Kumari 21F Movie Review | Sukumar | Raj Tarun | Hebah Patel

Teluguwishesh కుమారి 21ఎఫ్ కుమారి 21ఎఫ్ Get information about Kumari 21F Movie Review, Kumari 21F Movie Telugu Review, Raj Tarun Kumari 21F Movie Review, Kumari 21F Movie Review And Rating, Kumari 21F Movie Talk, Kumari 21F Movie Trailer, Raj Tarun Kumari 21F Review, Kumari 21F Movie Gallery and more Product #: 70405 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    కుమారి 21 ఎఫ్

  • బ్యానర్  :

    సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్

  • దర్శకుడు  :

    సూర్య ప్రతాప్ పల్నాటి

  • నిర్మాత  :

    విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి

  • సంగీతం  :

    దేవిశ్రీప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    రత్నవేలు

  • ఎడిటర్  :

    షాన్ అమర్ రెడ్డి

  • నటినటులు  :

    రాజ్ తరుణ్, హేభ పటేల్ తదితరులు

Kumari 21f Movie Review

విడుదల తేది :

2015-11-20

Cinema Story

చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ, డబ్బులు సంపాదిస్తూ తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తుండే కుర్రాడు సిద్ధు(రాజ్ తరుణ్). కుమారి(హేభ పటేల్) ఓ మోడల్. అనుకోకుండా సిద్ధుని ఓరోజు రాత్రి కలుస్తుంది. తొలిచూపులోనే సిద్ధుని, ఇష్టపడి I LOVE YOU కూడా చెప్పేస్తుంది. అంతటితో ఆగకుండా ముద్దు కూడా పెట్టేస్తుంది. ఇక సీరియస్ గా తననే ప్రేమిస్తుందని అనుకున్న సిద్ధుకి కొన్ని సందేహాలు మొదలవుతాయి. అందరు అబ్బాయిలతో చనువుగా వుంటున్న కుమారి అసలు కన్య కాదా అనే అనుమానం వస్తుంది.

అయితే తనను ప్రేమించాలంటే వుండాల్సింది అనుమానం కాదని, మెచ్యురిటీ అని చెబుతోంది కుమారి. ఇంతకీ ఏం జరిగింది? కుమారి నిజంగా కన్యనా కాదా? సిద్ధుకి రావాలసిన మెచ్యురిటి ఏంటి? ఏ విషయంలో? అందుకోసం సిద్ధు ఏం చేసాడు? ఇంతకీ కుమారి ఎవరు? ఆమె గతం ఎంటీ? సిద్ధుకి వచ్చిన కష్టాలను ఎలా పరిష్కరించుకున్నాడు? అనే విషయాలను ‘కుమారి 21 ఎఫ్’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

cinima-reviews
కుమారి 21ఎఫ్

రాజ్ తరుణ్, హేభ పటేల్ జంటగా నటించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధమయ్యింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి నిర్మించిన ఈ చిత్రానికి ఆయనే కథ, స్ర్కీన్ ప్లేను అందించారు. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మించారు.

ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం, ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు ఫోటోగ్రఫీని అందించారు. దేవి సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ వారు A సర్టిఫికెట్ ను అందించారు. యూత్ ఫుల్, రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో చాలా బోల్డ్ సన్నివేశాలున్నాయని తెలిసింది. ఈ సినిమా నేడు(నవంబర్ 20) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!


Video Courtesy : Shreyas Media

Cinema Review

ప్లస్ పాయింట్స్:
ఇప్పటి వరకు రాజ్ తరుణ్ నటించిన రెండు సినిమాల కంటే ఇందులో నటన పరంగా చాలా బాగా మెచ్యురిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం కూడా తన భుజాలపై నడిపించేసాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. సెంటిమెంట్ సీన్లలో అద్భుతంగా నటించాడు. ఇక హీరోయిన్ హేభ పటేల్ తన పాత్రలో జీవించేసింది. హాట్ హాట్ లుక్స్ తో, అందాల ఆరబోత భారీగానే చేసింది. రాజ్ తరుణ్-హేభల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లలో కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్:
ఇలాంటి సినిమాలు కేవలం టీనేజ్ కుర్రాళ్లు తప్ప.. ఫ్యామిలీ, ఎంటర్ టైనర్, యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు అసలే ఇష్టపడరు. కుర్రాళ్లకు కావాల్సిన హాట్ హాట్ సినిమాగా ‘కుమారి21 ఎఫ్’ తెరకెక్కింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు తప్ప ఈ సినిమా అందరికి కూసింత మత్తెక్కించేయడం ఖాయం. ఇకపోతే సెకండ్ హాఫ్ మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో స్ర్కీన్ ప్లే స్లోగా సాగుతుండటంతో చూసే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. సెకండ్ హాఫ్ లో కాస్త ఎడిటింగ్ చేసి వుండుంటే.. రన్ టైం సెట్ అయ్యి, సినిమాలో మంచి జోష్ పెరిగేది.

సాంకేతికవర్గం పనితీరు:
ముందుగా సుకుమార్ గురించి చెప్పుకుందాం. ‘కుమారి21ఎఫ్’తో నిర్మాణరంగంలోకి అడుగెట్టిన సుకుమార్.. ఈ సినిమా ద్వారా యూత్ కు ఓ సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఆ మెసేజ్ ను చాలా బోల్డ్ కాన్సెప్ట్ తో చెప్పాడు. కథ బాగున్నప్పటికీ, కేవలం యూత్ నే టార్గెట్ చేసుకొని తీసినట్లుగా వుంది. ఇక దర్శకుడు సూర్యప్రతాప్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. నటీనటుల నుంచి మంచి పర్ఫార్మెన్స్ ను రాబట్టారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. విజువల్స్ పరంగా పాటలు మరింత గ్రాండ్ గా వున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇక రత్నవేలు ఈ సినిమాకు ప్రధానకర్షణగా చెప్పుకోవచ్చు. చిన్న సినిమాగా రూపొందిన ఈ సినిమాకు రత్నవేలు కూడా చిన్న బడ్జెట్ సినిమాగానే సినిమాటోగ్రఫిని అందించాడు. చాలా గ్రాండ్ గా కాకుండా కథకు తగ్గట్లుగా చూపించాడు. విజువల్స్ పరంగా చాలా బాగున్నాయి. డైలాగ్స్ మరీ దారుణంగా వున్నాయి. ఇలాంటి యూత్ ఫుల్ సినిమాలకు డైలాగ్స్ చాలా ముఖ్యం. అలాంటిది ఈ సినిమాకు భీభత్సమైన బోల్డ్ డైలాగ్స్ వున్నాయి. డైలాగ్స్ విషయంలో కాస్త ఘాటుదనం తగ్గించివుంటే బాగుండేది. ఎడిటింగ్ విషయంలో సెకండ్ హాఫ్ లో కాస్త కత్తెరకు పనిచెప్పి వుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
‘కుమారి21ఎఫ్’: హాట్ హాట్ మసాలా సినిమా