Thanu Nenu Movie Review | Avika Gor Thanu Nenu Review | Thanu Nenu Movie Review And Rating | Avika Gor | Santhosh Shobhan

Teluguwishesh తను నేను తను నేను Get information about Thanu Nenu Movie Telugu Review, Thanu Nenu Movie Review, Avika Gor Thanu Nenu Movie Review, Thanu Nenu Movie Review And Rating, Thanu Nenu Telugu Movie Talk, Thanu Nenu Movie Trailer, Avika Gor Thanu Nenu Review, Thanu Nenu Movie Gallery and more only on Teluguwishesh.com Product #: 70565 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  తను నేను

 • బ్యానర్  :

  సన్‌షైన్‌ సినిమాస్‌ ప్రై. లిమిటెడ్‌, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ లిమిటెడ్

 • దర్శకుడు  :

  రామ్మోహన్‌. పి

 • నిర్మాత  :

  రామ్మోహన్‌. పి

 • సంగీతం  :

  సన్నీ ఎం.ఆర్

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  సురేష్‌ సారంగం

 • ఎడిటర్  :

  మార్తాండ్‌ కె.వెంకటేష్

 • నటినటులు  :

  అవికా గోర్‌, సంతోష్‌ శోభన్‌, అల్లరి రవిబాబు, సత్యకృష్ణ తదితరులు

Thanu Nenu Movie Review

విడుదల తేది :

2015-11-27

Cinema Story

ఫ్రెండ్స్ తో హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ, ఓ కాల్ సెంటర్ లో పనిచేసే కుర్రాడు కిరణ్(సంతోష్ శోభన్). కిరణ్ బెస్ట్ ఫ్రెండ్ నరేష్(అభిషేక్). ఓరోజు బర్త్ డే పార్టీలో నరేష్ ఫ్రెండ్ కీర్తి(అవికా గోర్)ని చూసి ప్రేమలో పడతాడు కిరణ్. కానీ కీర్తి వుండేది బెంగుళూర్ లో కాబట్టి.. కిరణ్ తన ప్రేమను చెప్పేలోపే కీర్తి బెంగుళూర్ వెళ్లిపోతుంది. కొద్దిరోజుల తర్వాత కీర్తి ఫ్యామిలీ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత నరేష్, కిరణ్, కీర్తి, శ్రీకాంత్ కలిసి టూర్ ప్లాన్ చేస్తారు. ఈ టూర్ సమయంలో కిరణ్-కీర్తిలు ఒకరినొకరు ప్రేమించుకుంటారు.

సీన్ కట్ చేస్తే... కీర్తి తండ్రి బండిరెడ్డి సర్వేశ్వరరావు(రవిబాబు). తన కూతురు ఎలాగైనా అమెరికా వెళ్లి, జాబ్ చేయాలని చిన్నప్పటి నుంచే కీర్తికి బ్రెయిన్ వాష్ చేసి వుంటాడు. కానీ కిరణ్ కు అమెరికా అంటేనే నచ్చదు. ఈ విషయం తెలిసాక ఇరువరి మధ్య పలు సమస్యలు వస్తాయి. అలాగే కీర్తి-కిరణ్ ల ప్రేమ చెడగొట్టేందుకు బండిరెడ్డి తెగ ప్రయత్నాలు చేస్తుంటాడు. చివరకు ఏం జరిగింది? అసలు కిరణ్ కు అమెరికా అంటే ఎందుకు నచ్చదు? బండిరెడ్డి సర్వేశ్వరరావుకు అమెరికా అంటే అంత పిచ్చి ఎందుకు? కిరణ్-కీర్తిల మధ్య వచ్చిన సమస్యలేంటి? వీరి ప్రేమను విడగొట్టేందుకు బండిరెడ్డి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు? చివరకు వీరి ప్రేమ సుఖాంతం అయ్యిందా లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

cinima-reviews
తను నేను

ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ‘వర్షం’ చిత్రాన్ని అందించిన దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా పరిచయమవుతున్న తాజా చిత్రం ‘తను నేను’. ‘అష్టాచమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్‌’, ‘ఉయ్యాలా జంపాలా’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్‌.పి దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి చిత్రమిది. ఇందులో అవికా గోర్ హీరోయిన్ గా నటించింది.

డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమా, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘తను నేను’ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు ముఖ్య పాత్రలో నటించాడు. ఈ సినిమా ఈరోజు(నవంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

Video Courtesy : Shreyas Media

ప్లస్ పాయింట్స్:

‘తను నేను’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్న సంతోష్ శోభన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. అక్కడక్కడ హీరో రవితేజ, నానిలను ఇమిటేట్ చేసి అలరించాడు. లవ్, రొమాంటిక్ సీన్లతో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా తనదైన శైలితో ఆకట్టుకున్నాడు. వాయిస్ కూడా బాగుంది. ఇక అవికా గోర్ ఎప్పటిలాగే తన చబ్బి చబ్బి అందాలతో మెప్పించింది. తన పాత్రలో అవికా అదరగొట్టింది. ఇక బండిరెడ్డి సర్వేశ్వరరావు పాత్రలో రవిబాబు ఆకట్టుకున్నాడు. తన పాత్రకు రవిబాబు పూర్తి న్యాయం చేసాడు. ఇక సత్యకృష్ణన్, అభిషేక్, రోహిత్ వర్మలు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో తెగ నవ్వించే సీన్లు లేకపోయినప్పటికీ ఎక్కడా బోర్ గా ఫీలయ్యేవిధంగా అనిపించదు. అందువల్ల సినిమాలోని పాత్రలకు కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేయవచ్చు.

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లో జరిగిన పలు సన్నివేశాలకు సెకండ్ హాఫ్ లో సరైన విధంగా కన్విన్స్ గా చూపించలేదు. సినిమా మొత్తం కామిక్ తరహాలో చెప్పాలని ప్రయత్నించారు కానీ అక్కడే దెబ్బతింది. పలు సీరియస్ సీన్లను కూడా కామెడీ తరహాలో చెప్పడంతో సరైన ఎమోషన్ క్యారీ అవలేదు. ఇక హీరోకి ఎందుకు అమెరికా అంటే అంత కోపమనేదే సినిమాలో కీలకమైన ట్విస్ట్. కానీ దానిని కూడా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్లు చూస్తే ప్రేక్షకులకు ఈజీగా తెలిసిపోతుంది.

ఇక రవిబాబు పాత్ర కూడా ఊహించుకున్నంత పెద్దగా ఏం లేకపోవడం ఆడియన్స్ కాస్త నిరాశే. రవిబాబు-సంతోష్ ల మధ్య వచ్చే పలు సీరియస్ సన్నివేశాలలో కూడా ఎమోషనల్ గా చూపించకపోవడంతో చూసే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవలేదు. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఏదో ఇంట్రెస్ట్ లేనట్లుగా తీసినట్లుగా అనిపిస్తుంది. పలు సీన్లకు లాజిక్స్ కూడా కనిపించలేదు. మొత్తానికి ‘తను నేను’ సినిమా ఫస్ట్ హాఫ్ పర్వాలేదు. సెకండ్ హాఫ్ పోయిందని చెప్పుకోవచ్చు.

సాంకేతికవర్గం పనితీరు:

ఇప్పటివరకు నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రామ్మోహన్.. ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే నిర్మాతగా సక్సెస్ అయినప్పటికీ, దర్శకుడిగా మాత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. కథనం పరంగా సెకండ్ హాఫ్ ను మరింత బాగా డిజైన్ చేసుకొని వుంటే బాగుండేది. కాబట్టి నిర్మాతగా మంచి క్వాలిటీ సినిమాను అందించాడు. ఇక సినిమాటోగ్రఫి చాలా బాగుంది. విజువల్స్ పరంగా చాలా చక్కగా చూపించారు. మ్యూజిక్ పర్వాలేదు. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ అస్సలు బాగోలేదు.

చివరగా:

‘తను నేను’: పాత లవ్ స్టోరి.