. ఇక ఇప్పుడు రైల్ చిత్రాన్ని తెలుగు, తమిళ్(తొడరి) ఒకే రోజున రిలీజ్ చేసేశాడు. గజరాజు, మైనా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి మార్కులు వేయించుకున్న ప్రభుసాల్మన్ దర్శకుడు. నేను శైలజ ఫేం కీర్తి సురేష్ హీరోయిన్. దీంతో సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ రోజే రిలీజైన చిత్రం ఎలాంటి ఫలితం అందించిందో చూద్దాం.

విశ్లేషణ:
రైల్లో ప్రేమకహానీ, దానికి హైజాక్ డ్రామా జోడించి దర్శకుడు ప్రభు సాల్మన్ చెప్పాలనుకున్న ప్రయత్నం అంతగా వర్కవుట్ కాలేదు. ఓ వైపు లవ్ స్టోరీ, మరోవైపు టెర్రరిస్ట్ లు అంటూ సాగే కథనం మొత్తం సినిమా అంతా గందరగోళంగా తయారయ్యింది. స్క్రీన్ ప్లే కూడా అంతగా రుచించదు. స్టోరీ కూడా పాతదానిలాగే అనిపిస్తుంది. గత చిత్రాల్లో ఎమోషన్ క్యారీ చేసిన ప్రభు ఈ చిత్రంలో ఆ ట్రాక్ ను మిస్ చేశాడు.

ఇక కాస్టింగ్ పరంగా ఈ సినిమాకు మెయిన్ హైలైట్ ధనుష్ అనే చెప్పుకోవాలి.. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే ధనుష్ ఒక పాంట్రీ వర్కర్ గా మంచి మంచి నటనను కనపరిచాడు. ఈ సినిమాలో ధనుష్ కాకుండా వేరే హీరోను తీసుకుని ఉంటే ఫలితం మరింత దారుణంగా ఉండేది ఏమో. ఇక హీరోయిన్ కీర్తి సురేష్ డే గ్లామరస్ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది... నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రలో నటించింది కూడా. ఇక ధనుష్ ఫ్రెండ్స్ గా కరుణాకరన్, తంబీ రామయ్య లు కామెడీ చేసే ప్రయత్నం చేసిన అది పేలలేదు. సెంట్రల్ మినిస్టర్ గా సీనియర్ నటుడు రాధారవి హుందా పాత్రలో నటించాడు.

సాంకేతిక అంశాల పరంగా... సాధారణంగా ప్రభు సాల్మన్ చిత్రాలకు మంచి స్వరాలు అందించే ఇమాన్ ఈసారి శృతి తప్పాడు. అయితే మ్యూజిక్ తో ఆకట్టుకోలేకపోయినప్పటికీ, హాలీవుడ్ తరహాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అందించాడు. ఇక మెయిన్ గా వెట్రివేల్ మహేంద్రన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలెట్ గా చెప్పుకోవచ్చు.. ఎల్వికే దాస్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి..

ఫ్లస్ పాయింట్లు
ధనుష్
సినిమాటోగ్రఫీ

 

మైనస్ పాయింట్లు:

స్టోరీ
స్క్రీన్ ప్లే
కామెడీ
లాజికల్ లేని సీన్లు

పేలవమైన గ్రాఫిక్స్ 

తీర్పు: 

విభిన్న చిత్రాలను ఎంచుకునే ప్రభు సాల్మన్ ఈసారి రాంగ్ చాయిస్ ఎంచుకున్నాడు అనిపిస్తుంది. లాజిక్ లేని సన్నివేశాలు, సొల్లు కామెడీ, అస్సలు బాగోని గ్రాఫిక్స్ సన్నివేశాలతో సినిమాలో ఉన్న ఫీల్ ను చెడగొట్టాడు. అవి కాకుండా కేవలం తనశైలి ప్రేమ కథ, హైజాక్ డ్రామాను నడిపి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో.

చివరగా... రైల్ హాలీవుడ్ ఆన్ స్టాపబుల్ సినిమాకి కాస్త మార్పులతో సౌత్ ఇండియన్ వర్షన్...

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.