Bruce Lee Movie Review and Rating | Ram Charan Bruce Lee The Fighter

Teluguwishesh బ్రూస్ లీ - ది ఫైటర్ బ్రూస్ లీ - ది ఫైటర్ Discover Bruce Lee The Fighter movie review and rating along with film highlights, analysis. Mega power Ram Charan, Rakul Preet starrer set for a grand release on 16th October 2015 Product #: 69204 3.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    బ్రూస్ లీ - ది ఫైటర్

  • బ్యానర్  :

    డివివి ఎంటర్ టైన్మెంట్స్

  • దర్శకుడు  :

    శ్రీనువైట్ల

  • నిర్మాత  :

    డివివి దానయ్య

  • సంగీతం  :

    థమన్

  • సినిమా రేటింగ్  :

    3.53.53.5  3.5

  • ఛాయాగ్రహణం  :

    మనోజ్ పరమహంస

  • ఎడిటర్  :

    ఎం.ఆర్.వర్మ

  • నటినటులు  :

    రాంచరణ్, రకూల్ ప్రీత్ సింగ్, కృతి కర్బందా, నదియా, అరుణ్ విజయ్ కుమార్ తదితరులు

Bruce Lee Movie Review

విడుదల తేది :

2015-10-16

Cinema Story

తన ప్రపంచం అంతా కూడా తన కుటుంబం(అమ్మ, నాన్న, అక్క) అని భావించే వ్యక్తి కార్తీక్(రాంచరణ్). తన ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే బెండు తీస్తాడు. చిన్నప్పటి నుంచి బ్రూస్ లీ ని రోల్ మోడల్ గా భావిస్తూనే పెరుగుతాడు. జీవనాధారం కోసం సినిమాలలో స్టంట్ మాస్టర్ గా, హీరోలకు డూప్ గా పనిచేస్తుంటాడు. అలాంటి కార్తీక్ ను ఓరోజు పోలీస్ డ్రెస్ లో చూసిన రియా(రకూల్ ప్రీత్ సింగ్) అతని ప్రేమలో పడిపోతుంది. రియాకు చిన్నప్పటి నుంచి పోలీస్ లంటే పిచ్చి. ఎప్పటికైనా పోలీస్ నే పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ వుంటోంది. రియా ఒక వీడియో గేమ్ డెవలపర్ కావడంతో కార్తీక్ ను ఓ సూపర్ హీరోగా పెట్టి ఓ యాక్షన్ గేమ్ డెవలప్ చేస్తూ వుంటుంది.

ఇక సీన్ కట్ చేస్తే... రియా పోలీస్ పిచ్చి వల్ల కొన్ని అనుకోని సంఘటనలకు సమస్యలో పడుతుంది. రియాను కాపాడటం కోసం దీపర్ రాజ్(అరుణ్ విజయ్ కుమార్) మనుషుల బెండు తీస్తాడు కార్తీక్. దీంతో కార్తీక్ కు తెలియకుండానే దీపక్ రాజ్ తో వైరం పెరుగుతూ వుంటుంది. సీన్ కట్ చేస్తే... వసుంధర లాబ్స్ అధినేతలైన జయరాజ్(సంపత్ రాజ్), వసుంధర(నదియా)లు కృతిని తమ ఇంటి కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో కార్తీక్ జీవితంలోకి దీపక్ రూపంలో కొన్ని సమస్యలు వస్తాయి. అలాగే జయరాజ్ గురించి కొన్ని అనుకోని నిజాలు బయటకు తెలుస్తాయి. దీంతో కార్తీక్ ఫ్యామిలీ సమస్యల్లో పడుతుంది. ఆ సమయంలో కార్తీక్ ఏం చేసాడు? అసలు కార్తీక్ ఫ్యామిలీకి వచ్చిన ఇబ్బందులేంటి? దీపక్ రాజ్ ఎవరు? జయరాజ్ గురించి తెలిసిన నిజాలేంటి? కార్తీక్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? అసలు మెగాస్టార్ ఎందుకు రావాల్సి వచ్చింది? అనేది మీరు వెండితెర మీద చూసి ఆనందించాల్సిందే.

cinima-reviews
బ్రూస్ లీ - ది ఫైటర్

శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘బ్రూస్ లీ - ది ఫైటర్’. డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని, సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

థమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఓ గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. కృతి కర్బందా, నదియా, అరుణ్ విజయ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ, లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. తెలుగు, తమిళం భాషలలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా నేడు(అక్టోబర్ 16) గ్రాండ్ గా విడుదల చేసారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది. ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్; లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్, సమర్పణ : డి. పార్వతి, నిర్మాత : దానయ్య డి.వి.వి, దర్శకత్వం: శ్రీనువైట్ల.

ప్లస్ పాయింట్స్:

‘బ్రూస్ లీ’గా మెగా పవర్ స్టార్ రాంచరణ్ అద్భుతంగా నటించాడు. చాలా రోజుల తర్వాత చరణ్ తన బాడీ లాంగ్వేజ్, స్టైల్ పూర్తిగా మార్చేసి కొత్త లుక్ లో కనిపించి మెప్పించాడు. చాలా స్టైలిష్ గా కనిపించాడు. కాస్ట్యూమ్స్, స్టైల్ ఇలా అన్ని యాంగిల్స్ కూడా చరణ్ లుక్స్ సూపర్బ్. ఇక యాక్షన్, డాన్స్ విషయాల్లో చరణ్ చింపేసాడని చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించేసాడు. అంతేకాకుండా ఇందులో చరణ్ కామెడీ యాంగిల్ చాలా బాగుంది.

ఇక హీరోయిన్ గా రకూల్ ప్రీత్ సింగ్ యాక్టింగ్ సూపర్బ్. ఇప్పటివరకు రకూల్ నటించిన అన్ని సినిమాల్లోకంటే ఈ సినిమాలో బెస్ట్ స్ర్కీన్ ప్రెజెన్స్ బ్రూస్ లీ అనే చెప్పుకోవచ్చు. చాలా అందంగా, తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో పిచ్చెక్కించేసింది. అంతే కాకుండా పాటల్లో తన అందాలను భారీగానే ఒలకబోసింది. చరణ్-రకూల్ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది.

ఇక తమిళ నటుడు అరుణ్ విజయ్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. చరణ్ కు సరైన విలన్ గా నిలిచాడు. తన యాక్టింగ్, డైలాగ్స్, స్టైల్ తో అదరగొట్టాడు. ఇక నదియా, కృతి కర్బందా, రావు రమేష్, సంపత్ లు వారి వారి పాత్రలలో జీవించేసారు. ముఖ్యంగా రావు రమేష్-చరణ్ ల మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగానే నటించారు.

ఇక గెస్ట్ రోల్ లో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకోవాలి. మెగాస్టార్ కనిపించిన ఆ 5 నిమిషాలు మాత్రం థియేటర్ దద్దరిల్లిపోయింది. చిరంజీవి చాలా స్టైలిష్ గా మాస్ లుక్ లో అదరగొట్టేసాడు. మెగాస్టార్ ఎంట్రీ సినిమాకు బూస్టర్ గా నిలిచింది. డైలాగ్స్, యాక్షన్, పర్ఫార్మెన్స్ తో చిరంజీవి ప్రేక్షకులకు భారీ ట్రీట్ ను అందించారు.

సినిమా ఫస్ట్ హాఫ్ లో పాత్రలను పరిచయం చేసిన తీరు, స్ర్కీన్ ప్లే చాలా బాగుంది. ఎంటర్ టైనింగ్ తో మొదలుపెట్టి, ఆ తర్వాత ఓ ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్లాక్ ఎపిసోడ్ తో ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా చూసారు. ఇక సెకండ్ హాఫ్ లో కాస్త ఎమోషన్స్, భారీ యాక్షన్స్ బాగా ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్:

‘బ్రూస్ లీ’ సినిమా కథ కొత్తగా ఏం లేదు. కథ పాతదే అయినప్పటికీ కథనం విషయంలో మరింత స్ట్రాంగ్ గా తీసి వుంటే బాగుండేది. కానీ ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా.. సెకండ్ హాఫ్ మాత్రం ఆ రేంజులో లేకపోయింది. సెకండ్ హాఫ్ లో అనవసరపు కామెడీ ఎక్కువయ్యింది. బ్రహ్మానందం కామెడీ అస్సలు వర్కౌట్ కాలేదు.

ఇక బాలీవుడ్ బ్యూటీ టిస్కా చోప్రా పాత్ర చాలా సింపుల్ గా అనిపించింది. ఇలాంటి పాత్రకు టిస్కాను ఎందుకు తీసుకొచ్చారో ఏమో అనే భావన కలుగుతుంది. ఇక ‘బ్రూస్ లీ’ రేంజులో హీరోయిజం వుందంటే.. అందుకు తగ్గ పవర్ ఫుల్ విలన్ కూడా వుండాలి. కానీ ఇందులో విలన్ పాత్రకు అంత స్ట్రాంగ్ గా లేదు. విలన్ పాత్రను సరైన విధంగా డిజైన్ చేయలేదు. దీంతో హీరోయిజం కూడా కాస్త తగ్గినట్లుగానే అనిపిస్తుంది. అలాగే సినిమా రన్ టైం కూడా కాస్త ఎక్కువయ్యింది. సినిమాలో కనీసం 15 నిమిషాలు కట్ చేసిన సినిమా వేగం పెరుగుతుండేది.

సాంకేతికవర్గ పనితీరు:

‘బ్రూస్ లీ’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి. మనోజ్ పరమహంస అందించిన సినిమాటోగ్రఫి అద్భుతం. విజువల్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఫ్రేంను రిచ్ గా, కలర్ఫుల్ గా రూపొందించారు. ఇక ఇలాంటి యాక్షన్ సినిమాకు తన మ్యూజిక్ తో థమన్ చింపేసాడు. థమన్ అందించిన పాటలు ఇప్పటికే భారీ హిట్టయ్యాయి. విజువల్స్ పరంగా ఈ పాటలు థియేటర్లలో ఇంకా బాగున్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. మెగాస్టార్ ఎపిసోడ్ కు కంపోజ్ చేసిన బిట్ సాంగ్ అండ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అనిల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. బ్రూస్ లీ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచాయి.

ఎం.ఆర్ వర్మ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. డైలాగ్స్ బాగున్నాయి. ఇక దర్శకుడిగా శ్రీనువైట్ల పర్వాలేదనిపించాడు. స్ర్కీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. కోన వెంకట్-గోపి మోహన్ లు కథను మరింత పవర్ ఫుల్ గా డిజైన్ చేసుకొని వుంటే బాగుండేది. విలన్ పాత్రను మరింత స్ట్రాంగ్ గా డిజైన్ చేసి వుంటే హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యేది. అలాగే సెకండ్ హాఫ్ లో మరింత డెవలప్ చేసి వుంటే బాగుండేది. నిర్మాత డివివి దానయ్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ చిత్రం చాలా గ్రాండ్ గా రూపొందింది. ప్రతి ఫ్రేం చాలా గ్రాండ్ గా వుంది.

చివరగా:
‘బ్రూస్ లీ- ది ఫైటర్’: ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్.